పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.
బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్‌లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.
ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్‌లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.
నరకానికి స్వాగతం
"నన్ను ఒక లగ్జరీ హోటల్‌లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్‌కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment