న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా భారత్‌లో తమ 6జీ ల్యాబ్‌ను నెలకొల్పింది. కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. భారత్‌ను నూతన ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల సాధన దిశగా ఇది మరో ముందడుగని ఆయన తెలిపారు.
సురక్షితమైన రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర విభాగాలకు ఉపయోగపడగలిగే 6జీ టెక్నాలజీ ఆధారిత నవకల్పనలపై ఈ ల్యాబ్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరులోని తమ గ్లోబల్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ సెంటర్‌లో నోకియా దీన్ని ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికే 6జీ టెక్నాలజీలో 200 పైచిలుకు పేటెంట్లు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment