new mobiles
-
ఈ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ - వివరాలు
భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో కొత్త వాహనాలు, కొత్త మొబైల్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కావున ఈ కథనంలో ఈ నెల (అక్టోబర్) దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 04 న విడుదలకానున్నట్లు సమాచారం. ఇది పిక్సెల్ 8 & పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్‌లో విడుదలకానున్నట్లు సమాచారం. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, ప్రో మోడల్ 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 'ప్రో' లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా ఉండవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 58170 & రూ. 74814 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వివో29 సిరీస్ వివో వి29 సిరీస్ కూడా ఈ నెల 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లలో విడుదలకానుంది. వీ29 లో 120 Hz రేటుతో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉండవచ్చని సమాచారం. రెండు వేరియంట్లు మంచి కెమెరా సెటప్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నాయి. రెడ్మీ నోట్ 13 5జీ చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 13 5జీ అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే పొందుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధరలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ ఓపెన్ ఒకటి. ఈ మొబైల్ ఈ నెల మధ్యలో లేదా చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోల్డ్ స్క్రీన్, 6.3 ఇంచెస్ అమోల్డ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ధర & వివరాలు తెలియాల్సి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఈ నెల మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉండనుంది. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సీనోస్ 2200 చిప్ సెట్ ఉండనున్నట్లు సమాచారం. కెమరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో..
ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా యాపిల్ ఐఫోన్స్కి డిమాండ్ భారీగా ఉందనే విషయం తెలిసిందే. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైన రోజు ఈ లేటెస్ట్ ఫోన్ కొనటానికి కస్టమర్లు ఎంత ఉత్సాహం చూపించారనే వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. డిమాండ్ పెరిగే కొత్త ధరలు అమాంతం పెంచుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో ఐఫోన్ 15 మొబైల్స్ మేనియా కొనసాగుతోంది. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి అసలు ధర ఎక్కువ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. రిటైలర్లు కూడా ఇదే అదనుగా చూసుకుని ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎమ్ఆర్పీ ధరలపై రూ. 20వేలు నుంచి రూ. 32వేలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ నేచురల్ టైటానియం కలర్ ఫోన్ మీద రిటైలర్లు రూ. 20,000 ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేదు - కారణం ఇదే! ఐఫోన్ 15 సిరీస్ అసలు ధరలు.. భారతీయ మార్కెట్లో 15 సిరీస్ మొబైల్స్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు స్టోరేజ్ ఆప్సన్స్ మీద ఆధార పది ఉంటాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన 15 ప్రో ధర రూ. 1,34,900. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1 టీబీ ధర రూ. 1,99,900 వరకు ఉంది. -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!
2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7A): 2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 'గూగుల్ పిక్సెల్ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 6.1 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన గూగుల్ పిక్సెల్ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold): గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.69 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. రియల్మీ 11 ప్రో (Realme 11 Pro): భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్ చిప్సెట్ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!) రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro Plus): మే 2023లో విడుదలకానున్న మరో రియల్మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
ఆధునిక ఫీచర్లతో విడుదలకానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్స్ వంటి ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న అద్భుతమైన మొబైల్ ఫోన్. ఇది 6000 mAh బ్యాటరీ, 5nm ప్రాసెసర్‌తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 'మూమెంట్స్ మాన్స్టర్' అని పేర్కొంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్లర్-ఫ్రీ, ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మెరుగైన పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో గేమర్లు, మల్టీ టాస్కర్లు వంటి వాటికోసం ఇది చాలా ఖచ్చితమైన, వేగవంతంగా పనిచేస్తుంది. యాప్‌ల ద్వారా వేగంగా రన్ చేయడమే కాకుండా క్షణాల్లో కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. (ఇదీ చదవండి: ఈ ఆఫర్‌తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!) గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో ముఖ్యమైన సందేశానికి రిప్లే ఇచ్చినప్పుడు, ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సామర్థ్యాలు తప్పకుండా మిమ్మల్ని ముగ్దుల్ని చేస్తాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. -
కేవలం రూ. 7,999కే నోకియా కొత్త మొబైల్ - పూర్తి వివరాలు
నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన సీ12 లైనప్‌లో మరో కొత్త 'సీ12 ప్లస్' మొబైల్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో సీ12, సీ12 ప్రో ఉన్నాయి. నోకియా నుంచి విడుదలైన ఈ కొత్త సీ12 ప్లస్ ధర రూ. 7,999. ఈ లేటెస్ట్ మొబైల్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సరసమైన ధర వద్ద విడుదలైన ఈ మొబైల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేట్స్ పొందింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో అడుగుపెట్టింది. ధర ప్రకటించినప్పటికీ సేల్ తేదీని నోకియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలో వెల్లడించే ఛాన్స్ అవకాశం ఉందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) నోకియా సీ12 ప్లస్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది 6.3 ఇంచెస్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో ఫ్రంట్ కెమెరా కోసం టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజిని పెంచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: Dharampal Gulati: వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..) కొత్త నోకియా సీ12 ప్లస్ మొబైల్ 4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ-పోర్టు, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. కెమెరా పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున వీడియో కాల్స్, సెల్ఫీ వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. -
ఈ నెలలో విడుదల కానున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు, ఇవే!
భారతదేశం కేవలం కార్లు, బైకులకు మాత్రమే కాకుండా.. స్మార్ట్ఫోన్లకు కూడా అతి పెద్ద మార్కెట్‌గా అవతరించింది. కావున ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో ఆధునిక మొబైల్స్ విడుదలవుతూనే ఉన్నాయి. శాంసంగ్, ఆపిల్, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీ ప్రతి సంవత్సరం అనేక కొత్త మోడల్స్ పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నెలలో (2023 ఏప్రిల్) ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మొబైల్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. పోకో ఎఫ్5 (Poco F5): చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో ఏప్రిల్ 06న తన 'ఎఫ్5' మొబైల్ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్ కలిగి 8GB RAM & 128 GB ఇంటర్నల్ మెమరీ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,500 mAh వరకు ఉంటుంది. దీని ధర రూ. 5,000 వరకు ఉండవచ్చు. వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite): ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో ఒకటి వన్ ప్లస్. ఇప్పటికే అనేక కొత్త మోడల్స్ విడుదల చేసిన ఈ కంపెనీ ఏప్రిల్ 04న 'నార్డ్ సిఈ 3 లైట్' విడుదల చేయనుంది. ఈ మొబైల్ 6.72 ఇంచెస్ LCD స్క్రీన్ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh కాగా.. రామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB/128GB వరకు ఉన్నాయి. ఇది సుమారు రూ. 25,000 వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 7 (Asus ROG Phone 7): ఆసుస్ కంపెనీ ఈనెల 13న దేశీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆర్ఓజి ఫోన్ 7 విడుదలచేయనుంది. ఇది 6.85 ఇంచెస్ AMOLED స్క్రీన్ కలిగి 16 GB రామ్ 512 GB ఇంటర్నల్ మెమొరీ పొందుతుంది. అయితే ఇందులో 6,000 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీని ధర సుమారు రూ. 63,000 వరకు ఉండవచ్చని అంచనా. (ఇదీ చదవండి: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..) వివో ఎక్స్90 సిరీస్ (Vivo X90 Series): 2023 ఏప్రిల్ నెలలో వివో కంపెనీ కూడా కొత్త 'ఎక్స్90 సిరీస్' విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదాని మీద ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ ఇది 6.78 ఇంచెస్ AMOLED స్క్రీన్, 4,810 mAh బ్యాటరీ, 12 జిబి - 16 జిబి రామ్, 512 GB ఇంటర్నల్ కెపాసిటీ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందనుంది. దీని ప్రారంభ ధర రూ. 42,500 వరకు ఉండవచ్చు. -
శాంసంగ్ గెలాక్సీ 5జి మొబైల్స్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్: ఈ రోజే లాస్ట్
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 5జి మొబైల్స్ మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ & ఏ43 5జీ రెండూ కూడా ఈ రోజు (మార్చి 23) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 40,999. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధరల విషయానికి వస్తే, ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 30,999 కాగా, టాప్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) ధర రూ.32,999. వీటిని ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా తీసుకోవచ్చు. (ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..) శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్ప్లే కలిగి వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు పొందుతుంది. అదే సమయంలో ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్ప్లే కలిగి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు పొందుతుంది. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు మీద ఆఫర్స్ కూడా అందిస్తోంది, ఇందులో భాగంగానే శాంసంగ్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 24) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
Vivo V27 Pro: విడుదలకు ముందే వివరాలు లీక్, ధర ఎంతంటే?
మార్కెట్లో వివో కంపెనీ తన 5జీ సిరీస్‌లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ విడుదల చేయకముందే ప్రైస్, డీటైల్స్ అన్నీ కూడా ప్రకటించింది. కంపెనీ వీ27 సిరీస్‌లో వీ27, వీ27 ప్రో విడుదలచేయనుంది. ఈ రెండూ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి. వివో వీ27 ప్రో భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అవి 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, చివరగా టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999. కంపెనీ విడుదల చేసే వివో వీ27 ప్రారంభ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు మర్చి 01న అధికారికంగా విడుదలవుతాయి. ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో వెల్లడయ్యాయి. వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది. -
మార్కెట్లోకి ‘రెడ్మి నోట్ 8’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి నోట్ 8, 8 ప్రో’ పేరిట రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదలచేసింది. ఇన్ బిల్ట్ అమెజాన్ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్లు.. గూగుల్ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్ ఇవే కాగా, వీటిలో రెడ్మి నోట్ 8 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6.39 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ మోడల్లో 6జీబీ/64జీబీ ధర రూ. 9,999.. 6జీబీ/128జీబీ ధర రూ.12,999గా నిర్ణయించింది. మరో మోడల్ 8 ప్రో మూడు వేరియంట్లలో విడుదలైంది. 6.53 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ మోడల్ ధరల శ్రేణి రూ. 14,999 నుంచి రూ. 17,999గా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్సెట్తో విడుదలైన అధునాతన స్మార్ట్ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ అన్నారు. అక్టోబరు 21 నుంచి కొత్త మోడళ్లు వినియోగదారులకు లభ్యంకానున్నాయని వెల్లడించారు. -
ఈ ఏడాది 1,500 కొత్త మొబైల్స్
91మొబైల్స్‌డాట్‌కామ్ వెల్లడి న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో 1,400-1,500 వరకూ కొత్త మొబైల్ ఫోన్ మోడళ్లు రానున్నాయని 91మొబైల్స్‌డాట్‌కామ్ తెలిపింది. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి వంటి కంపెనీలు భారత్‌లో తమ మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండడమే దీనికి కారణమని 91మొబైల్స్డాట్కామ్కు చెందిన మాధుర్ వివరించారు. గత ఏడాది వచ్చిన కొత్త మోడళ్లు(1,137)తో పోల్చితే ఇది 20 శాతం అధికమని పేర్కొన్నారు. 2013లో 957 కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయని తెలిపారు. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి తదితర కంపెనీలు వివిధ ధరల రేంజ్లో వివిధ ఫీచర్లున్న ఫోన్లను అందిస్తున్నాయని మాధుర్ వివరించారు. రెండోసారి, మూడోసారి స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు హై ఎండ్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్నారని వివరించారు. గత ఏడాది షియోమి, మోటొరొలా, లెనొవొ, ఆసుస్ కంపెనీలు రూ.5,000-15,000 రేంజ్లో ఆధునిక ఫీచర్లున్న మొబైళ్లను అందించాయని, ఫలితంగా స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర గత ఏడాది 18 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఇదే ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగుతుందని వివరించారు. ఈ ఏడాది రూ.15,000-20,000 రేంజ్ ఫోన్లకు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు సంబంధించి పరిశోధన, పోలికలను వివరించే ఈ వెబ్సైట్లో 20 వేల డివైస్ల వివరాలున్నాయని అంచనా. గత ఏడాది 4 కోట్ల మంది తమ వెబ్‌సైట్‌ను సందర్శించారని ఈ వెబ్సైట్ అంటోంది.