
రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. అయితే తాజాగా తన ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌లపై ఏకంగా 30 శాతం తగ్గింపులను ప్రకటించింది. పైగా రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాపీ చేస్తోంది. ఈ ఆఫర్స్ 2024 జులై 26 నుంచి ఆగష్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
జియో తన ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కింద భారతదేశంలో 1.2 కోట్ల గృహాలకు పైగా కవరేజీని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్‌ఫైబర్ 5జీ, కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

సాధారణంగా జియో ఎయిర్‌ఫైబర్ మూడు నెలల స్టాండర్డ్ ప్లాన్ రూ. 2121, అదనంగా రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జ్. ఇలా మొత్తం రూ. 3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర రూ. 2121 మాత్రమే. అంటే ఇందులో ఇన్‌స్టాలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జియో కొత్త ఆఫర్ 3 లలు, 6 నెలలు, 12 నెలల ప్లాన్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆగస్టు 15 వరకు అన్ని కొత్త, ఇప్పటికే ఉన్న బుకింగ్‌లు ఈ కొత్త ఆఫర్‌లో కవర్ అవుతాయి. జియో తన ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను అందించే చోట మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కోసం రిలయన్స్ అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment