న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.
జియో, చైనా మొబైల్, ఎయిర్‌టెల్, చైనా యునికామ్‌తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.
జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్‌టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్‌లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment