పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి
సాక్షి, సిటీబ్యూరో: ఠాణాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. నేరాల అదుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నగర సీసీఎస్ పోలీసు అధికారులతో ఇటీవలే సమావేశమైన మహేందర్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో అదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఠాణా పరిధిలో జరుగుతున్న నేరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేసినప్పుడే పోలీసులకు గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. బస్తీలు, కాలనీల్లో రోజురోజుకు పెరుగుతున్న స్నాచింగ్ ముఠాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వేళ్లల్లో బ్లూకోర్ట్స్ పోలీసుల గస్తీని పెంచడంతో పాటు తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. రాత్రి దొంగతనాలు, పగటిపూట ఇంటి తాళాలు పగులగొట్టే ముఠాలపై కనే ్నయాలని ఆదేశించారు.
శిథిలావస్థకు చేరుకున్న పోలీసు వాహనాల స్థానంలో త్వరలో కొత్త పెట్రోలింగ్ వ్యాన్‌లు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అధికారులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పో లీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.