చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్‌లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్‌గా తేలింది. ఈ హోటల్‌కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment