luxury hotel
-
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
Sheybarah Resort దుబాయ్ మరో అద్భుత ఆవిష్కారానికి నాంది పలుకుతోంది. సౌదీ అరేబియాలోని మునుపెన్నడూ చూడని విధంగా ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సౌదీకి చెందిన రెడ్ సీ గ్లోబల్ (RSG) సంస్థ విడుదల చేసింది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది. ఆధునిక టచ్‌తో పాటు, రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్‌తో విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది. "ఏరియల్ అకామడేషన్ పాడ్స్" అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట.పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఉపయోగిస్తోంది. ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతాయి. అంతేకాదు, షేబరా హోటల్ 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్‌లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలుచూస్తే మతిపోవాల్సిందే. ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్లెస్-స్టీల్ ఆర్బ్లతో చాలాయూనీక్గా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫోటోలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అడ్రస్ బీచ్ రిసార్ట్, ఆఫీస్ ఆఫ్ ది ఫ్యూచర్, సిటీ వాక్, మరిన్నింటితో సహా దుబాయ్‌లోని కొన్ని ఐకానిక్ ప్రాజెక్ట్‌లను అందించిన ఘనత కిల్లా డిజైన్ సొంతం. نفخر بأن جزيرة #أمهات في #وجهة_البحر_الأحمر سترحب بطلائع زوارها قريباً! لقد وصلت نسبة الإنجاز في تطوير منتجع "سانت ريجيس البحر الأحمر" لـ 93%، فيما وصلت جاهزية منتجع "نجومه، ريتز كارلتون ريزيرف" لـ 87.% كم هي نسبة حماسَك أنت؟ pic.twitter.com/Fyg8MCMTzs — البحر الأحمر الدولية (@RedSeaGlobalAR) August 14, 2023 /> -
రూ.6 కోట్ల కారు.. పార్కింగ్ చేయమని ఇస్తే నాశనం చేశారు..
కాన్బెర్రా: రెండు లాంబోర్గిని కార్లు. వీటి విలువ రూ.12 కోట్లు. ఓ లగ్జరీ హోటల్‌కు వెళ్లిన కోటీశ్వరుడు ఈ కార్లను తీసుకెళ్లాడు. అయితే పార్కింగ్ చేయమని చెప్పి ఈ కార్ల కీస్‌ను హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. ఇంత ఖరీదైన కారు ఎక్కానని ఆనందంలోనే, లేక డ్రైవింగ్ సరిగ్గా రాకనో తెలియదు గానీ.. హోటల్ సిబ్బంది ఈ కారును ప్రమాదానికి గురి చేశాడు. అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. అంతేకాదు ముందున్న మరో లాంబోర్గినిని కూడా ఢీకొట్టాడు. దీంతో ఓనర్ కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Craig Jones (@craigjonesbjj) ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. ఈ కార్ల యజమాని పేరు లారెన్స్ ఎస్కలాంటే. పెర్త్‌లోని లగ్జరీ హోటల్ క్రౌన్ టవర్స్‌కు అతను వెళ్లినప్పుడు ఇలా జరిగింది. చదవండి: చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పనీర్ పెట్టలేదని రచ్చ రచ్చ.. వీడియో వైరల్.. -
ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు..
పైన చెప్పుకున్నట్లు ఇదీ ఆకాశహర్మ్యమే.. ఉన్నది కూడా చైనాలోనే.. అయితే.. మన కోసం కాదు.. స్టార్ హోటల్‌ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో పందులను పెంచుతున్నారు. ఆఫ్రికాలో స్వైన్‌ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. మొదట రెండు మూడు అంతస్తులతో మొదలైన ఈ ఫార్మింగ్ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. అక్కడి పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరాచేస్తాయి. గాలి శుద్ధీకరణ, ఇన్ఫెక్షన్స్ సోకకుండా పద్ధతులు, పందుల వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంట్, దాన్నుంచే విద్యుత్ ఉత్పత్తి ఇలా అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ప్రారంభమైతే నెలకు 54వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నులు పోర్క్ ఉత్పత్తి చేయనుంది. గతంలో యూరప్‌లోనూ ఇలాంటి నిర్మాణాలున్నా.. వివిధ కారణాలతో చాలా మూతపడ్డాయి. ఉన్న ఒకటి అరా మూడంతస్తులకు మించలేదు. చదవండి: మీ కోసం తెచ్చిన కేక్ పక్కోడు కట్ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ! -
మతి పోయేలా.. ‘మలేనా’.. ఖర్చు రూ.2500 కోట్లు, మరెన్నో విశేషాలు
పేద్ద.. క్రూయిజ్ ఓడ నీళ్లలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ బిల్డింగే అలా కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ ఓడలను అంతలా అద్భుతంగా నిర్మిస్తుంటారు. రోడ్రిగ్యుయెజ్ డిజైన్ అనే కంపెనీ కూడా తామేం తీసిపోలేదంటూ కళ్లు చెదిరే ఓ ఓడ డిజైన్‌ను రూపొందించింది. 110 మీటర్ల పొడవు.. 26 మీటర్ల ఎత్తున్న అతిపెద్ద ఈ ఓడను పక్కనుంచి చూస్తే ఓ లగ్జరీ హోటలేనా అనిపించేట్టు ఉంటుంది. ఈ డిజైన్‌తో ఓడను నిర్మించాలంటే ఓడలో వాడే వస్తువులు, నిర్మించే కంపెనీని బట్టి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఓడకు ‘మలేనా’ అని పేరు పెట్టింది. ఓడలో మొత్తం 11 క్యాబిన్లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి 24 మంది ప్రయాణించొచ్చు. ఓడ ప్రధాన డెక్‌లో 6 వీఐపీ క్యాబిన్లు ఉంటాయి. లోయర్ డెక్‌లో 4 డబుల్ క్యాబిన్ డెక్‌లు, ఒక యజమాని అపార్ట్మెంట్ ఉంటాయి. ఇందులో హాట్ టబ్, డైనింగ్ ప్రాంతం ఉంటుంది. లోయర్ డెక్లోనే 9 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రెండు ఇన్ఫినిటీ పూల్స్, వీటితో పాటు సన్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఏడుగురు కూర్చునేలా బార్ ఉంటుంది. లోయర్ డెక్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్ వస్తుంది. ఇక్కడ ఓ పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 24 మంది కలిసి కూర్చొని తినవచ్చు. అప్పర్ డెక్‌లో ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఏసీహెచ్ 160 లేదా అలాంటి పరిమాణంలోని హెలికాప్టర్లు దీనిపై ల్యాండ్ చేయవచ్చు. (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) నిర్మాణానికే నాలుగైదేళ్లు ఓడలో అన్నింటికన్నా పైన సన్ డెక్ ఉంటుంది. దీన్నే పార్టీ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ మరో హాట్ టబ్, కూర్చునేందుకు ఓ ప్రాంతం, ఓ బార్ కూడా ఉంటాయి. బోటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధనాలతో కలిసి నడుస్తుంది. బోటును నిర్మించడానికి దాదాపు 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ మాత్రమే అయినా ఓడ నిర్మాణానికి ఓ షిప్ యార్డ్‌తో, నిర్మించాలనుకుంటున్న వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని డిజైన్ కంపెనీ చెప్పింది. (చదవండి: లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!) – సాక్షి సెంట్రల్ డెస్క్ -
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్‌స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్‌గా తేలింది. ఈ హోటల్‌కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
అరెస్టయిన యువరాజులంతా ఎక్కడున్నారు?
రియాద్ : అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ ఆదేశాల మేరకు 11 మంది యువరాజులను, మంత్రులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ తర్వాత వారందరిని ఎక్కడికి తరలించారు? అన్న ప్రశ్నలను పలువురు లెవనెత్తున్నారు. ఈ మేరకు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు జరిపిన అన్వేషణలో ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. రియాద్ లోని రిట్జ్ కార్లటన్ విలాసవంతమైన హోటల్లో వారంతా సేదతీరుతున్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు వారాల క్రితం వాణిజ్య ఒప్పందాల కోసం 3 వేల మంది అధికారులు, వ్యాపార వేత్తలతో ఇక్కడ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే లగ్జరీ హోటల్లోని బాల్రూమ్ బీ లో వారంతా నేలపై పడుకున్న దృశ్యాలు విడుదల అయ్యాయి. వారి చుట్టూ గార్డులు కాపలా ఖాయటం చూడొచ్చు. మరికొందరు వీఐపీలను కూడా ఇదే హోటల్లోని మరికొన్ని రూమ్‌లలో ఉంచినట్లు ది టైమ్స్ సోమవారం ఓ కథనం ప్రచురించింది. గదులేవీ ఖాళీ లేవని తమ ప్రతినిధితో చెప్పినట్లు ఆ కథనంలో టైమ్స్ పేర్కొంది. ఖరీదైన ఈ కారాగారంలో 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులు, మల్టీ మిలీనియర్లు ఉన్నారు. ఇక అరెస్టయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దశాబ్దాలుగా సౌదీ వ్యాపార వ్యవస్థను శాసిస్తున్న ససీర్ బిన్ అఖీల్ అల్ తయ్యార్ తోపాటు ఇప్పుడు బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న ప్రిన్స్ అల్వాలీద్ బిన్ తలాల్ కూడా ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అదంతా ఓ డ్రామాగా అభివర్ణించాయి. అయితే బిన్ సుల్తాన్ చేసిన పని సమీప భవిష్యత్తులో దుబాయ్ ఆర్థిక వ్యవస్థను(చమురు రంగంలో కాకుండా) దారుణంగా కుదేలు చేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. A look inside the Ritz Carlton where Saudi officials are being detainedhttps://t.co/DoD5Z2NXEg (Video from Reuters) pic.twitter.com/yepuArlAG9 — Haaretz.com (@haaretzcom) November 7, 2017 -
ఆకాశంలో పెంట్‌హౌస్..!
ఒక గదిలో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ.. అత్యంత ఖరీదైన సోఫా.. అందులో బంగారు కుషన్లు, మరో గదిలో డబుల్ బెడ్.. అటాచ్డ్ బాత్రూమ్, సమస్త సౌకర్యాలతో కూడిన ఓ డైనింగ్ రూమ్.. మొత్తం మూడు గదులున్న ప్రైవేటు సూట్. ఇదంతా ఏదో హోటల్ గురించి అనుకుంటున్నారా? లగ్జరీ హోటల్లో ఇలాంటివి కామనే. కానీ ఇవే సౌకర్యాలు ఓ విమానంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ! అలాంటి అద్భుతాన్ని ‘ఇత్తిహాద్’ ఎయిర్‌లైన్స్ సంస్థ సాకారం చేసింది. ప్రపంచంలోనే తొలి ఎగిరే ‘పెంట్‌హౌస్’ను తన ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. ఏ380 ఎయిర్బస్లోని అప్పర్ డెక్‌లో 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘ది రెసిడెన్స్’ పేరుతో ఓ పెంట్‌హౌస్ ఏర్పాటుచేసింది. ఈ విమానం ఈనెల 27 నుంచి అబుదాబీ, లండన్ మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రెసిడెన్స్‌లో ఒకవైపు సింగిల్ లేదా డబుల్ ఆక్యుపెన్సీ చార్జీని 12,500 పౌండ్లుగా (దాదాపు రూ. 12.40 లక్షలు) నిర్ధారించారు. ఇంత రేటున్నా, అప్పుడే ఈ టికెట్లన్నీ అమ్ముడుపోయాయట.