జియో సంస్థ యూజర్ల కోసం 'జియోసేఫ్' అనే యాప్ పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ చాలా సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని జియో పేర్కొంది. ఇది ప్రస్తుతం రూ. 199 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను మొదటి సంవత్సరం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.
జియో పరిచయం చేసిన ఈ కొత్త అప్లికేషన్ సురక్షితమైన వీడియో కాలింగ్, ఆడియో, టెక్స్టింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ కేవలం 5జీ నెట్‌వర్క్‌లో మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. 4G నెట్‌వర్క్‌లలో లేదా Jio SIM లేని వినియోగదారులు యాప్‌ను ఉపయోగించలేరు, ఇది భారతదేశానికి పరిమితం.
ఈ యాప్ మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైన యాప్, కాబట్టి దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరని సంస్థ పేర్కొంది. కాబట్టి ఇది మెటా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తుందనే చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక సంవత్సరం ఉచితంగా ఉపయోగించుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
జియోసేఫ్ సేఫ్టీ అనేది జియో 5జీ క్వాంటం సెక్యూర్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 256 బిట్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారును గోప్యంగా ఉంచడానికి సబ్‌స్క్రైబర్ కన్సీల్డ్ ఐడెంటిటీ (SCI) సాంకేతికతను ఉపయోగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment