జియోఫై (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో, తన వైఫై పరికరం 'జియోఫై' పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫైను కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ సరికొత్త ఆఫర్‌ను ఆవిష్కరించింది. రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు 3,595 రూపాయల వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. దీనిలో రూ.1,295కి డేటా రూపంలో ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది.
వీటితో పాటు ఈ డివైజ్‌తో పాటు 2,300 రూపాయల ఓచర్లను కస్టమర్లకు జియో అందించనుంది. ఈ ఓచర్లను పేటీఎం, ఏజియో, రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.3,595 ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయి. పైన పేర్కొన ఆఫర్స్ మాత్రమే కాక జియోఫైను కంపెనీ రూ.999కు కూడా విక్రయిస్తోంది. అయితే రూ.999కి ఈ డివైజ్‌ను కొనుగోలు చేస్తే, ఎలాంటి డేటా ప్లాన్ ప్రయోజనాలను కానీ, షాపింగ్ ఓచర్లను కానీ వినియోగదారులు పొందరు.
4జీ ఫోన్ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం 2016 సెప్టెంబర్‌లో మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ డివైజ్, ఆరు గంటల పాటు పనిచేయనుంది. జియో4జీవాయిస్ యాప్ ద్వారా హెచ్‌డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ వంటి వాటికి ఇది సపోర్టు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment