
మార్కెట్లో వివో కంపెనీ తన 5జీ సిరీస్‍లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ విడుదల చేయకముందే ప్రైస్, డీటైల్స్ అన్నీ కూడా ప్రకటించింది.
కంపెనీ వీ27 సిరీస్‍లో వీ27, వీ27 ప్రో విడుదలచేయనుంది. ఈ రెండూ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి. వివో వీ27 ప్రో భారత మార్కెట్‍లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అవి 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, చివరగా టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999.
కంపెనీ విడుదల చేసే వివో వీ27 ప్రారంభ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు మర్చి 01న అధికారికంగా విడుదలవుతాయి. ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్‍సైట్, ఫ్లిప్‍కార్ట్‌లో వెల్లడయ్యాయి.
వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్‌డ్ డిస్‍ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment