వరంగల్ కైం, న్యూస్‌లైన్ : నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం అర్బన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు, కేసుల పరి శోధన, పురోగతిని ఎస్పీ తెలుసుకున్నా రు. అలాగే, నేరస్తుల అరెస్టులతోపాటు గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, నేరస్తులను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.
అదేవిధంగా పెండింగ్ కేసుల పరిష్కా రం కోసం ఎస్పీ అధికారులకు సూచన లు, సలహాలు చేశారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేసిన సిబ్బందికి ఎ స్పీ వెంకటేశ్వర్‌రావు అభినందనలు తెలి పారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఎన్నికల సందర్భంగా నమోదైన కే సుల వివరాలు, కేసులు ఏ స్థాయి పరిశోధనలో ఉన్నాయో పోలీస్‌స్టేషన్ల వారీగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రజల కు పోలీసులపై మరింత నమ్మకం కలిగేవిధంగా అధికారులు విజిబుల్ పోలీ సింగ్ పెంచాలన్నారు.
నేరాల అదుపు కోసం అధికారులు సిబ్బందితో కలిసి బస్టాండ్, రైల్వే స్టేషన్లు, లాడ్జీల్లో ఆకస్మిక త నిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వర్తించిన అర్బన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలకు ఆయన నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, శాంతిభద్రతల ట్రాఫిక్ ఓఎస్డీలు నాగరాజ్‌కుమార్, అర్బన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
Published Sun, May 25 2014 2:52 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
Advertisement