OnePlus 10T 5G Launch: వన్‌ప్లస్ మొబైల్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఈ సంస్ధ మార్కెట్‌లోకి త్వరలో తీసుకురానున్న వన్‌ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) విడుదల తేదీ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో వన్‌ప్లస్ 10Tని గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌లో ఈ ఫోన్ లిస్ట్ అయింది.
ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని తన ల్యాండింగ్ పేజ్‌లో వెల్లడించింది. ఈ ఫోన్‌కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని చూస్తే.. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 360 డిగ్రీ యాంటినా సిస్టమ్‌ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్‌లో వన్‌ప్లస్ సరికొత్త ఆక్సిజన్‌ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది.
భారత్: OnePlus 10T ధర (అంచనా)
నివేదిక ప్రకారం OnePlus 10T 5G ధర CNY3,000 (చైనా యువాన్లు) (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500), CNY 4,000 (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400) మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999(భారత్‌లో) ఉంటుందని సమాచారం. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
OnePlus 10T ఫీచర్లు (అంచనా)
అమెజాన్ లిస్టింగ్ పేజ్ ద్వారా వన్‌ప్లస్ 10టీ 5జీకి చెందిన ప్రాసెసర్ వివరాలు బయటికి వచ్చాయి.
♦ OnePlus 10T: Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ఫీచర్‌తో రానుంది.
♦ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్
♦ పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
♦ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.
♦ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్
♦ 16GB LPDDR5 RAMతో పాటు 512GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్
♦ కలర్స్: బ్లాక్, గ్రీన్
చదవండి: Vedanta Share Price: లాభాల్లో షేర్ మార్కెట్.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment