ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ | Airtel new offer free subscription of Apple TV and Apple Music | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ

Published Mon, Feb 24 2025 8:47 PM | Last Updated on Mon, Feb 24 2025 8:50 PM

Airtel new offer free subscription of Apple TV and Apple Music

ఎయిర్‌టెల్ (Airtel) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ ప్రకటించింది.  యాపిల్ టీవీ+, (Apple TV+) యాపిల్ మ్యూజిక్ (Apple Music) సేవలను అందించడానికి భారతీ ఎయిర్‌టెల్, యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపై హోమ్ వై-ఫై వినియోగదారులందరికీ యాపిల్ టీవీ + కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే కాకుండా  రూ .999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ + సదుపాయాన్ని పొందవచ్చు. 6 నెలల పాటు  యాపిల్ మ్యూజిక్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఇందులో భారతీయ సంగీతంతోపాటు విదేశీ మ్యూజిక్‌ లిస్టింగ్‌ కూడా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.. ఇందు కోసం వారు ఏ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.

యాపిల్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్
ఈ భాగస్వామ్యం కింద వినియోగదారులు యాపిల్ టీవీ+లోని అన్ని ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలను ఎటువంటి ప్రకటనలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్,  డిస్‌క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో పాటు వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా వినియోగదారులకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్‌ కూడా ఉచితంగా లభిస్తుంది. యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

బెనిఫిట్స్ ఈ ప్లాన్లలో..
రూ.1,099, రూ.1,599, రూ.3,999 ఎయిర్టెల్ వైఫై ప్లాన్లను ఎంచుకున్న వారికి వరుసగా 350కి పైగా టీవీ ఛానళ్లు, 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్‌తో ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా మారింది. ఇది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్‌ అందించే పెద్ద సంస్థలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement