భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్స్ వంటి ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న అద్భుతమైన మొబైల్ ఫోన్. ఇది 6000 mAh బ్యాటరీ, 5nm ప్రాసెసర్‌తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 'మూమెంట్స్ మాన్‌స్టర్' అని పేర్కొంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్లర్-ఫ్రీ, ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.
కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మెరుగైన పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో గేమర్‌లు, మల్టీ టాస్కర్‌లు వంటి వాటికోసం ఇది చాలా ఖచ్చితమైన, వేగవంతంగా పనిచేస్తుంది. యాప్‌ల ద్వారా వేగంగా రన్ చేయడమే కాకుండా క్షణాల్లో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ ఆఫర్‌తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!)
గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో ముఖ్యమైన సందేశానికి రిప్లే ఇచ్చినప్పుడు, ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సామర్థ్యాలు తప్పకుండా మిమ్మల్ని ముగ్దుల్ని చేస్తాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment