ఎనిమిదేళ్ల సమస్యను 7రోజుల్లో పరిష్కరించారు  | Police Resolved The 8 Years Pending Case In 7Days In Nellore | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల సమస్యను 7రోజుల్లో పరిష్కరించారు 

Published Tue, Nov 12 2019 10:30 AM | Last Updated on Tue, Nov 12 2019 10:34 AM

Police Resolved The 8 Years Pending Case In 7Days In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆ సమస్య ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది. స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు అందించగా ఏడురోజుల్లో పరిష్కరించారు. దీంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేటకు చెందిన కలపాటి మునికృష్ణయ్య, రంగమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. కృష్ణయ్య సైకిల్‌ షాప్‌ నిర్వహిస్తుంటాడు. వారికి తమ పక్కింటి వారితో హద్దులు, నడకదారి విషయంలో ఎనిమిదేళ్లుగా వివాదం ఉంది.

ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో దంపతులు తమ సమస్యను ఎస్పీ ఐశ్వర్యరస్తోగి దృష్టికి తెచ్చారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సమస్యను పరిష్కరించారు. తమకు సహకరించిన నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ సీఐ వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement