iQOO Z7s 5G Mobile Launched in India, Check Price Details Inside - Sakshi
Sakshi News home page

iQoo Z7s: మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ - ధర ఎంతో తెలుసా?

Published Mon, May 22 2023 8:06 PM | Last Updated on Tue, May 23 2023 10:55 AM

iqoo z7s 5g mobile india launched price features and sales - Sakshi

iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు..
ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍, ఐకూ అధికారిక వెబ్‍సైట్‍లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్‌ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్స్..
నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్‍లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. 

(ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!)

కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్‍ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement