పవర్ బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఇంకేంటో తెలుసా? | Vitesy Shelfy Smart Refrigerator Details | Sakshi
Sakshi News home page

పవర్ బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఇంకేంటో తెలుసా?

Published Sun, Oct 27 2024 8:38 PM | Last Updated on Sun, Oct 27 2024 8:40 PM

Vitesy Shelfy Smart Refrigerator Details

చూడటానికి పవర్‌బ్యాంకులా ఉంటుంది గాని, ఇది ఫ్రిజ్‌ ప్యూరిఫైయర్‌. ఈ పరికరం ఫ్రిజ్‌లో భద్రపరచిన ఆహారం మరింత కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఫ్రిజ్‌లోని ఆహారంపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధిస్తుంది. ఇటాలియన్‌ కంపెనీ ‘విటెసీ’ ఇటీవల ఈ బుల్లి పరికరాన్ని ‘షెల్ఫీ’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఇందులోని అడ్వాన్స్‌డ్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీతో పనిచేసే సెన్సర్లు ఫ్రిజ్‌లోని ఆహారంపై చేరిన సూక్ష్మజీవులను గుర్తించి, వాటిని క్షణాల్లోనే నాశనం చేస్తాయి. ఆహార వృథాను అరికట్టే ఉద్దేశంతోనే ఈ పరికరాన్ని రూపొందించినట్లు ‘విటెసీ’ కంపెనీ చెబుతోంది.

ఈ పరికరం రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఫ్రిజ్‌లో భద్రపరచిన కూరగాయలు, పండ్లు, పాలు వంటివి ఎక్కువకాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ పరికరాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలు మరింతకాలం సురక్షితంగా ఉంటాయి. దీని ధర 179.99 డాలర్లు (రూ.15,126).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement