ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా యాపిల్ ఐఫోన్స్‌కి డిమాండ్ భారీగా ఉందనే విషయం తెలిసిందే. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ సేల్ ప్రారంభమైన రోజు ఈ లేటెస్ట్ ఫోన్ కొనటానికి కస్టమర్లు ఎంత ఉత్సాహం చూపించారనే వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. డిమాండ్ పెరిగే కొత్త ధరలు అమాంతం పెంచుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో ఐఫోన్ 15 మొబైల్స్ మేనియా కొనసాగుతోంది. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ఫోన్స్ కొనుగోలు చేయడానికి అసలు ధర ఎక్కువ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. రిటైలర్లు కూడా ఇదే అదనుగా చూసుకుని ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎమ్‌ఆర్‌పీ ధరలపై రూ. 20వేలు నుంచి రూ. 32వేలు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్ నేచురల్ టైటానియం కలర్ ఫోన్ మీద రిటైలర్లు రూ. 20,000 ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేదు - కారణం ఇదే!
ఐఫోన్ 15 సిరీస్ అసలు ధరలు..
భారతీయ మార్కెట్లో 15 సిరీస్ మొబైల్స్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు స్టోరేజ్ ఆప్సన్స్ మీద ఆధార పది ఉంటాయి. 128 జీబీ స్టోరేజ్ కలిగిన 15 ప్రో ధర రూ. 1,34,900. అయితే ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1 టీబీ ధర రూ. 1,99,900 వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment