Mobile launchings
-
కేవలం రూ. 7,999కే నోకియా కొత్త మొబైల్ - పూర్తి వివరాలు
నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన సీ12 లైనప్‌లో మరో కొత్త 'సీ12 ప్లస్' మొబైల్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో సీ12, సీ12 ప్రో ఉన్నాయి. నోకియా నుంచి విడుదలైన ఈ కొత్త సీ12 ప్లస్ ధర రూ. 7,999. ఈ లేటెస్ట్ మొబైల్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సరసమైన ధర వద్ద విడుదలైన ఈ మొబైల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేట్స్ పొందింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో అడుగుపెట్టింది. ధర ప్రకటించినప్పటికీ సేల్ తేదీని నోకియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలో వెల్లడించే ఛాన్స్ అవకాశం ఉందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) నోకియా సీ12 ప్లస్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది 6.3 ఇంచెస్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో ఫ్రంట్ కెమెరా కోసం టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజిని పెంచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: Dharampal Gulati: వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..) కొత్త నోకియా సీ12 ప్లస్ మొబైల్ 4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ-పోర్టు, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. కెమెరా పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున వీడియో కాల్స్, సెల్ఫీ వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. -
ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన మొబైల్ లాంచ్.. ధర కూడా తక్కువే!
ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలవుతోంది. ఇందులో భాగంగానే మోటోరోలా కంపెనీ జీ సిరీస్‌లో మరో బడ్జెట్ 5జీ ఫోన్ విడుదల చేసింది. ఈ కొత్త మొబైల్ కేవలం ఒకే వేరియంట్లో రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కొత్త మోటో జీ73 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ల్యుసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలని అందుబాటులో ఉంటుంది. కార్డు ఆఫర్ ద్వార కొనుగోలు చేసేవారు రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా వినియోగించుకోవచ్చు. మోటో జీ73 5జీ మొబైల్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎల్సీడీ డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్‌కు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ వస్తుందని మోటోరోలా తెలిపింది. (ఇదీ చదవండి: బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?) లేటెస్ట్ మోటో జీ73 5జీ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా పొందుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో పొందవచ్చు. -
రెడీగా ఉండండి.. అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే!
OnePlus 10T 5G Launch: వన్‌ప్లస్ మొబైల్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఈ సంస్ధ మార్కెట్లోకి త్వరలో తీసుకురానున్న వన్‌ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) విడుదల తేదీ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో వన్‌ప్లస్ 10Tని గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని తన ల్యాండింగ్ పేజ్‌లో వెల్లడించింది. ఈ ఫోన్‌కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని చూస్తే.. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 360 డిగ్రీ యాంటినా సిస్టమ్‌ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్లో వన్‌ప్లస్ సరికొత్త ఆక్సిజన్ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది. భారత్: OnePlus 10T ధర (అంచనా) నివేదిక ప్రకారం OnePlus 10T 5G ధర CNY3,000 (చైనా యువాన్లు) (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500), CNY 4,000 (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400) మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999(భారత్‌లో) ఉంటుందని సమాచారం. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. OnePlus 10T ఫీచర్లు (అంచనా) అమెజాన్ లిస్టింగ్ పేజ్ ద్వారా వన్‌ప్లస్ 10టీ 5జీకి చెందిన ప్రాసెసర్ వివరాలు బయటికి వచ్చాయి. ♦ OnePlus 10T: Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ఫీచర్‌తో రానుంది. ♦ హ్యాండ్సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ♦ పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే ♦ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ♦ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్ ♦ 16GB LPDDR5 RAMతో పాటు 512GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్ ♦ కలర్స్: బ్లాక్, గ్రీన్ చదవండి: Vedanta Share Price: లాభాల్లో షేర్ మార్కెట్.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్! -
మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310
హైదరాబాద్: హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ తాజాగా నోకియా5310 ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ పేరుతో వచ్చిన ఫీచర్ ఫోన్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి అందిస్తున్నామని హెచ్ఎమ్డీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ. 3,399 అని తెలిపారు. ఈ ఫోన్లో ఇన్‌బిల్ట్ ఎమ్పీ 3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, వెనక వైపు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 16 ఎమ్బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. ఈ నెల 23 నుంచి నోకియా ఇండియా ఆన్లైన్, అమెజాన్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 23 నుంచి రిటైల్ స్టోర్స్‌లో లభ్యం కానున్నది. -
మొబైలే నా ప్రపంచం అంటున్న హీరోయిన్ సిమ్రన్
-
స్మార్ట్ఫోన్ల ట్రెండ్ రివర్స్
భారత్‌లో మొబైల్ పరిశ్రమ... ఇన్నాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో కొత్తపుంతలు తొక్కుతూ దూసుకెళ్లింది. 2జీ, 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌లతో అత్యాధునికమైన ఫీచర్లున్న ఫోన్లను మనం చూశాం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు విపరీతమైన దూకుడుకు ఉన్న భారత్‌పై మొబైల్ కంపెనీలన్నీ దృష్టిపెట్టాయి. కానీ ఈ దూకుడుకు గత మూడేళ్లలో మొదటిసారి బ్రేక్ పడిందట. ముందటి ఏళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ప్రథమార్థంలో ట్రెండ్ రివర్స్ అయింది. కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్ పడిపోయిందట. ధరల విషయంలో వినియోగదారుల అభిరుచుల మార్పు, చైనీస్ బ్రాండ్లనుంచి నెలకొన్న తీవ్ర పోటీ వాతావరణం, బహుళజాతీయ కంపెనీల ఏర్పాటు వంటివి స్మార్ట్ఫోన్ల దూకుడుకు అడ్డుకట్టవేశాయని భారత మొబైల్ ఫోన్ పరిశ్రమ తెలిపింది. 2016 ప్రథమార్థంలో మొబైల్ పరిశ్రమ తీరుతెన్నులు... దేశీయంగా మొబైల్ ఫోన్ ఆవిష్కరణలు 2015 ప్రథమార్థంతో పోలిస్తే, 2016 ప్రథమార్థంలో 29 శాతం క్షీణించాయి. మొదటిసారి వినియోగదారులు రూ.5000కు తక్కువున్న ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ ఫోన్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. ముందటిలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీనే స్మార్ట్ఫోన్లకు రారాజుగా నిలిచింది. మైక్రోమ్యాక్స్, హెచ్టీసీలను వెనక్కినెట్టేసి, లెనోవా, షియోమిలు వాటి స్థానాలను ఆక్రమించుకున్నాయి. వివో తర్వాత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా ఓపో నిలిచింది. ముందటి కాలంలో మొబైల్ పరిశ్రమను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రీ ఫోన్లు మెల్లమెల్లగా కనుమరుగయ్యే స్థానానికి పడిపోతున్నాయి. అదేవిధంగా మైక్రోమ్యాక్స్ వైయూ ఈ ఏడాది కూడా విజయ బాటలో నడవలేక సతికల పడిపోయింది. చైనీస్ బ్రాండ్లు యూజర్ వీక్షణలో తమ షేరును 2015 ప్రథమార్థం కంటే 2016 ప్రథమార్థంలో రెట్టింపు చేసుకున్నాయి. ఆన్లైన్లో మాత్రమే ఇన్నాళ్లు ఫోన్లను విక్రయించే కంపెనీలు, ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఆన్లైన్ మార్కెట్లో కఠినతరమైన నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తేవడమే. దీంతో భారీ డిస్కౌంట్లకు కళ్లెం పడింది. షియోమి రెడ్మి నోట్3, 2016 ప్రథమార్థంలో మోస్ట్ పాపులర్ ఫోన్‌గా చోటు దక్కించుకుంది.