Hotspot
-
BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. ఆ టెక్నాలజీ మాత్రం వాడదు!
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. ముంబై.. వాంఖడే మైదానం.. రిషభ్ పంత్ ఇంకాసేపు క్రీజులో నిలబడితే చాలు.. టీమిండియా గెలవడం ఖాయం.. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడం అందరికీ షాకిచ్చింది.నిజానికి ఫీల్డ్ అంపైర్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అజాజ్ వేసిన బంతి పంత్ బ్యాట్‌ను కాకుండా ప్యాడ్లను తాకిందనే ఉద్దేశంతో.. అజాజ్ అప్పీలు చేసినా అంపైర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. పంత్ సైతం అదే ధీమాతో క్రీజులో నిలబడి చిరునవ్వులు చిందించాడు.అయితే, కివీస్ మాత్రం రివ్యూకు వెళ్లింది. అందులో బంతి బ్యాట్ అంచును తాకినట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో బ్యాట్ ప్యాడ్లను తాకిన తాకిందని పంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ బంతి బ్యాట్‌ను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయంటూ థర్డ్ అంపైర్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించాడు.కానీ పంత్ మాత్రం మైదానాన్ని వీడేందుకు ఇష్టపడక కాసేపు ఫీల్డ్ అంపైర్లతో వాదించి.. ఇక లాభం లేదనుకుని పెవిలియన్ చేరాడు. పంత్ నిష్క్రమణ తర్వాత భారత్ ఓటమి ఖారారై.. కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో పంత్ అవుటైన తీరు విస్తృతంగా చర్చకు వచ్చింది.ఈ క్రమంలోనే చాలా మంది హాట్‌స్పాట్ టెక్నాలజీ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)లో ఈ సాంకేతికతను కూడా బీసీసీఐ చేర్చుకుని ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.హాట్‌స్పాట్ టెక్నాలజీ అంటే ఏమిటి?ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్ బియాన్ హాట్‌స్పాట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రక్షణ దళాలు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ సాంకేతికతను రూపొందించారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. చీకట్లో, పొగ కమ్ముకున్న సమయంలో యుద్ధ ట్యాంకులు, విమానాల కదలికలను పసిగట్టడం కోసం దీనిని వాడతారు.క్రికెట్లో హాట్స్పాట్ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య 2006-07 నాటి యాషెస్ సిరీస్ సందర్భంగా క్రికెట్లో హాట్‌స్పాట్ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా బంతి బ్యాటర్‌కు శరీరానికి తగిలిందో లేదో పరిశీలించే వీలు కలుగుతుంది. డీఆర్ఎస్ను మరింత సరళతరంగా, కచ్చితంగా మార్చేందుకు ఈ సాంకేతికతను వాడారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, యూఏఈలలో కూడా ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని ఉపయోగించారు.ఇది ఎలా పనిచేస్తుందంటే?బౌలర్ సైడ్ రెండు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమరుస్తారు. బంతిని బ్యాటర్ శరీరాన్ని లేదంటే ప్యాడ్‌ను తాకినపుడు వెలువడ్డ ఉష్ణోగ్రత ఆధారంగా నెగటివ్ ఇమేజ్ ద్వారా ఏ పాయింట్లో బంతి తాకిందో గుర్తిస్తారు. బంతి బ్యాట్ అంచును తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.కచ్చితత్వం ఎంత?హాట్‌స్పాట్ చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి. 2011లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు ఈ టెక్నాలజీ వాడగా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కాకుండా లైఫ్ పొందిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ సాంకేతికతను తప్పుబట్టాడు. ఇక టూల్ ఇన్వెంటర్ వారెన్ బ్రెనాన్ సైతం పూత ఉండే బ్యాట్ల విషయంలో ఈ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఇండియాలో ఎందుకు వాడటం లేదు?హాట్‌స్పాట్ టెక్నాలజీ ఖరీదైనదని బీసీసీఐ, బ్రాడ్కాస్ట్ వర్గాలు అంటున్నాయి. ఒక్క కిట్ కోసం రోజుకు పది వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. ఇంతచేసినా కచ్చితమైన ఫలితాలు పొందలేమని పేర్కొంటున్నాయి. అందుకే ఈ టెక్నాలజీని ఇండియాలో వాడటం లేదని.. స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్స్ కూడా వీటి వినియోగాన్ని ఆపేశాయని తెలిపాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం హాట్‌స్పాట్ టెక్నాలజీని ఇంత వరకు ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం విశేషం.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?
శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని, దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత? -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా...5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు...రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. రూ.లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. (చదవండి: పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం) -
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్‌స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్‌గా తేలింది. ఈ హోటల్‌కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
తెలంగాణ ‘హాట్‌స్పాట్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో తొలి పాజిటివ్ కేసు మార్చి 2న నమోదవగా ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కరోనా లాక్డౌన్ కాలంలో జనజీవనం స్తంభించడం వల్ల వైరస్ అదుపులో ఉన్నప్పటికీ ప్రభుత్వ సడలింపులతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. ప్రస్తుతం రోజుకు రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమో దవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 51.13 శాతం కేసులు గత పది రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది. పది రోజుల్లో 29 శాతం పాజిటివ్... రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వేగాన్ని భారీగా పెంచింది. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల నమోదు కూడా అదే స్పీడ్‌లో ఉంది. గత పది రోజుల్లో (జూన్ 29–జూలై 8 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 52,163 మంది నుంచి శాంపిల్స్ తీసుకొని ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు జరపగా ఇందులో 15,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన పరీక్షలు చేసిన శాంపిల్స్‌లో 29 శాతం పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 1,34,801 నమూనాలను పరీక్షించారు. వాటిలో 29,536 నమూనాలు పాజిటివ్‌గా నిర్ధారణయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పాజిటివ్ కేసుల శాతం 21.91గా ఉంది. జాతీయ స్థాయిలో పరీక్షలు, పాజిటివ్ కేసుల నమోదును పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 1.07 కోట్ల శాంపిల్స్ పరిశీలించగా 7.67 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ లెక్కన జాతీయ సగటు పాజిటివ్ రేటు 7.1 శాతంగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర సగటు మూడు రెట్లు అధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ‘గ్రేటర్’ గజగజ... రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతానికిపైగా పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు నమోదైతే అందులో రెండొంతులకు పైగా పాజిటివ్‌లు జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నాయి. దీంతో గ్రేటర్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రేటర్ తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వైరస్ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిజామాబాద్, కరీంగనర్ సంగారెడ్డి జిల్లాల్లోనూ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. గత 10 రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు తేదీ పాజిటివ్ పరీక్షలు జూన్ 29 975 2,468 జూన్ 30 945 3,457 జూలై 1 1,018 4,234 జూలై 2 1,213 5,356 జూలై 3 1,892 5,965 జూలై 4 1,850 6,427 జూలై 5 1,590 5,290 జూలై 6 1,831 6,383 జూలై 7 1,879 6,220 జూలై 8 1,924 6,363 -
ఒక్కడి నుంచి వంద మందికి వైరస్!
చెన్నై : కరోనా.. ఎప్పుడు ఎక్కడనుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ఒక వ్యక్తి ద్వారా 104 మందికి కరోనా సోకడం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్ఎస్బీ రోడ్) ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జూన్ 22న కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతని నుంచి ఆ స్టోర్‌లో పనిచేసే మిగతా 303 సిబ్బంది సహా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో దాదాపు అందరూ తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. దీంతో కేవలం 13 రోజుల్లోనే రెండు గ్రామాల్లో కరోనా కేసులు 10 రెట్లు పెరిగాయి. జూన్ 22 వరకు 10 కరోనా కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 108కి చేరగా వారిలో నలుగురు మినహా అందరూ జ్యువెలరీ షాపుకి సంబంధించిన వారే కావడం గమనార్హం. అయితే మొట్టమొదటి కరోనా కేసు నమోదుకాగానే మిగతా సిబ్బందిని క్వారంటైన్‌కి పంపకుండా విధులు అప్పజెప్పారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఎన్ఎస్బీ రోడ్‌లోని మిగతా దుకాణాలను కూడా రెండు వారాల పాటు మూసి వేయాలని ఆదేశించడంతో పాటు ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. (భారత్: 20 వేలు దాటిన కరోనా మరణాలు) -
గుజరాత్ హాట్‌స్పాట్
కరోనా వచ్చిన చిట్టచివరి రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. మార్చి 19న తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత వ్యాప్తి నెమ్మదిగా ఉంది. 500 కేసులు నమోదు కావడానికి 25 రోజులు పట్టింది. అందరూ ఈ రాష్ట్రం సేఫ్ జోన్ అనుకున్నారు. కానీ హఠాత్తుగా హాట్‌స్పాట్‌గా మారింది. గత వారంలో కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌కే కరోనాతో ఊపిరాడడం లేదు. పారామిలటరీ దళాలు మోహరించాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులకు చికిత్స వ్యూహాత్మకంగా ఎలా అందించాలో అక్కడ వైద్యులకి వివరించారు. కరోనా కేసులతో పాటు మృతులు గుజరాత్లో ఎక్కువైపోవడం దడ పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 60 వేల వరకు ఉంటే అందులో 60శాతం కేసులు ఎనిమిది నగరాల్లోనే నమోదయ్యాయి. అందులో 42 శాతానికిపైగా కేసులు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఉన్నాయి. ఎందుకిన్ని కేసులు? 1: గుజరాత్ వాణిజ్యానికి, పర్యాటకానికి పెట్టింది పేరు. జనవరి–మార్చి కాలంలో అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహించి 14 రోజులు క్వారంటైన్లో ఉంచారు. కానీ స్క్రీనింగ్ లోపాలు, క్వారంటైన్ పకడ్బందీగా అమలు చేయడంలో ఆరోగ్య అధికారుల వైఫల్యంతో కేసులు పెరిగాయి. 2: ఢిల్లీలో మర్కజ్ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకి గుజరాత్ నుంచి 1500 మంది వెళ్లారు. వీరంతా అహ్మదాబాద్, సూరత్, వడోదరావాసులే. ఇరుకు ప్రాంతాల్లోనే నివసించే జనాభా ఇక్కడ అధికం. ప్రస్తుతం ఈ మూడు నగరాలే రాష్ట్రంలో కోవిడ్ హాట్స్పాట్లుగా మారాయి. అహ్మదాబాద్ ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తూ ఉంటారు. అందుకే కరోనా నిరోధక చర్యలు పాటించడం కత్తి మీద సాములా మారింది. 3: ఆరోగ్య రంగానికి ఈ రాష్ట్రంలో ఖర్చు చేసేది చాలా తక్కువ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఆరోగ్యానికి 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో సమానంగా మహిళలు, శిశువుల్లో పౌష్టికాహార లోపాలున్నాయి. దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని యూనిసెఫ్ వంటి సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. పోషకాహారం లోపాలతో రోగనిరోధక శక్తి లేక కరోనా వైరస్ సులభంగా దాడి చేస్తోంది. ప్రాణాలు కూడా ఎక్కువగానే తీస్తోంది. 4: అహ్మదాబాద్‌లో ఆర్థిక అసమానతలు, అభివృద్ధిలో తేడాలు ఎక్కువ. తూర్పు అహ్మదాబాద్‌లో జనసాంద్రత ఎక్కువ. తక్కువ ఆదాయం వచ్చే జనాభా అధికంగా నివసిస్తుంది. దరియాపూర్వంటి ప్రాంతాల్లో ఇళ్లలో ఒకేగది ఉంటుంది. అందులో 50శాతానికిపైగా ఇళ్లల్లో ఒకే గదిలో ఐదుగురు జీవిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందుకే గుజరాత్ మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 70శాతం (5వేలకు పైగా) అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి. 5: దేశంలో కరోనా వ్యాపించిన రాష్ట్రాల్లో ఇంచుమించుగా చివరిది గుజరాత్. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి ఆరేడు రోజుల ముందు మాత్రమే ఇక్కడ తొలి కేసు నమోదైంది. అయినా కేసులన్నీ ఎగబాకి ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత స్థానంలోకి చేరుకుంది. అయితే తొలినాళ్లలో ఇక్కడ కరోనా పరీక్షలు సరిగా నిర్వహించలేదు. గత వారం రోజులుగా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకి 3 వేలకి పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షకు పైగా పరీక్షలు చేశారు. అది కూడా కేసులు పెరగడానికి ఒక కారణమన్న వాదనలైతే ఉన్నాయి. -
‘మే 3 తర్వాత కూడా సడలింపులుండవు’
సాక్షి, న్యూఢిల్లీ: కంటైన్మెంట్, రెడ్‌జోన్ ప్రాంతాల్లో మే 3 తరువాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సడలింపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. (మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’) కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడని, మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైల్వే సేవలు ప్రారంభించకూడదని కిషన్‌రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలు అయినా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. (రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్) ఆర్థికవృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో, గ్రామస్థాయిలో సడలింపులిచ్చామని అన్నారు. కరోనా వైరస్ అడ్డుకునేందుకు అన్ని దేశాలు పోరాడుతూ వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. ప్రజల ప్రాణాలకే మొదటి ప్రాధాన్యత, దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. (హెచ్-1 బీ: జూన్ నాటికి ముగుస్తున్న గడువు!) ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్ని రాష్ట్రాలు రెండో విడత సహాయం తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ పథకం కింద రూ. 2,719 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. రాష్ట్రనికి 27,500 పీపీఈ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. 105053 ఎన్95 మాస్కులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామని ఆయన తెలిపారు. కరోనా లాబ్స్ ప్రభుత్వనివి ఎనిమిదని, ప్రైవేటుకు చెందిన 12 లాబ్స్‌కి అనుమతులు ఇచ్చామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
-
మూడు రోజులపాటు హైదరాబాద్‌లో కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర బృందం శనివారం హైదరాబాద్ చేరుకుంది. గచ్చిబౌలి ఆస్పత్రిలో సదుపాయాలను కేంద్ర బృందం పరిశీలించింది. మూడు రోజుల పాటు ఈ బృందం హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇవాళ సాయంత్రం 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో బృంద సభ్యులు భేటీ అవుతారు. ఆదివారం డీజీపీ కార్యాలయం, ఎల్లుండి (సోమవారం) జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మరోసారి సీఎస్‌తో ఈ కేంద్ర బృందం సమావేశం అవుతుంది. కాగా దేశంలో అతి పెద్ద కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందం నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో కోవిడ్–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) అందుబాటులోకి వచ్చింది. 1,500 బెడ్లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. (గుడ్‌న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు) ఇక కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య తగ్గడంతో నిన్న( శుక్రవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను ఎత్తివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగులోకి రావడంతో ఆయా ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. (కాస్త ఊరట!) -
ఆ పెళ్లిలో భౌతిక దూరం మాయం
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్‌లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్‌గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. -
కరోనా : హాట్‌స్పాట్‌లో కరీంనగర్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్ని కరీంనగర్ కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లాలో మొత్తం 6 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని వెల్లడించారు. హై రిస్క్ వ్యాధులతో ఉన్న వారిని నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కంటోన్మెంట్లో బారికేడ్లు ఎన్ని రోజులు కొనసాగించాలనే మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కరీంనగర్ హాట్ స్పాట్లో ఉందని అన్నారు. జిల్లాలో 322మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారని, ఇప్పటి వరకు 329 నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపామని పేర్కొన్నారు. వైరస్ కేసులు పెరుగుతుండటంతో అంతా బాగుంది అన్న స్థితికి ఇంకా మనం రాలేదనే విషయాన్ని గ్రహించాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల్లో రూ.1500 క్రెడిట్ అయ్యాయని గుంపులు గుంపులుగా బయటకు రావద్దని చెప్పారు. అరవై ఏళ్ల పైబడిన వారికి కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
సన్నిహితంగా మెలిగిన 25 మందికి క్వారంటైన్
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపింది. అంతా సద్దుమణుగుతుందకున్న సమయంలో జహీరాబాద్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యక్తి కూడా ఢిల్లీ నిజామొద్దీన్ తబ్లిగీ జమాత్ మర్కత్‌కు చెందినవారు కావడం గమనార్హం. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఢిల్లీ వెళ్లొచ్చిన వెంటనే పది రోజుల క్రితం గత నెల 31వ తేదీన ఇతనితో పాటుగా మరో నలుగురికి తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారు గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. తొలిసారి జరిపిన పరీక్షల్లో ఈ ఐదుగురికి నెగెటివ్ రావడంతో పరిశీలనలో ఉంచి మరోసారి గురువారం శాంపిల్స్ సేకరించారు. దీంతో జహీరాబాద్‌లోని గడిమేహల ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 25 మందికి క్వారంటైన్.. కరోనా పాజిటివ్‌గా వచ్చిన జహీరాబాద్‌కు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో పాటుగా అతనితో సన్నిహితంగా ఉన్న, స్థానికంగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బందని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వీరిని ప్రభుత్వ ఆదీనంలోని పాటి సమీపంలోని నారాయణ కాలేజీ క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. వీరి శాంపిల్స్‌ను సేకరించి సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ) హైదరాబాద్ కేంద్రానికి తరలించారు. ఈ 25 మందిలో 13 మంది కుటుంబ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కుటుంబీకులు ఉన్నారు. నలుగురు సభ్యులు ఇతని వద్ద పనిచేసే వారు ఉన్నారు. ఢిల్లీ వచ్చిన వెంటనే జలుబు, దగ్గు, జ్వరం ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. దీంతో ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునితో పాటు మరో ముగ్గురు సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ఇంకా నలుగురు పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువులు కావడం గమనార్హం. జిల్లాలో 7 హాట్స్పాట్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల నివాస ప్రాంతాలలో సుమారుగా కిలోమీటరు దూరం పరిధిలోని పరిసర ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో వీరభద్రనగర్, ఉస్మాన్పుర, మంజీరానగర్లను ఒక హాట్‌స్పాట్‌గా, పాత బస్టాండ్ పరిసర ప్రాంతంలోని మాధవనగర్ను ఒక హాట్‌స్పాట్‌గా, అంగడిపేట మొత్తాన్ని ఒక హాట్‌స్పాట్‌గా, కొండాపూర్‌లో ఒక హాట్‌స్పాట్, జహీరాబాద్‌లోని బృందావన్ కాలనీలో ఒక హాట్‌స్పాట్, గడిమహేలను ఒక హాట్‌స్పాట్‌గా, రాంచంద్రాపురంలోని మయూరీనగర్ను ఒక హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఆయా ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్, తదితర రసాయనిక ద్రావణాలతో పరిసరాలలో పిచికారీ చేయడంతో పాటుగా పరిశుభ్రం చేస్తున్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయలు నిత్యావసర వస్తువులు, మందులు, తదితర సామగ్రి అంతటిని ఇంటివద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్‌జోన్‌గా గడి కాలనీ జహీరాబాద్: పట్టణంలోని గడి కాలనీని రెడ్ జోన్‌గా ప్రకటించారు. తాజాగా కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటీవ్‌గా రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం కాలనీని పూర్తిగా దిగ్బంధం చేశారు. గడి కాలనీ చుట్టూ కిలో మీటర్ మేర రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దార్ నాగేశ్వరరావు, డీఎస్పీ గణపత్‌జాదవ్, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డిలు పేర్కొన్నారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు. 15వ వార్డు నుంచి 24వ వార్డు వరకు ఎవరు కూడా తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మున్సిపల్ సిబ్బంది సహకారం అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 1897 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇతర ప్రాంతాల వారు సైతం రెడ్ జోన్ పరిధిలోకి ప్రవేశించరాదని సూచించారు. కరోనా పాజిటీవ్ వచ్చినందున సదరు వ్యక్తిని, కుటుంబ సభ్యులను, వారిని కలిసిన వ్యక్తులను సైతం చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం హయ్యర్ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అదనపు కలెక్టర్ పర్యటన.. కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చిన జహీరాబాద్ పట్టణంలోని గడి కాలనీ, పరిసర వార్డుల్లో అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) రాజర్షిషా పర్యటించారు. శుక్రవారం సాయంత్రం రెడ్‌జోన్‌గా ప్రకటించిన వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో చర్చించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని సూచించారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేశారు. వ్యాధి విస్తరించకుండా చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి వివరించారు. ఆర్డీఓ రమేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి, ఎస్ఐ వెంకటేష్‌లతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది, ఆయా శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. నియంత్రణకు అన్ని చర్యలు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచి ఎవరికి కూడా ఈ వైర స్ వ్యాపించిన దాఖలాలు లే వు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారందరి నీ వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచడం జరిగింది. తాజాగా పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిని 10 రోజుల క్రితమే గాంధీకి తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా వారి కుటుంబీకులు, అతను సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్లో ఉంచాం. దీంతో ఢిల్లీ వెళ్లొచ్చిన వా రందరి కుటుంబీకుల ప్రభుత్వ క్వారంటైన్ ముగిసిన వె ంటనే ఈనెల 21 వరకు హోం క్వారంటైన్‌కు తరలించాం. ఇలా కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు చేపట్టాం. – మోజీరాం రాథోడ్, డీఎంహెచ్ఓ -
నిజామాబాద్, బాన్సువాడ హాట్‌స్పాట్ దిశగా!?
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.. ప్రధానంగా నిజామాబాద్, బాన్సువాడల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. శనివారం నగరంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. బాన్సువాడలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా ప్రకటించే అవకాశముంది. నిజామాబాద్, బాన్సువాడల్లో ఇప్పుడు లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఖిల్లా ప్రాంతానికి చెందిన విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. ఆయన ద్వారా ఇటీవల అతని మనువడికి కూడా సోకినట్లు నిర్ధారణ తేలింది. అలాగే ఇటీవల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇదే ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తిని బాన్సువాడకు చెందిన మరో వ్యక్తి కారులో నిజామాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా అతడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ద్వారా అత్యంత సన్నిహితంగా మెదిలిన వారికి వైరస్ సోకడాన్ని వైద్యాధికారులు లోకల్ ట్రాన్స్మిషన్ కేసుగా పరిగణిస్తారు. బాన్సువాడలోనూ.. బాన్సువాడలో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఇద్దరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా వైరస్ వ్యాప్తించింది. ఓ వ్యక్తి ద్వారా అతని భార్యకు రాగా, మరో వ్యక్తి ద్వారా అతని కొడుకు, కూతురుకు వైరస్ సోకింది. ఇలా బాన్సువాడలోనూ లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పట్టణం కూడా పరిస్థితులు హాట్‌స్పాట్‌గా ప్రకటించే వైపు దారి తీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాట్స్పాట్లను గుర్తిస్తారిలా.. కరోనా కేసుల తీవ్రత బట్టి ప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటిస్తుంది. పాజిటివ్ కేసుల నమోదు, వైరస్ వ్యాపిస్తున్న తీరు, లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసుల నమోదు ఆధారంగా హాట్స్పాట్లుగా గుర్తిస్తారు. నిజామాబాద్, బాన్సువాడల్లో నెలకొంటున్న పరిస్థితులు అటు వైపే దారి తీస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ హాట్‌స్పాట్‌గా ప్రకటిస్తే.. ఈ ప్రాంతాలకు నిరీ్ణత దూరం వరకు ఇతరులను ఎవ్వరినీ అనుమతించరు. ఆయా ప్రాంతాల నుంచి వైరస్ వ్యాప్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదైతే కష్టమే.. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తిరిగిన ప్రాంతంలో వైరస్ వ్యాపించి అతన్ని కలిసిన వారికి, ఆయన తిరిగిన ప్రదేశాల వద్దకు వెళ్లిన వ్యక్తులకూ వ్యాపిస్తే దాన్ని కమ్యునిటీ ట్రాన్స్మిషన్ కేసులుగా పరిగణిస్తారు. అయితే, ఇప్పటి వరకు జిల్లాలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదని, కేవలం పాజిటివ్ వచ్చిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెదిలే కుటుంబ సభ్యులకు మాత్రమే వైరస్ సోకిందని జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని హెచ్చ రించారు. -
హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మెడికల్ టీమ్‌లతో..
-
‘జియోఫై’ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్
జియోఫై ఫ్యామిలీ విస్తరణలో భాగంగా రిలయన్స్ కొత్త జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 999 రూపాయల ధర కలిగిన ఈ డివైజ్‌పై జియో సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత ఆఫర్ ప్రకారం 999 రూపాయలకు లభించే జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేసేటపుడు మన దగ్గర ఉన్న పాత డోంగల్/ మోడమ్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్ మీ సొంతం.. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలంటే మొదట జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత జియో సిమ్‌ను యాక్టివేట్ చేసి రూ.198 లేదా 299 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాలి. జియోప్రైమ్ మెంబర్షిప్ కోసం అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి. నాన్ జియో డోంగల్‌ను ఎక్స్చేంజ్ చేసుకునేటపుడు.. ఆ డోంగల్ సీరియల్ నెంబర్‌ను పొందపరచాలి. అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసిన జియోఫై ఎమ్‌ఎస్‌డీఎన్ (MSDN) నంబర్‌ను కూడా జత చేయాలి. అలా అయితేనే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా ‘మైజియో’ అకౌంట్లో 2,200 రూపాయలు క్రెడిట్ అవుతాయి. కానీ ఈ మొత్తమంతా ఒకేసారి క్రెడిట్ కాకుండా 50 రూపాయల విలువ గల 44 వోచర్లు లభిస్తాయి. కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టిన జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌పై ఏడాదిపాటు వారెంటీ ఉంది. దీని డౌన్లోడ్ స్పీడు 150ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్.. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్టీ3800 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్ ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను సపోర్టు చేస్తుంది. -
జియో కొత్త 4జీ హాట్‌స్పాట్
రిలయన్స్ జియో తన జియోఫై ఫ్యామిలీని విస్తరిస్తోంది. నేడు కొత్త జియోఫై 4జీ ఎల్టీఈ హాట్‌స్పాట్ డివైజ్‌ను 999 రూపాయలకు రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ హాట్‌స్పాట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఏడాది వారెంటీ, 150ఎంబీపీఎస్ వరకు డౌన్లోడ్ స్పీడుతో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని అప్లోడ్ స్పీడు 50ఎంబీపీఎస్ వరకు ఉంది. ‘డిజైన్డ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌తో ఈ డివైజ్ వచ్చింది. ఒరిజినల్ జియోఫై మాదిరిగా కాకుండా.. గుడ్డు ఆకారంలో ఈ డోంగల్ ఉంది. పవర్ ఆఫ్/ఆన్ చేయడానికి ఫిజికల్ బటన్లను, డబ్ల్యూపీఎస్, బ్యాటరీ కోసం నోటిఫికేషన్ లైట్స్‌ను ఇది కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్వర్క్ కనెక్ట్ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే స్మార్ట్ఫోన్లలోని జియో 4జీ వాయిస్ యాప్‌తో హెచ్డీ వాయిస్, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఏఎల్టీ3800 ప్రాసెసర్‌తో ఇది రూపొందింది. ఎఫ్‌డీడీ బ్యాండ్ 3, బ్యాండ్ 5, టీడీడీ-బ్యాండ్ 40లను ఇది సపోర్టు చేస్తుంది. ఈ కొత్త జియోఫైలో స్టోరేజ్‌ను 64జీబీ వరకు విస్తరించేందుకు మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది ప్యాక్ అయింది. అయితే ఈ కొత్త మోడల్ ఇప్పటి వరకు జియో.కామ్‌లో లిస్టు అవలేదు. అయితే రిలయన్స్ జియో ఇటీవలే తన పాత జియోఫై డివైజ్‌పై రూ.3,595 విలువైన ప్రయోజాలను అందించనున్నట్టు ప్రకటించింది. అనంతరం వెంటనే ఈ కొత్త జియోఫై మోడల్‌నూ రిలయన్స్ ఆవిష్కరించింది. -
హాట్..హాట్‌స్పాట్!
ఫ్రీ వై–ఫైకి జై కొడుతున్న హైదరాబాదీలు - సినిమాలు, అశ్లీల సైట్లు చూసేవారే ఎక్కువ..! - సగటున రోజుకు 300 ఎంబీ డేటా వినియోగం - ప్రస్తుతం 43 చోట్ల ఏర్పాటు.. త్వరలో మరో 240 హాట్స్పాట్లు హాట్‌స్పాట్.. ఉచిత వై–ఫై.. ప్రస్తుతం హైదరాబాదీలను ఆకర్షిస్తున్న విషయాలివీ. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ గ్రేటర్ మహానగరంలోని 43 ప్రాంతాల్లో 113 వై–ఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ 43 చోట్ల హైదరాబాదీలు ఇప్పుడు ఉచితంగా వై–ఫై సేవలను పొందుతున్నారు. తొలి 15 నిమిషాల పాటు ఈ వై–ఫై సేవలు ఉచితంగా అందుతాయి. ఆ తర్వాత వై–ఫై సేవలను వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. – సాక్షి, హైదరాబాద్ సినిమాలు.. అశ్లీల సైట్లే అధికం.. ప్రస్తుతం ఉచిత వై–ఫై వినియోగానికి గ్రేటర్ సిటిజన్లు జై కొడుతున్నారు. 43 ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద ఎక్కవ మంది సినిమాలు, పాటలు వంటి వినోదాన్ని పంచే కార్యక్రమా లను వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట. ఇక కొంతమంది కుర్రకారు ఉచిత వై–ఫై లభిస్తున్న తొలి 15 నిమిషాల్లో అశ్లీల, పోర్న్సైట్లను వీక్షించేందుకు మక్కువ చూపుతున్నారట. మరికొందరు బస్సు, రైళ్ల వేళలు, రిజర్వేషన్ల వివరాలను ఆన్లైన్లో తెలుసుకుంటున్నారట. ఇక ఉచిత డేటా వినియోగంలో గ్రేటర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస్స్టేషన్లు అగ్రభాగాన నిలిచాయి. డేటా వినియోగంలో ట్యాంక్‌బండ్, నక్లెస్‌రోడ్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, లుంబినీపార్క్, జూబ్లీ బస్‌స్టేషన్ ప్రాంతాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్ వంటి పర్యాటక స్థలాల్లో ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్‌కు మాంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కోక్కరు సగటున నిత్యం సుమారు 300 ఎంబీ డేటాను వినియోగించుకుంటున్నట్టు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో.. నగరంలో ఇప్పటికే 43 చోట్ల హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేయగా.. మూడు నెలల్లో మరో 240 ప్రాంతాల్లో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ నిర్ణయించింది. కాగా, నగరవ్యాప్తంగా వై–ఫై సేవల విస్తరణకు ప్రభుత్వం నుంచి అనుమతుల జారీ ఆలస్యమవుతుండడం, వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్ కనెక్షన్, రోడ్ కటింగ్ అనుమతులను మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నాయి. కాగా, ఒకేసారి వందలాది మంది వై–ఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని, ఒక్కోసారి వై–ఫై కనెక్ట్కావడం లేదని నక్లెస్‌రోడ్ వద్ద వై–ఫై సేవలు వినియోగిస్తున్న పలువురు ‘సాక్షి’కి తెలిపారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. -
సొంతంగా 50 హాట్‌స్పాట్స్
రాజధానిలోఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ కసరత్తు పూర్తయిన టెండర్ల ప్రక్రియ... సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రయివేటు టెలికం సంస్థలకు దీటుగా వినియోగ దారులకు విస్తృత సేవలందించేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నగరంలో సొంతంగా 50 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎల్ఎండ్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హాట్‌స్పాట్ కేంద్రాలకు అనుసంధానంగా మరో 300 పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో పాయింట్ 70 మీటర్ల పరిధి వరకు కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించింది. వీటి ద్వారా వినియోగదారులు 2 నుంచి 10 ఎంబీపీఎస్ స్పీడుతో డేటా డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. అయితే... ప్లాన్ చార్జీలు ఇంకా ఖరారు కాలేదు. మార్చిలో హాట్స్పాట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ పీజీఎం రామచంద్ర తెలిపారు. ఇప్పటికే క్వాడ్జన్ సంస్థతో కలసి ఏర్పాటు చేసిన 45 హాట్‌స్పాట్స్‌తో ఉచిత వైఫై సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. వీటి ద్వారా రోజుకు 80 నుంచి 100 జీబీ డేటా వినియోగమవుతోంది. ఈ ఉచిత వైఫై సేవలను ప్రస్తుతం 15 నిమిషాలకే పరిమితం చేసింది. మూడు రకాలుగా... మహానగరంలో మూడు రకాలుగా హాట్స్పాట్లను ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళిక రూపొందించింది. ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యం మేరకు స్మాల్, మీడియం, లార్జ్ హాట్స్పాట్లు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాట్‌స్పాట్‌కు ఐదు వైఫై టవర్లు... ఒక్కో టవర్ ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధి మేర సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైఫై సేవల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. సర్వీస్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా ఆయా సంస్థల నుంచి వసూలు చేస్తోంది. -
హైహై... వైఫై!
ఫ్రీ వైఫైకి విశేష స్పందన నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లు టాప్ త్వరలో నగర వ్యాప్తంగా 3 వేల హాట్స్పాట్లు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు సిటీబ్యూరో: ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. నగరంలో 15 చోట్ల బీఎస్ఎన్ఎల్ సంస్థ 20 నిమిషాల చొప్పున ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసింది. క్రమంగా వీటి సంఖ్య పెంచుతోంది. దీనికి స్పందన అదే స్థాయిలో ఉంటోంది. నెక్లెస్ రోడ్లో వారానికి సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వైఫై వినియోగమవుతోందని... 8.83 టెరాబైట్ల డేటాను వినియోగదారులు వాడుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్ల మేర 10.63 టెరాబైట్ల డేటా వినియోగించినట్లు తెలిసింది. ఆ తరవాత స్థానంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. కనిష్టంగా బిర్లా ప్లానిటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ వద్ద 580 సెషన్స్ మేర వైఫై వినియోగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 3 వేల హాట్స్పాట్లు నగర వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం... హాట్స్పాట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా సహకారం అందితే మరో ఆరు నెలల్లో 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. నగరంలో తమ సంస్థకు 4,500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినియోగంలో సమస్యలివీ.. ఉచిత వైఫై వినియోగంలో పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాది మంది వైఫై సేవలకు ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని... ఒక్కోసారి కనెక్ట్ కావడం లేదని నెక్లెస్ రోడ్‌పై వైఫై వినియోగిస్తున్న పలువురు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు అందడం లేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. వినియోగించే తీరిదీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ను క్లిక్ చే సి మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్ చేయాలి.ఆ తరవాత మొబైల్‌కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు అందుతాయి.ఆ తరవాత వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లు ఉన్నచోట బీఎస్ఎన్ఎల్ విక్రయించే కూపన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయోజనాలివీ.. ఆన్లైన్లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. వెఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వీలుంటుంది. కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి.