pending case
-
తెలంగాణ హైకోర్టులో ఎన్ని లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,53,358, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. అంతేగాక ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఈ నెల 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం 59,87,477 కేసులు పెండింగ్ ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. -
ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్మాన్ జాహి కుటుంబానికి హైదరాబాద్ పరిసరాల్లో రూ.వందల కోట్ల విలువైన భూములను గుర్తించేందుకు రిసీవర్ కమ్ కోర్టు కమిషనర్‌ను హైకోర్టు నియమించింది. పైగా భూములను గుర్తించి నివేదిక సమర్పించేవరకు రిజిస్ట్రేషన్లు, అభివృద్ధి ఒప్పందాలకు అనుమతించలేమని తెలిపింది. రిసీవర్ నుంచి నివేదిక అందాక తుది డిక్రీని ప్రకటిస్తామని పేర్కొంది. హైకోర్టులో ఉన్న సీఎస్ 7/1958 పిటిషన్లో కొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేస్తూ ఉత్తర్వులు పొందుతున్నారని..ఇది వివాదాల పెంపునకు కారణమవుతున్న నేపథ్యంలో హైకోర్టు మేరకు నిర్ణయించింది. సీఎస్ 7కు సంబంధించి 2013లో జారీ చేసిన తుది డిక్రీని సవాలు చేస్తూ ఖాజామొయినుద్దీన్, అభివృద్ధి ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ అనిస్ నిర్మాణ సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించింది. మాజీ జిల్లా జడ్జీలు మహమ్మద్ బండె అలి, కె.అజిత్ సింహారావును కొత్త కమిషనర్లుగా నియమించింది. ఆయా గ్రామాల్లోని షెడ్యూలు ఆధారంగా భూములను, వారసులను గుర్తించాలని రాజీ డిక్రీల వివరాలను కొత్త రిసీవర్లకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై మార్చిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రిసీవర్ల నుంచి నివేదిక అందిన తర్వాతే తుది డిక్రీ రూపకల్పన జరుగుతుందని పేర్కొంది. విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. -
చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. అయితే తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును లక్ష్మీపార్వతి కోరారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించ క ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వాదనలను కూడా వినా లని కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సీనియర్ న్యాయవాది హాజరు నిమిత్తం విచారణను వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి రెండోసారి చేసిన అభ్యర్థన మేరకు మళ్లీ విచారణ వాయిదా పడింది. -
ఎనిమిదేళ్ల సమస్యను 7రోజుల్లో పరిష్కరించారు
సాక్షి, నెల్లూరు : ఆ సమస్య ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది. స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు అందించగా ఏడురోజుల్లో పరిష్కరించారు. దీంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేటకు చెందిన కలపాటి మునికృష్ణయ్య, రంగమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. కృష్ణయ్య సైకిల్ షాప్ నిర్వహిస్తుంటాడు. వారికి తమ పక్కింటి వారితో హద్దులు, నడకదారి విషయంలో ఎనిమిదేళ్లుగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో దంపతులు తమ సమస్యను ఎస్పీ ఐశ్వర్యరస్తోగి దృష్టికి తెచ్చారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సమస్యను పరిష్కరించారు. తమకు సహకరించిన నవాబుపేట పోలీస్‌స్టేషన్ సీఐ వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘పెండింగ్’ పరేషాన్ !
నగరపాలక సంస్థ పరిపాలన పరంగా, పన్నుల వసూళ్ల పరంగా, అనుమతులు, లీజుల వ్యవహారంలో నెలకొన్న వివాదాలపై ఇటీవల న్యాయ సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైకోర్టు, స్థానిక కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల తాకిడి నానాటికీ పెరుగుతుంది. వీఎంసీ ఒంటెత్తు పోకడ వల్లే కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయని, వీటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు... సాక్షి, అమరావతి బ్యూరో: అధికారుల అవగాహన లోపం.. పాలనపరంగా నెలకొన్న లొసుగులు.. అధికారుల ఏకపక్షతీరుతో ఎదుర్కొంటున్న ట్రిబ్యునల్ కేసులు ఇప్పుడు నగర పాలక సంస్థకు గుదిబండగా మారాయి. పిటిషనర్లు దాఖలు చేసిన అర్జీలు, ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోకపోవటం, రూల్స్ అమలు చేసే విధానంలో ఏకపక్షంగా వ్యవహరించటం, రికార్డుల నిర్వాహణలో లోపాలు, చట్టం నిర్ధేశించిన పద్ధతి కాదని అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించటం వంటి కారణాలతో ఇప్పుడు నగరపాలక సంస్థ ఆయా కోర్టుల్లో 904 కేసులు ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి లీగల్‌సెల్ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఆయా కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటం, నివేదికలు అందించకపోవటం, రికార్డులు పంపిణీ చేయటంలో విఫలమవ్వడంతో కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు నిబంధనలను అమలు చేయటంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నచోట స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే కేసును కోర్టువరకు కాకుండా మధ్యవర్తుల వద్దే పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నా, అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వల్ల కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ నుంచే అత్యధికం.. వీఎంసీలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే కేసులు అధికంగా దాఖలవుతున్నాయి. భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల్లో జాప్యం, అక్రమకట్టడాలు, అక్రమ కట్టడాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించటంలో విఫలమవ్వడం, రోడ్డు విస్తరణలు, మాస్టర్‌ప్లాన్ అమలు, ఆక్రమణలు క్రమబద్ధీకరణ వంటి కారణాలతో వీఎంసీ న్యాయ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగంపై రాష్ట్ర హైకోర్టులో 327 కేసులు, ఏపీ ట్రిబ్యునల్‌లో ఒకటి, స్థానిక కోర్టుల్లో 105 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో ఖాళీ స్థలాలకు పన్నులు వేసే సమయంలో జాగ్రత్తలు పాటింకచకోవటం, రాయితీలు, ఆస్తిపన్నుల వ్యవహారంలో జోన్ కేటగిరీల్లో మార్పులు, రాయితీల వ్యవహరంలో నిర్లక్ష్యంగా ఉండటం తదితర కారణాలతో హైకోర్టులో 208 కేసులు నమోదయ్యాయి, స్థానిక కోర్టుల్లో 29 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నగరపాలక సంస్థ ఆస్తుల పరిరక్షణ, లీజులు, అద్దెలు, లీజుల పునరుద్ధరణ తదితర అంశాలకు సంబంధించి హైకోర్టులో 51 కేసులు, స్థానిక కోర్టులో 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో వివిధ రకాల నిర్మాణాల సమయంలో స్థల యజమాన్యాల హక్కుల వివాదం, సౌకర్యాల కల్పనలో వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తదితర కారణాలతో హైకోర్టులో 48 కేసులు, స్థానిక కోర్టులో 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్ కాల్వల నిర్వాహణపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కరించకపోవటం, డీఅండ్‌ఓ ట్రేడ్‌లైసెన్స్‌లు ఇచ్చే వివాదంలో కేసులు, న్యూసెన్స్, పొల్యూషన్, ఆరోగ్యపరమైన అంశాల్లో హైకోర్టులో 54 కేసులు, ఏపీ ట్రిబ్యునల్ల్లో ఒకకేసు, స్థానిక కోర్టులో 5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయ. అడ్మినిస్ట్రేషన్–ఎడ్యుకేషన్ విభాగంలో ఉద్యోగులు, అధికారులు ఉద్యోగపరమైన సమస్యలు, సీనియారిటీ, ప్రమోషన్లు, క్రమ శిక్షణ చర్యలు వంటి వాటిపై సిబ్బంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీటిపై హైకోర్టులో 14 కేసులు ఉండగా, ట్రిబ్యునల్‌లో ఆరు కేసులు, స్థానిక కోర్టులో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఇతర కేసులు 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. లీగల్సెల్పై సమీక్ష పటమట(విజయవాడ తూర్పు): నగర పాలక సంస్థపై వివిధ విభాగాల అధికారులను సమన్వయపరచి కేసుల పరిష్కరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. శనివారం వీఎంసీ కౌన్సిల్ హాల్లో లీగల్సెల్పై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో నగరపాలక సంస్థపై దీర్ఘకాలికంగా ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు అధికారులు, ఎంఎస్సీలు కలిసి సమన్వయంతో పనిచేయాలని మేయర్ సూచించారు. కార్పొరేటర్లు పలు సూచనలు చేశారు. -
మీ బాధ నాకు తెలుసు, సాయం చేస్తాను: మోదీ
అలహాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తొలగించేందుకు, పెండింగ్ కేసుల తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సాయం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్‌కు హామీ ఇచ్చారు. 'న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్న చీఫ్ జస్టిస్ సంకల్పానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను ఆయనకు హామీ ఇస్తున్నాను' అని మోదీ అన్నారు. అలహాబాద్ హైకోర్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖేహర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనలోని బాధ తనకు అర్థమైందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 1200 పాత చట్టాలను తొలగించి.. న్యాయవ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేసిందని అన్నారు. కోర్టుల పనితీరును సరళీకరించేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు టెక్నాలజీ వినియోగాన్ని చీఫ్ జస్టిస్ తీసుకొచ్చారంటూ మోదీ ప్రశంసించారు. -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
కడప అర్బన్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, వీలైనంత వరకు లోక్ అదాలత్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు అన్నారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవనంలో శనివారం మెజిస్ట్రేట్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టులలో ఎక్కువకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా కృషి జరగాలన్నారు. న్యాయపరమైన సందేహాలుంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. లేదా సీనియర్ జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను సంప్రదించాలన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా మరింత న్యాయ పరిజ్ఞానాన్ని పొందేందుకు కృషి చేయాలన్నారు. మెజిస్ట్రేట్లు తాము ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటికి పరిష్కార మార్గాలను సూచించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీతాపతి, జిల్లా కోర్టు రిటైర్డ్ జడ్జి మాధవరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లాలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న మెజిస్ట్రేట్లు పాల్గొన్నారు. -
పెండింగ్‌పైనే ఫోకస్
పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రాబోయే ఆరు నెలల్లో 30 నుంచి 40 శాతం కేసుల విచారణ పూర్తి చేయడమే లక్ష్యం. రేంజ్ పరిధిలోని రెండు జిల్లాల్లోనూ పెండింగ్ కేసులు పెరిగిపోయాయి. కరీంనగర్లో 2,844 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 3,274 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం. వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. - భీమానాయక్, కరీంనగర్ రేంజ్ డీఐజీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పెండింగ్ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ రేంజ్ డీఐజీ బీమానాయక్ తెలిపారు. బుధవారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గడిచిన ఆరు నెలలకు సంబంధించి నేర సమీక్ష వివరాలను డీఐజీ వెల్లడించారు. ‘పోలీస్‌శాఖ తరఫున కరీంనగర్ జిల్లాలో 27,188 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 14051 కేసులు కోర్టు ట్రయల్‌లో ఉన్నాయి. వీటి విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. దీంతో ఎన్ని కేసులు ఉన్నాయి... ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? ఎవరెవరు హాజరయ్యారు? కేసు ఏ రోజుకు వాయిదా పడింది? అంటూ కేసుల పురోగతి ఏ రోజుకారోజు జిల్లా ఎస్పీలకు సమాచారం అందుతోంది. వెంటనే వీటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. రెండు జిల్లాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. అందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా తగిన జాగ్రత్తలు తీసుకుందన్నారు. ‘రెండు జిల్లాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిత్యం పోలీసు పార్టీల కూంబింగ్ జరుగుతోంది. దీంతో మన ప్రాంతంలోకి నక్సలైట్లు రాకుండా కట్టడి చేయగలుగుతున్నాం. గడిచిన ఆరు నెలల్లో రెండు జిల్లాల్లోనూ ఇతరత్రా నేరాల సంఖ్య పెరిగిపోయింది. కరీంనగర్లో 2,200 వారంట్లు, ఆదిలాబాద్‌లో 1,504 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ సర్టిఫికెట్లు అందక కరీంనగర్లో 152 కేసులు, ఆదిలాబాద్‌లో 206 కేసులు, పోస్టుమార్టం నివేదికలు అందక కరీంనగర్లో 110, ఆదిలాబాద్‌లో 128 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే కాకుండా కరీంనగర్‌కు సంబంధించి 162, ఆదిలాబాద్‌లో 257 ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉంది. వీటిని త్వరగా తెప్పించి కేసులను తెల్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాం’ అని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసుల్లో 80 శాతం తప్పుడు కేసులే ఉంటున్నాయని డీఐజీ తెలిపారు. ఇవన్నీ తమ పరిధిలోనే కొట్టుడుపోతున్నాయని చెప్పారు. అందుకే ఈ చట్టా న్ని దుర్వినియోగం చేయొద్దని, నిజంగా అన్యా యం జరిగితేనే బాధితులు కేసులు నమోదు చేయాలని సూచించారు. లేకుంటే ఈ కేసులపై ప్రజలకు తేలికభావం ఏర్పడుతుందని.. నమ్మకం పోతుందని డీఐజీ అన్నారు. 498 (ఏ)కు అనుమతి తప్పనిసరి ‘మహిళలకు సంబంధించి గృహహింస కేసుల్లోనూ 498 సెక్షన్ దుర్వినియోగం అవుతోంది. దాదాపు యాభై శాతం కేసులు కౌన్సెలింగ్ కేంద్రాల్లో పరిష్కారం చేస్తున్నాం. భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదుకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ కేసులు పక్కదారి పడుతున్నాయి. భర్తను అరెస్టు చేయాల్సి వచ్చినా.. వారి కుటుంబసభ్యులను అరెస్టు చేసేందుకు ఎస్పీ అనుమతి తప్పకుండా తీసుకోవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశాం’ అని డీఐజీ తెలిపారు. జిల్లాలో చిట్‌ఫండ్, ఫైనాన్స్ మోసాలు.. ఇతర ఆర్థికనేరాలు పెరిగిపోయాయని, నియంత్రిం చేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఫిర్యాదుకు 30 రోజులు ‘పోలీసు విభాగంపై ప్రజలకు ఎంతో నమ్మకముంది. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే స్టేషన్లకు వస్తారు. అందుకే స్టేషన్లలోని రిసెప్షన్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించాలి. వాటిపై వెంటనే స్పందించాలి. నేర సంబంధిత ఫిర్యాదు అయితే... వెంటనే కేసు నమోదు చేయాలి. లేకుంటే బాధితుల సమస్య కు పరిష్కారం ఎక్కడ లభిస్తుందో మార్గదర్శనం చేయాలి. ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకూడదు. దీంతో జవాబుదారీతనం పెరుగుతుం ది. అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. క్వార్టర్లకు ప్రతిపాదనలు రెండు జిల్లాల్లో పోలీసు సిబ్బంది క్వార్టర్లు దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. చాలాచోట్ల శిథి లమైపోయాయి. వీటిని పూర్తిగా కూల్చివేసి.. కొత్త వాటికి ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే ఎస్పీలకు సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం హడ్కో రుణంతో కొత్త క్వార్టర్లు నిర్మించే ఆలోచనతో ఉన్నదని తెలిపారు. -
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి
సాక్షి, సిటీబ్యూరో: ఠాణాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. నేరాల అదుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నగర సీసీఎస్ పోలీసు అధికారులతో ఇటీవలే సమావేశమైన మహేందర్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో అదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఠాణా పరిధిలో జరుగుతున్న నేరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేసినప్పుడే పోలీసులకు గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. బస్తీలు, కాలనీల్లో రోజురోజుకు పెరుగుతున్న స్నాచింగ్ ముఠాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వేళ్లల్లో బ్లూకోర్ట్స్ పోలీసుల గస్తీని పెంచడంతో పాటు తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. రాత్రి దొంగతనాలు, పగటిపూట ఇంటి తాళాలు పగులగొట్టే ముఠాలపై కనే ్నయాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న పోలీసు వాహనాల స్థానంలో త్వరలో కొత్త పెట్రోలింగ్ వ్యాన్లు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అధికారులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పో లీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. -
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
వరంగల్ కైం, న్యూస్‌లైన్ : నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం అర్బన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు, కేసుల పరి శోధన, పురోగతిని ఎస్పీ తెలుసుకున్నా రు. అలాగే, నేరస్తుల అరెస్టులతోపాటు గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, నేరస్తులను అరెస్టు చేయకపోవడానికి గల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా పెండింగ్ కేసుల పరిష్కా రం కోసం ఎస్పీ అధికారులకు సూచన లు, సలహాలు చేశారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేసిన సిబ్బందికి ఎ స్పీ వెంకటేశ్వర్రావు అభినందనలు తెలి పారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఎన్నికల సందర్భంగా నమోదైన కే సుల వివరాలు, కేసులు ఏ స్థాయి పరిశోధనలో ఉన్నాయో పోలీస్స్టేషన్ల వారీగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రజల కు పోలీసులపై మరింత నమ్మకం కలిగేవిధంగా అధికారులు విజిబుల్ పోలీ సింగ్ పెంచాలన్నారు. నేరాల అదుపు కోసం అధికారులు సిబ్బందితో కలిసి బస్టాండ్, రైల్వే స్టేషన్లు, లాడ్జీల్లో ఆకస్మిక త నిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వర్తించిన అర్బన్ పరిధిలోని ఎస్సైలు, సీఐలకు ఆయన నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, శాంతిభద్రతల ట్రాఫిక్ ఓఎస్డీలు నాగరాజ్‌కుమార్, అర్బన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నేడు అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్
రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల కేసుల పరిష్కారం లక్ష్యం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 44 వేల కేసులను లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 6,670, క్రిమినల్ కేసులు 15,959, ప్రీలిటిగేషన్ (సివిల్, క్రిమినల్) కేసులు 22,413 ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నిర్వహించడం లేదని తెలిపారు. మన రాష్ట్రంలో ఎన్నికలు లేని నేపథ్యంలో మెగా లోక్‌అదాలత్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం అనుమతించారని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, జస్టిస్ రోహిణిల పర్యవేక్షణలో లోక్‌అదాలత్ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న 33 వేల కేసుల్లో ఇరువర్గాలకు ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల చైర్మన్ సహకారంతో అన్ని కోర్టుల్లో లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నామని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు వేల కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కందుకూరి అశోక్‌బాబు తెలిపారు. అలాగే జంట నగరాల పరిధిలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 2,500 కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని నాంపల్లి క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజిని చెప్పారు.