JioFi
-
‘జియోఫై’ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్
జియోఫై ఫ్యామిలీ విస్తరణలో భాగంగా రిలయన్స్ కొత్త జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 999 రూపాయల ధర కలిగిన ఈ డివైజ్‌పై జియో సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత ఆఫర్ ప్రకారం 999 రూపాయలకు లభించే జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేసేటపుడు మన దగ్గర ఉన్న పాత డోంగల్/ మోడమ్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్ మీ సొంతం.. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలంటే మొదట జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత జియో సిమ్‌ను యాక్టివేట్ చేసి రూ.198 లేదా 299 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. జియోప్రైమ్ మెంబర్షిప్ కోసం అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి. నాన్ జియో డోంగల్‌ను ఎక్స్చేంజ్ చేసుకునేటపుడు.. ఆ డోంగల్ సీరియల్ నెంబర్‌ను పొందపరచాలి. అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసిన జియోఫై ఎమ్‌ఎస్‌డీఎన్ (MSDN) నంబర్‌ను కూడా జత చేయాలి. అలా అయితేనే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా ‘మైజియో’ అకౌంట్లో 2,200 రూపాయలు క్రెడిట్ అవుతాయి. కానీ ఈ మొత్తమంతా ఒకేసారి క్రెడిట్ కాకుండా 50 రూపాయల విలువ గల 44 వోచర్లు లభిస్తాయి. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టిన జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌పై ఏడాదిపాటు వారెంటీ ఉంది. దీని డౌన్లోడ్ స్పీడు 150ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్.. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్టీ3800 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్ ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను సపోర్టు చేస్తుంది. -
జియో కొత్త 4జీ హాట్‌స్పాట్
రిలయన్స్ జియో తన జియోఫై ఫ్యామిలీని విస్తరిస్తోంది. నేడు కొత్త జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను 999 రూపాయలకు రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ హాట్‌స్పాట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఏడాది వారెంటీ, 150ఎంబీపీఎస్ వరకు డౌన్లోడ్ స్పీడుతో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని అప్లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్ వరకు ఉంది. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో ఈ డివైజ్ వచ్చింది. ఒరిజినల్ జియోఫై మాదిరిగా కాకుండా.. గుడ్డు ఆకారంలో ఈ డోంగల్ ఉంది. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను ఇది కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్టీ3800 ప్రాసెసర్‌తో ఇది రూపొందింది. ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను ఇది సపోర్టు చేస్తుంది. ఈ కొత్త జియోఫైలో స్టోరేజ్‌ను 64జీబీ వరకు విస్తరించేందుకు మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది ప్యాక్ అయింది. అయితే ఈ కొత్త మోడల్ ఇప్పటి వరకు జియో.కామ్‌లో లిస్టు అవలేదు. అయితే రిలయన్స్ జియో ఇటీవలే తన పాత జియోఫై డివైజ్‌పై రూ.3,595 విలువైన ప్రయోజాలను అందించనున్నట్టు ప్రకటించింది. అనంతరం వెంటనే ఈ కొత్త జియోఫై మోడల్‌నూ రిలయన్స్ ఆవిష్కరించింది. -
'జియోఫై' పై బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోన్న రిలయన్స్ జియో, తన వైఫై పరికరం 'జియోఫై' పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫైను కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ సరికొత్త ఆఫర్‌ను ఆవిష్కరించింది. రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు 3,595 రూపాయల వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. దీనిలో రూ.1,295కి డేటా రూపంలో ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వీటితో పాటు ఈ డివైజ్‌తో పాటు 2,300 రూపాయల ఓచర్లను కస్టమర్లకు జియో అందించనుంది. ఈ ఓచర్లను పేటీఎం, ఏజియో, రిలయన్స్ డిజిటల్ షాపింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.3,595 ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయి. పైన పేర్కొన ఆఫర్స్ మాత్రమే కాక జియోఫైను కంపెనీ రూ.999కు కూడా విక్రయిస్తోంది. అయితే రూ.999కి ఈ డివైజ్‌ను కొనుగోలు చేస్తే, ఎలాంటి డేటా ప్లాన్ ప్రయోజనాలను కానీ, షాపింగ్ ఓచర్లను కానీ వినియోగదారులు పొందరు. 4జీ ఫోన్ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం 2016 సెప్టెంబర్‌లో మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ డివైజ్, ఆరు గంటల పాటు పనిచేయనుంది. జియో4జీవాయిస్ యాప్ ద్వారా హెచ్డీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ వంటి వాటికి ఇది సపోర్టు చేయనుంది. -
పండుగ ఆఫర్‌ను పొడిగించిన జియో
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో తన పోర్టబుల్ వై-ఫై హాట్‌స్పాట్ జియోఫై పై గత నెలలో పండుగ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో తన డోంగల్‌ను కేవలం రూ.999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసిన క్రమంలో ఈ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్టు జియో పేర్కొంది. ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. '' పండుగ సెలబ్రేషన్లను కొనసాగిస్తున్నాం. మీ జియోఫై డివైజ్‌ను తగ్గించిన ధర రూ.999కే కొనుగోలు చేయండి. డిస్కౌంట్ ధరలో దీని కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు మరింత కాలం అందిస్తున్నాం'' అని కంపెనీ ట్వీట్ చేసింది. 4జీ ఫోన్ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం గత ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. -
ఆ మార్కెట్లోనూ జియోదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఓ వైపు టెల్కోలకు చుక్కులు చూపిస్తుండగా... ఇటు అదే సంస్థకు చెందిన వైఫై రూటర్ జియోఫై కూడా మార్కెట్లో దూసుకుపోతుంది. డేటా కార్డు మార్కెట్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నట్టు సైబర్ మీడియా రీసెర్చ్( సీఎంఆర్) వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న హువాయ్ కేవలం 3 శాతం మార్కెట్ షేరు మాత్రమే కలిగిఉందని సీఎంఆర్ చెప్పింది. జనవరి-మార్చి క్వార్టర్లో డేటా కార్డుల షిప్మెంట్లు 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లు ఎగిసి 16 శాతం వృద్ధిని నమోదుచేశాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది డేటా కార్డు మార్కెట్ ఏడింతలు విస్తరించినట్టు కూడా పేర్కొంది. ఈ క్రమంలో జియో అందిస్తున్న ఉచిత డేటా సర్వీసులు, మి-ఫై డేటా కార్డులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొబైల్ హాట్స్పాట్లు దీని పాపులారిటీని పెంచుతున్నాయని సీఎంఆర్ తెలిపింది. జియో ఫై రూటర్ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు ఇటీవలే రూ.1,999 విలువైన డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ను రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి-మార్చి క్వార్టర్లో కూడా దీని షేరు 90 శాతముంది. జియో ఫై డివైజ్‌లు ఇటు హోమ్ రూటర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లో జియో డేటా సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. -
జియోఫై పై క్యాష్ బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియోఫైపై 100 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారికి ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీంలో భాగంగా రెండు పథకాలను లాంచ్ చేసింది. జియో.కాం ద్వారా పోర్టబుల్ 4జీ వైఫై రౌటర్ లేదా హాట్ స్పాట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద, రూ. 2,010 విలువైన జియో ఉచిత డేటాను, ఎక్స్ఛేంజ్ లేకుండా రూ. 1,005 విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్(ఎయిర్టెల్. బీఎస్ఎన్ఎల్ తదితర)ను జియో ఫై 4జీ రౌటర్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. జియో ఫై రౌటర్ విలువు రూ.1999 లుగా ఉంది. దీనికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులోఉండనుంది. రౌటర్ కొనుగోలు చేసిన వారికి రూ.1005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది. ఎక్స్ఛేంజ్ లేకుండా రూ.201 విలువైన 5 టాప్ అప్ కూపన్ల ద్వారా 4 జీ డేటా ఉచితం. ఇతర నాన్ జియో రౌటర్లతో ఎక్సేంజ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ తో రూ.201 విలువైన 10టాప్ అప్ వోచర్లు ఉచితం. ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస 5 రీచార్జ్లకుగాను కస్టమర్లకు అదనంగా 5జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తుంది. మార్చి 31, 2018వరకు ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయి. -
జియో కొత్త ప్లాన్స్: 100శాతం క్యాష్ బ్యాక్
రిలయన్స్ జియో మరోసారి సంచలన ఆఫర్లను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.