![Delhi Cops Patrolling On Tractor Ahead Of G20 Summit - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/7/tractor_img.jpg.webp?itok=56n5y26p)
ఢిల్లీ: జీ20 సదస్సుకు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దాదాపు లక్ష మంది పోలీసులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. అవసరమైన ప్రాంతాలలో చెకింగ్ ఏర్పాట్లు చేశారు.
నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | In view of the upcoming G20 Summit, Delhi Police is patrolling the Raj Ghat area with the help of a tractor. pic.twitter.com/lJo0Wevrvs
— ANI (@ANI) September 7, 2023
వీడియోలో యమునా నది దృశ్యాలు కనిపిస్తున్నాయి. మట్టి రహదారిలో పోలీసులు ట్రాక్టర్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రపంచ స్థాయి నేతలు ఢిల్లీకి రానున్నందున పోలీసులు ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుంటా చెకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
'సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. సమావేశం నిర్వహించనున్న ప్రాంతానికి సమీపంలో ఉన్నందున యమునా ఖాదర్ ప్రాంతంలో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఈరోజు టియర్ గ్యాస్ ప్రాక్టీస్ కూడా చేశాం' అని షహద్రా డీసీపీ ఇన్‌ఛార్జ్ హర్ష్ ఇండోరా తెలిపారు.
ఇదీ చదవండి: G20 Summit: రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు.. ఎవరెవరికి బస ఎక్కడంటే..?
Comments
Please login to add a commentAdd a comment