రిలయన్స్‌ జియో 'ఫుట్‌బాల్‌ ఆఫర్‌' | Reliance Jio Football offer gives Rs 2200 cashback | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో 'ఫుట్‌బాల్‌ ఆఫర్‌'

Published Sat, Feb 17 2018 9:21 AM | Last Updated on Sat, Feb 17 2018 1:25 PM

Reliance Jio Football offer gives Rs 2200 cashback - Sakshi

రిలయన్స్‌ జియో (ఫైల్‌ ఫోటో)

రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తొలిసారి జియో నెట్‌వర్క్‌ యాక్టివేట్‌ చేసుకునే కొత్త స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లకు ఫుట్‌బాల్‌ ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇ‍వ్వనుంది. షావోమి, శాంసంగ్‌, మోటోరోలా, ఆసుస్‌, హువావే, ప్యానాసోనిక్‌, ఎల్‌జీ, నోకియా, మైక్రోమ్యాక్స్‌ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు  జియో ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. 

ఈ ఆఫర్‌ కింద ఫోన్‌ యాక్టివేషన్‌ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్‌ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి. ఈ ఓచర్‌ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్‌లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. మైజియో యాప్‌ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్‌ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్‌పైరి అయిపోతాయి. 

ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి  వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను మైజియో యాప్‌లో ''మై ఓచర్స్‌' సెక్షన్‌ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్‌ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్‌లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ డివైజ్‌లకు ఇప్పటికే జియో తన ఫుట్‌బాల్‌ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. అదనంగా కోమియో ఎస్‌1 లైట్‌, సీ1 లైట్‌ యూజర్లకు ఈ ఆఫర్‌కు అర్హులే. షావోమి రెడ్‌మి వై1, శాంసంగ్‌ ఆన్‌8, హానర్‌ 9ఐ, బ్లాక్‌బెర్రీ కీవన్‌, మైక్రోమ్యాక్స్‌ భారత్‌1 వంటి డివైజ్‌లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement