![Best Smartphone under 20000 in june 2023 redmi note 12 to OnePlus Nord CE 3 Lite 5G - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/30/best-smart-phone-in2023-june.jpg.webp?itok=Qm9nyqO9)
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వివో వై36 (Vivo Y36)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్‌ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
రెడ్‌మీ నోట్ 12 (Redmi Note 12)
ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD డిస్‌ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఐక్యూ జెడ్7 (iQOO Z7)
ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది.
మోటో జీ73 (Moto G73)
మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G)
రూ. 19,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment