నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన సీ12 లైనప్‍లో మరో కొత్త 'సీ12 ప్లస్' మొబైల్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‍లో సీ12, సీ12 ప్రో ఉన్నాయి. నోకియా నుంచి విడుదలైన ఈ కొత్త సీ12 ప్లస్ ధర రూ. 7,999. ఈ లేటెస్ట్ మొబైల్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సరసమైన ధర వద్ద విడుదలైన ఈ మొబైల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేట్స్ పొందింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‍తో అడుగుపెట్టింది. ధర ప్రకటించినప్పటికీ సేల్ తేదీని నోకియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలో వెల్లడించే ఛాన్స్ అవకాశం ఉందని భావిస్తున్నాము.
(ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!)
నోకియా సీ12 ప్లస్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది 6.3 ఇంచెస్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఫ్రంట్ కెమెరా కోసం టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజిని పెంచుకోవడానికి మైక్రో ఎస్‍డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది.
(ఇదీ చదవండి: Dharampal Gulati: వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..)
కొత్త నోకియా సీ12 ప్లస్ మొబైల్ 4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‍బీ-పోర్టు, 3.5 మిమీ హెడ్‍ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. కెమెరా పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున వీడియో కాల్స్, సెల్ఫీ వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment