Pumping station
-
50 ఏళ్ల వరకు హైదరాబాద్‌లో.. తాగునీటికి ఢోకా ఉండదు
పెద్దవూర/నాగార్జునసాగర్: ‘హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటికి, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల వద్ద ఇన్‌టేక్ పంపింగ్ స్టేషన్ నిర్మిస్తున్నాం. వచ్చే వేసవి నాటికి దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’అని మంత్రి కేటీఆర్ చెప్పారు. జంటనగరాలకు వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటికి ఢోకా ఉండదని అన్నారు. నగరానికి సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరమని, దీనికి తగ్గట్టు ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ అని, మరో 15 ఏళ్లలో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నగరం అవుతుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ 159 కిలోమీటర్ల మేర వాటర్ పైప్లైన్లు (రింగ్ మెయిన్)లు వేయాలని నిర్ణయించామని.. దీంతో కృష్ణా, గోదావరి నీళ్లను నగరంలోని ఏ ప్రాంతాలకైనా అందించేందుకు వీలవుతుందని వివరించారు. వరుసగా ఐదేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బంది లేకుండా, ఒక సిస్టమ్‌లో లోపం వచ్చినా మరో సిస్టమ్ ద్వారా తాగునీరు అందేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతకుముందు ఇన్‌టేక్ వెల్ పనులను టన్నెల్లోకి వెళ్లి కేటీఆర్ పరిశీలించారు. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం: తలసాని, సబిత హైదరాబాద్ ప్రజలం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రులు తలసాని, సబితారెడ్డి అన్నారు. నగర ప్రజలకు కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలను, సుంకిశాల నుంచి కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. దలైలామాను ఆహ్వానిద్దాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ మహాస్తూపం నిర్మితమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసేందుకు బౌద్ధ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిద్దామని కేటీఆర్ అన్నారు. బుద్ధవనాన్ని ప్రారంభించిన అనంతరం మహాస్తూపంలోని ఆడిటోరియంలో ఆయన మాట్లాడారు. సీఎం విజన్‌కు తగినట్టు మల్లే్లపల్లి లక్ష్మయ్య, నాగిరెడ్డి ఈ బుద్ధవనాన్ని తీర్చిదిద్దారన్నారు. సీఎం అనుమతితో జరగబోయే కార్యక్రమాలకు దలైలామాను ఆహ్వానిద్దామన్నారు. తెలంగాణలోని ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బాదన్‌కుర్తి లాంటి బౌద్ధ ప్రాం తాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. -
'పాలమూరు'కు అదనంగా రూ.100కోట్లు
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటిపారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లో గతంలో చేసిన డిజైన్ కాకుండా ప్రస్తుత డిజైన్లు, ప్రాధమ్యాలకు తగినట్లుగా మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ రెండు ప్యాకేజీల్లో జరిగే మార్పులతో రూ.100 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను మొదట భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించగా, నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండటం, అటవీ అనుమతుల కోసం జాప్యం జరిగే అవకాశాల నేపథ్యంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని నిర్ణయించింది. అయితే నిర్మాణ ప్రాంత స్థాల మార్పు, పెరిగే వ్యయ భారం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికను రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. పంప్‌హౌజ్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని, దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య పూర్తిగా తప్పుతుందని అందులో తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో ఉన్న స్టేజ్-2, 3, 4 పంప్‌హౌజ్‌లను పూర్తిగా భూగర్భంలోనే నిర్మిస్తున్నారని, అందుకే స్టేజ్-1ను అలాగే కొనసాగించానే అభిప్రాయం వెలిబుచ్చింది. భూగర్భ నిర్మాణానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్(ఎన్ఐఆర్ఎం) సైతం ఆమోదం చెప్పిన విషయాన్ని అందులో పేర్కొంది. గతంలో నిర్ణయించిన నిర్మాణ వ్యయంతో పోలిస్తే, ప్రస్తుత నిర్మాణ వ్యయంలో రూ.50కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని, అయితే భూసేకరణ, అటవీ భూమిని తప్పిస్తున్నందున రూ.50కోట్ల భారం కూడా ఉండదని తేల్చిచెప్పానట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కమిటీ నివేదికకు ఆమోదం దక్కే అవకాశం ఉంది. -
వాటర్ చానల్ వెంట పెట్రోలింగ్
నీటి చౌర్యానికి చెక్ - సమీక్షా సమావేశంలో నిర్ణయం - బాధ్యతల్లో పాలుపంచుకోనున్న మూడు విభాగాల సిబ్బంది గుర్గావ్ : నీటి చౌర్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు జాగ్రత్త చర్యలు తీసుకుం టోంది. ఇందులోభాగంగా గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ) వెంబడి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనుంది. డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా గడచిన మూడు రోజుల వ్యవధిలో గుర్గావ్ వాటర్ చానల్ (జీడబ్ల్యూసీ)లో నీరు 50 శాతం మేర తగ్గింది, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే నిల్వలు ఘోరంగా తగ్గిపోతాయని సమావేశం అనంతరం విడుదలచేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందువల్ల నగరవాసులు నానాయాతనకు గురవ్వాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతోపాటు జీడబ్ల్యూసీ, హుడా, సాగునీటి శాఖల సిబ్బంది కలిసి సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తగు రీతిలో వర్షాలు కురవకపోవడంతో జీడబ్ల్యూసీలో నీటిని రైతులు చౌర్యం చేస్తున్నట్టు తాము అనుమానిస్తున్నామన్నా రు. కాగా జీడబ్ల్యూసీ... సోనేపట్ వద్ద మొదలై రోహ్తక్, ఝజ్జర్ జిల్లాల మీదుగా నగరానికి చేరుకుంటుంది. కాగా పెట్రోలింగ్ విషయమై ఝజ్జర్ డీఎస్పీ అనూప్‌సింగ్ మాట్లాడుతూ తమ జిల్లాలో జీడబ్ల్యూసీ వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పోలీసు, హుడా, సాగునీటి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా గుర్గావ్ నగరానికి ప్రతి రోజూ 140 క్యూసెక్కుల నీరు అవసరమవుతుంది. పంపింగ్ స్టేషన్ నేడు ప్రారంభం నగర పరిధిలోని 42 అనధికార కాలనీవాసులకు నీటి కొరత కష్టాల నుంచి విముక్తి కలగనుంది. కిరారి భూగర్భ జలాశయంకమ్ పంపింగ్ స్టేషన్‌ను ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) శనివారం ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారి శుధ్య విభాగం మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రారంభించనున్నారు. తన బృహత్తర ప్రణాళికలో భాగం గా డీజేబీ దీనిని నిర్మించింది. ఈ పంపింగ్ స్టేషన్ అందుబాటులోకివ స్తే కిరారి శాసనసభా నియోజకవర్గం పరిధిలోని 42 అనధికార కాలనీల్లో నివసించే దాదాపు 1.25 లక్షలమందికి ఉపయుక్తమవుతుంది. -
ఈసారీ వరద ముప్పు తప్పదా?
పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం సాక్షి, ముంబై: నగరంలోని పలు ప్రాంతాలు ఈ ఏడాది కూడా వరద ముప్పు ఎదుర్కోక తప్పదనిపిస్తోంది. దీనికి కారణం పంపింగ్ స్టేషన్ నిర్మాణంలో జాప్యం జరగడమే. అయితే ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు అధికారులకు పట్టడంలేదని విమర్శిస్తున్నారు. నగరంలో 200 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా హైటైడ్ సమయంలో అదేవిధంగా భారీ వర్షాల కారణంగా వరద నీరు ముంచెత్తనుంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గత కొంత కాలం నుంచి వరద నీరును తొలగించేందుకు కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వరద నీరును తొలగిపోవడంలేదు. అయితే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరును తొలగించడం సాధ్యం కాదని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాము లోతట్టు ప్రాంతాల్లో పంప్‌లను ఏర్పాటు చేశామనీ, అంతేకాకుండా వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని 180 పంప్‌లను కూడా అందుబాటులో ఉంచామంటున్నారు. హింద్మాతా, మిలన్ సబ్వే, స్లాటర్ రోడ్, గాంధీ మార్కెట్లు చాలా కీలకమైనవీ. ఇక్కడ ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద నీరు ముచెత్తుతోంది. కాగా, వర్లీలో ఉన్న లవ్గ్రోవర్, క్లెవెలాండ్ బండర్ పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు వచ్చే ఏడాది మే వరకు పూర్తి కానుంది. అయితే ఈ పంపింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది వర్షాకాలంలోనే ఉపయోగంలోకి వస్తాయి. బీఎంసీ చేపట్టిన మురికి కాలువల పూడికతీత సంతృప్తికరంగా లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒక్క భారీ వర్షంతో బీఎంసీ ముందస్తుగా చేపట్టిన పనులన్ని బయట పడుతాయని వారు పేర్కొంటున్నారు. నగరం ‘సాసర్’ ఆకారంలో ఉందని, నగరంలోని వరద నీరును ఎదుర్కోవడానికి అన్ని పంపింగ్ స్టేషన్లును నిర్వహణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎంసీ రిటైర్ట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ ఇందుకు సంబంధించిన పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నగరంలో వెస్ట్ర్న్ రైల్వేలో 26 కల్వర్టులు, సెంట్రల్లో 10, హర్బర్‌లో ఐదు కల్వర్టులు ఉన్నాయి. కానీ రైల్వేల పరిధిలోని మురికి కాలువలను పరిశుభ్రపర్చడానికి బీఎంసీ కేవలం రూ.2.38 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మైక్రో టన్నెలింగ్ కోసం బీఎంసీ రూ.2 కోట్లను మంజూరు చేసింది.