దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలు ఉపయోగించాలంటే వినియోగదారుల ఫోన్ 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్‌గా ఉంటోంది. ఒకవేళ మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జీ అనేది కనిపించకపోతే, మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేయదనే అర్థం.
అలాంటప్పుడు మాత్రం మీరు 5జీని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో 5G స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022లో 5జీ స్మార్ట్‌ఫోన్లకు డిస్కౌంట్లు, ఆఫర్స్ ఇస్తూ చవకైన ధరలకే సేల్ నిర్వహిస్తోంది.
రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G)
Redmi 11 Prime 5G .. 4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 గా ఉంది. దసరా సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో ఇది తగ్గింపుతో రూ. 12,999 వస్తోంది. దీంతో పాటు అదనంగా, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ 12,150 కే లభిస్తోంది. ఈఎంఐ( EMI) ఆఫర్ కూడా ఉందండోయ్, నెలకు రూ.621తో ఈ ఫోన్‌ని మీరు సొంతం చేసుకోవచ్చు. Amazon Pay ఆధారంగా అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.
రియల్‌మి నార్జో 50 5జీ (Realme Narzo 50 5G)
రియల్‌మి నుంచి వచ్చిన మరో 5జి స్మార్ట్ ఫోన్లలో రియల్ మి నార్జో 50 5Gనే చవకైన ఫోన్ అని చెప్పాలి. మార్కెట్లోకి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999 గా ఉంది. ఇదే ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 12,249 గా లభిస్తోంది. వీటితో మీ వద్ద పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈఎంఐ చెల్లింపులో ఫోన్ ని కొనుగోలు చేస్తే.. రూ 750 కే ఈ ఫోన్ లభిస్తుంది.
ఐకూ z6 లైట్ 5G (iQoo Z6 Lite 5G)
iQoo Z6 Lite 5G బేస్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా భారీగానే ఇస్తున్నారు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు రూ. ఫ్లాట్-రేట్‌పై అదనపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం13 5G (Samsung Galaxy M13 5G)
Samsung Galaxy M13 5G ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.11,999. ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లకి ప్రత్యేక డిస్కౌంట్లు లభించనుంది.
చదవండి: 5G Network FAQs In Telugu: 5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్‌లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే!
Comments
Please login to add a commentAdd a comment