2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7A):
2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 'గూగుల్ పిక్సెల్ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.
6.1 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన గూగుల్ పిక్సెల్ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి.
(ఇదీ చదవండి: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!)
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold):
గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.69 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది.
రియల్మీ 11 ప్రో (Realme 11 Pro):
భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్ చిప్సెట్ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.
(ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!)
రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro Plus):
మే 2023లో విడుదలకానున్న మరో రియల్మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment