New Offer
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. 30 శాతం డిస్కౌంట్
రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. అయితే తాజాగా తన ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లపై ఏకంగా 30 శాతం తగ్గింపులను ప్రకటించింది. పైగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాపీ చేస్తోంది. ఈ ఆఫర్స్ 2024 జులై 26 నుంచి ఆగష్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో తన ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కింద భారతదేశంలో 1.2 కోట్ల గృహాలకు పైగా కవరేజీని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్‌ఫైబర్ 5జీ, కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.సాధారణంగా జియో ఎయిర్‌ఫైబర్ మూడు నెలల స్టాండర్డ్ ప్లాన్ రూ. 2121, అదనంగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జ్. ఇలా మొత్తం రూ. 3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర రూ. 2121 మాత్రమే. అంటే ఇందులో ఇన్స్టాలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.జియో కొత్త ఆఫర్ 3 లలు, 6 నెలలు, 12 నెలల ప్లాన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆగస్టు 15 వరకు అన్ని కొత్త, ఇప్పటికే ఉన్న బుకింగ్‌లు ఈ కొత్త ఆఫర్లో కవర్ అవుతాయి. జియో తన ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను అందించే చోట మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. కొత్త జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కోసం రిలయన్స్ అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
'జియోఫై' పై బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో, తన వైఫై పరికరం 'జియోఫై' పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫైను కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ సరికొత్త ఆఫర్‌ను ఆవిష్కరించింది. రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు 3,595 రూపాయల వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. దీనిలో రూ.1,295కి డేటా రూపంలో ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వీటితో పాటు ఈ డివైజ్‌తో పాటు 2,300 రూపాయల ఓచర్లను కస్టమర్లకు జియో అందించనుంది. ఈ ఓచర్లను పేటీఎం, ఏజియో, రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.3,595 ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయి. పైన పేర్కొన ఆఫర్స్ మాత్రమే కాక జియోఫైను కంపెనీ రూ.999కు కూడా విక్రయిస్తోంది. అయితే రూ.999కి ఈ డివైజ్‌ను కొనుగోలు చేస్తే, ఎలాంటి డేటా ప్లాన్ ప్రయోజనాలను కానీ, షాపింగ్ ఓచర్లను కానీ వినియోగదారులు పొందరు. 4జీ ఫోన్ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం 2016 సెప్టెంబర్‌లో మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ డివైజ్, ఆరు గంటల పాటు పనిచేయనుంది. జియో4జీవాయిస్ యాప్ ద్వారా హెచ్డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ వంటి వాటికి ఇది సపోర్టు చేయనుంది. -
రిలయన్స్ జియో 'ఫుట్‌బాల్ ఆఫర్'
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొలిసారి జియో నెట్వర్క్ యాక్టివేట్ చేసుకునే కొత్త స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. షావోమి, శాంసంగ్, మోటోరోలా, ఆసుస్, హువావే, ప్యానాసోనిక్, ఎల్జీ, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు జియో ఈ ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఫోన్ యాక్టివేషన్ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ ఓచర్ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్‌లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్ ఆఫర్ వర్తిస్తుంది. మైజియో యాప్ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్‌పైరి అయిపోతాయి. ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్‌బ్యాక్ ఓచర్లను మైజియో యాప్‌లో ''మై ఓచర్స్' సెక్షన్ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్‌లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ డివైజ్‌లకు ఇప్పటికే జియో తన ఫుట్‌బాల్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. అదనంగా కోమియో ఎస్1 లైట్, సీ1 లైట్ యూజర్లకు ఈ ఆఫర్‌కు అర్హులే. షావోమి రెడ్మి వై1, శాంసంగ్ ఆన్8, హానర్ 9ఐ, బ్లాక్‌బెర్రీ కీవన్, మైక్రోమ్యాక్స్ భారత్1 వంటి డివైజ్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. -
ఒక్కరోజులోనే ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రిలయెన్స్ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రోజుకో కొత్త ప్లాన్‌ను ప్రకటిస్తూనే ఉంది. నిన్ననే జియోకు పోటీగా కొత్తగా రూ.999 ప్లాన్‌ను ప్రకటించిన ఎయిర్టెల్, నేడు మరో కొత్త ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. జియో కొత్త ఐఫోన్లపై ప్రకటించిన ఎక్స్‌క్లూజివ్ ప్లాన్ మాదిరి, తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్టెల్ కొత్తగా రూ.799 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద రోజుకు 3జీబీ డేటాతో పాటు అపరిమితి లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుంది. అంటే 28 రోజులకు గాను, రోజుకు 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. ఇది కేవలం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఈ ప్లాన్ జియో రూ.799 ప్యాక్‌కు గట్టి పోటీగా ఉంది. ఇక ఇతర ప్లాన్లపై ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాల్స్‌ను రోజుకు 250 నిమిషాలకు, వారానికి వెయ్యి నిమిషాలకు పరిమితం చేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా కొత్త ఎయిర్టెల్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఎయిర్టెల్ అందించనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు రూ.549 నుంచి రూ.999 మధ్యలో ఉన్నాయి. వీటికి రోజుకు 2జీబీ డేటా, 4జీబీ డేటాను ఎయిర్టెల్ అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లకు అపరిమిత లోకల్, ఎస్డీడీ కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. రోజుకు 3జీబీని ఆఫర్ చేసిన తొలి టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ కంపెనీ తన ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటాను అందించింది. -
జియోఫై పై క్యాష్ బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియోఫైపై 100 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారికి ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీంలో భాగంగా రెండు పథకాలను లాంచ్ చేసింది. జియో.కాం ద్వారా పోర్టబుల్ 4జీ వైఫై రౌటర్ లేదా హాట్ స్పాట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద, రూ. 2,010 విలువైన జియో ఉచిత డేటాను, ఎక్స్ఛేంజ్ లేకుండా రూ. 1,005 విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్(ఎయిర్టెల్. బీఎస్ఎన్ఎల్ తదితర)ను జియో ఫై 4జీ రౌటర్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. జియో ఫై రౌటర్ విలువు రూ.1999 లుగా ఉంది. దీనికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులోఉండనుంది. రౌటర్ కొనుగోలు చేసిన వారికి రూ.1005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది. ఎక్స్ఛేంజ్ లేకుండా రూ.201 విలువైన 5 టాప్ అప్ కూపన్ల ద్వారా 4 జీ డేటా ఉచితం. ఇతర నాన్ జియో రౌటర్లతో ఎక్సేంజ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ తో రూ.201 విలువైన 10టాప్ అప్ వోచర్లు ఉచితం. ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస 5 రీచార్జ్లకుగాను కస్టమర్లకు అదనంగా 5జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తుంది. మార్చి 31, 2018వరకు ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయి. -
ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్
బడ్జెట్ క్యారియర్ ఇండిగో కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. రూ.868కే(అన్నీ చార్జీలను కలుపుకుని) విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. నవంబర్ 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంపికచేసిన దేశీయ మార్గాలలో ఈ ఆఫర్ 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకు వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంచుతుందో కంపెనీ స్పష్టంచేయలేదు. ఇండిగో వెబ్‌సైట్‌ను చెక్ చేసిన వాళ్లకి రూ.868 ఆఫర్ కనిపిస్తోంది. భారత్‌లో ఎయిర్ ట్రావెల్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విమానయాన సంస్థలు పోటీపడి మరీ ప్రమోషనల్ ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే లోకాస్ట్ ఎయిర్ ట్రావెల్‌గా పేరొందిన గోఎయిర్ తన 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.611కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు తెలిపింది. భారత్ ఏవియేషన్ పరిశ్రమ ప్రపంచ ఏవియేషన్ మార్కెట్లో అత్యంత వేగవంతమైన మార్కెట్‌గా పేరొందుతోంది. ఏవియేషన్ రెగ్యులేటరీ తాజా డేటా ప్రకారం గత నెలలో స్థానిక క్యారియర్లు 82.3 లక్షలు పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా దేశీయ ఎయిర్ ప్యాసెంజర్ల ట్రాఫిక్ వృద్ది గతేళ్లతో పోలిస్తే 20 శాతం కంటే అధికంగా ఉందని తెలిపాయి.