సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,53,358, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. అంతేగాక ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని వెల్లడించారు.
సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం ఈ నెల 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 69,511 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అదే సమయంలో దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం 59,87,477 కేసులు పెండింగ్ ఉన్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment