కొత్త జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్
రిలయన్స్ జియో తన జియోఫై ఫ్యామిలీని విస్తరిస్తోంది. నేడు కొత్త జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను 999 రూపాయలకు రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ హాట్‌స్పాట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఏడాది వారెంటీ, 150ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడుతో దీన్ని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని అప్‌లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్ వరకు ఉంది. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో ఈ డివైజ్ వచ్చింది.
ఒరిజినల్ జియోఫై మాదిరిగా కాకుండా.. గుడ్డు ఆకారంలో ఈ డోంగల్ ఉంది. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను ఇది కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్‌వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్‌డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్‌టీ3800 ప్రాసెసర్‌తో ఇది రూపొందింది. ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను ఇది సపోర్టు చేస్తుంది.
ఈ కొత్త జియోఫైలో స్టోరేజ్‌ను 64జీబీ వరకు విస్తరించేందుకు మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది ప్యాక్ అయింది. అయితే ఈ కొత్త మోడల్ ఇప్పటి వరకు జియో.కామ్‌లో లిస్టు అవలేదు. అయితే రిలయన్స్ జియో ఇటీవలే తన పాత జియోఫై డివైజ్‌పై రూ.3,595 విలువైన ప్రయోజాలను అందించనున్నట్టు ప్రకటించింది. అనంతరం వెంటనే ఈ కొత్త జియోఫై మోడల్‌నూ రిలయన్స్ ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment