'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా? | Nokia 3210 4G Launch In India: Check Price | Sakshi
Sakshi News home page

'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?

Published Tue, Jun 11 2024 7:08 PM

Nokia 3210 4G launched in India Price Details

నోకియా బ్రాండ్ ఫోన్‌లను తయారు చేసే హెచ్ఎండీ కంపెనీ సుమారు 25 సంవత్సరాల తరువాత మార్కెట్లో 'నోకియా 3210 4జీ' ఫోన్ లాంచ్ చేసింది. కాలంలో కలిసిపోయిందనుకున్న ఈ ఫోన్ మళ్ళీ కనిపించడంతో నోకియా ప్రియులు సంబరపడిపోతున్నారు.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3210 4జీ ధర రూ. 3999. దీనిని ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో లేదా హెచ్ఎండీ వెబ్‌సైట్‌లో కొనుకోగలు చేయవచ్చు. ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తుంది. టీ107 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ కీబోర్డుతి వస్తుంది.

ఈ కొత్త నోకియా 3210 4జీ ఫోనులో అందరికీ ఇష్టమైన 'స్నేక్' గేమ్ కూడా ఉంది. 64 ఎంబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 128 ఎంబీ స్టోరేజ్ పొందుతుంది. దీనిని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి SD కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ వంటి వాటి కోసం యాప్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

కెమెరా కోసం నోకియా 3210 4జీ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు 1450 mAh రినోవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది యూఎస్‌బీ టైప్-సీ ఛార్జ్ పోర్టుతో వస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement