మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310 | HMD Global launches Nokia 5310 in India | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్కెట్లోకి నోకియా 5310

Jun 17 2020 5:50 AM | Updated on Jun 17 2020 5:50 AM

HMD Global launches Nokia 5310 in India - Sakshi

హైదరాబాద్‌: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ సంస్థ తాజాగా నోకియా5310 ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 2007లో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ పేరుతో వచ్చిన ఫీచర్‌ ఫోన్‌ను మరింత అప్‌గ్రేడ్‌ చేసి అందిస్తున్నామని హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సన్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.  ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ధర రూ. 3,399 అని తెలిపారు. ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌ ఎమ్‌పీ 3 ప్లేయర్, వైర్లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియో, వెనక వైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా.  2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 16 ఎమ్‌బీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమెరీ, 1,200 ఎమ్‌ఏహెచ్‌  బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి.  ఈ నెల 23  నుంచి నోకియా ఇండియా ఆన్‌లైన్, అమెజాన్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వచ్చే  నెల 23 నుంచి రిటైల్‌ స్టోర్స్‌లో లభ్యం కానున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement