work hours
-
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
ఇదే జరిగితే.. టెకీల పరిస్థితి ఏంటి?
ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది. ఇది ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకతను రేకెత్తించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులపై ఉంటుందని అన్నారు.కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్టైమ్తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మకశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. -
వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్
వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు వారాంతపు సెలవులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదని, పని చేయకుండా ఖాళీగా ఉండడం తనకు నచ్చేది కాదని ఆయన తెలిపారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. పని కంటే జీవితం గొప్పదని, ఎంతో విలువైందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన పిల్లల వయసులో ఉన్నప్పుడు తనకు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందని బిల్‌గేట్స్ చెప్పారు. గోల్‌కీపర్స్ ఈవెంట్లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదీ చదవండి: అప్పు ప్రమాదఘంటికలివే.. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే. -
...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు: మరో సీఈవో..
దేశంలో ఉద్యోగులు, యువత ఎంత సేపు కష్టపడాలి.. ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బాటలోకి మరో సీఈవో వచ్చి చేరారు. ఎక్కువ గంటలు పనిచేయడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఇంకా ఏమన్నారన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ ‘వేఫెయిర్’ సీఈవో నీరజ్ షా (Wayfair CEO Niraj Shah).. ఎక్కువ పని గంటలు పనిచేయాలని తమ కంపెనీ ఉద్యోగులకు సూచించారు. ఎవరైనా సోమరితనంతో విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ఉద్బోధించారు. విజయం సాధించాలంటే కష్టపడాల్సిందేనంటూ ఈ భారతీయ-అమెరికన్ బిజినెస్‌మన్ తమ ఉద్యోగులకు పంపిన ఒక నోట్లో పేర్కొన్నట్లుగా సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనంలో నివేదించింది. కంపెనీ డబ్బును మీదిగా భావించండి.. "ఎక్కువ గంటలు పని చేయడానికి, మరింత బాధ్యతగా ఉండటానికి, పనిని, జీవితాన్ని మిళితం చేయడానికి సంకోసించాల్సిన, సిగ్గుపడాల్సిన పనిలేదు. సోమరితనంతో ఎవరూ విజయం పొందినట్లు చరిత్రలో లేదు" అని నీరజ్షా ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ ఇటీవలి విజయాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. కంపెనీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయినీ తమదిగా భావించి మరింత బాధ్యతగా పనిచేయాలని ఉద్యోగులను కోరారు. నారాయణమూర్తి బాటలో.. యువత ఎక్కువ పని గంటలు పనిచేయాలనే భావనను మొదటి సారిగా వెలుబుచ్చిన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. రెండు నెలల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత చర్చ విస్తృతమైంది. విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమందికి ఆయన భావనను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు. -
పనిగంటలపై నవ్వుతెప్పిస్తున్న మీమ్స్ - పారిశ్రామిక వేత్తల మధ్య..
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే అంటూ వెల్లడించారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని, ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు ఎక్కువపని చేశారని వెల్లడించారు. నారాయణ మూర్తి పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు అతి తక్కువ కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కొందరు ఈయన వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరికొందరు గట్టిగా విమర్శించారు. అటు ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి, కొంతమంది ప్రముఖుల వరకు చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు. పనిగంటలు ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న వేళ మనుషులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా నిర్వహించిన ‘వాట్ నౌ’ షోలో వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో మనుషులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని చెబుతూ.. కొత్త టెక్నాలజీ మనుషుల ఆయుష్షు, ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? పనిగంటలు ఉద్దేశించి ఇద్దరు పారిశ్రామిక వేత్తలు చేసిన వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ చిన్న వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం నవ్వు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం. -
పనిగంటలపై మరోసారి కీలక వ్యాఖ్యలు.. కష్టం వృధా కాలేదు
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలు కొంత మరుగున పడగానే.. మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్‌లో వారానికి 85 నుంచి 90 గంటలు పని చేసిన సందర్భాలున్నాయన నారాయణ మూర్తి తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలకు పైగా పనిచేసినట్లు వెల్లడించారు. ఉదయం 6:20 గంటలకు ఆఫీసుకు చేరుకొని రాత్రి 8:30 గంటలకు బయట వచ్చేవాడినని, అలా వారంలో ఆరు రోజులు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. 40 సంవత్సరాల వయసులో కూడా వారానికి 70 గంటలు పనిచేసినట్లు తెలిపారు. నా కష్టం ఎప్పుడూ వృధా కాలేదని వెల్లడించారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం కష్టపడి పని పనిచేయడమే, దీనిని తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. గత కొన్ని రోజులకు ముందు ఒక ఇంటర్వ్యూలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ప్రజలు తమ దేశాలను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఎక్కువ పనిగంటలు చేసారని తెలియజేస్తూ.. మనదేశంలో కూడా అలా చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అప్పుడే తెగ వైరల్ అయ్యాయి. -
అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్ ఎంపీ
భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశ ఉత్పాదకత పెరగడానికి ఎక్కువ గంటలు పనిచేయాలన్న నారాయణమూర్తి సలహాను సమర్థిస్తున్నవారి జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ ప్రముఖ నేత, ఎంపీ మనీష్ తివారి (Manish Tewari) చేరారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్)లో ఆయన పోస్ట్ చేశారు. అది తప్పనిసరి నియమం కావాలి ‘వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు.. అందులో తప్పేముంది? ఓ వైపు ప్రజా జీవితం, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే మా లాంటి ప్రజా ప్రతినిధులు రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నాం. నేను చివరగా ఎప్పుడు ఆదివారం సెలవు తీసుకున్నానో నాకు గుర్తే లేదు. గెలిచినా, ఓడిపోయిన ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదివారం సెలవు అనేది ఉండదు. వారానికి 70 గంటలు పని, ఒక రోజు సెలవు, సంవత్సరానికి 15 రోజులు విరామం అనేది తప్పనిసరి నియమం కావాలి’ అని మనీష్ తివారి తన ట్వీట్లో రాసుకొచ్చారు. I do not understand the brouhaha around @Infosys_nmurthy statement on a 70 hour work week . What is wrong with it ? Some of us Public Representatives work 12-15 hours a day 7 days a week balancing careers with Public Service. I do not recall when I last took a Sunday off.… — Manish Tewari (@ManishTewari) November 10, 2023 -
అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్!
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్ ఫౌండర్, చైర్పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా. అది వెర్రితనం ‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా. వారానికి 70 గంటలు పనికే కేటాయిస్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్‌ఫోర్స్‌లో చాలా మంది మహిళలకు వర్క్‌తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు. యువత ఆఫీస్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక యజమానిగా తాను అవుట్‌పుట్‌పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు. -
ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్ కీలక నిర్ణయం
అధిక పని గంటలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇతర కంపెనీల్లో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. జీతాల పెరుగుదల అంతంతమాత్రమే. దానికితోడు వారానికి డెబ్బై గంటల పనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తూ.. ఉన్నవారితో ఎలా ఎక్కువసేపు పనిచేయించుకోవాలో ఆలోచిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా మోతీలాల్‌ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. పని గంటలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం 8-8.5 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అనుమతించరు. ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు. పని సమయం ముగిసిన వెంటనే కంపెనీ ఈమెయిల్ సర్వర్లను ఆపేస్తామన్నారు. 45 నిమిషాల గ్రేస్ పిరియడ్ తర్వాత కంపెనీ తరఫున ఎలాంటి ఈమెయిల్‌లు పంపడం, స్వీకరించడం జరగదని చెప్పారు. ఎవరైనా షిఫ్ట్ సమయానికి మించి కార్యాలయంలో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. కొత్త పాలసీని ఉద్దేశించి సంస్థ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. తమకు పని గంటల సంఖ్య ముఖ్యం కాదని ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న సంస్థలోని కొందరు ఉన్నత అధికారులకు వారి సొంత పని షెడ్యూల్ కారణంగా ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధానాన్ని సంస్థ అన్ని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. కొత్త పాలసీ సంస్థలో పనిచేస్తున్న 11,000 మందిలో దాదాపు 9,500 మందికి వర్తిస్తుందని చెప్పారు. -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
5-రోజులు ఆఫీస్ విధానం చచ్చింది: ప్రముఖ బిలియనీర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఉత్పాదకత మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా ప్రస్తుత పని ఉత్పాదకతపై చర్చ సాగుతోంది. ఈ విషయంపై తాజాగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా.. నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఏ ఉద్యోగి ఎన్ని గంటలు పని చేస్తున్నారన్నదానిపై పట్టింపు లేదని, వారి ఆశయం, లక్ష్యం, ఎంత సాధించారన్న దానినే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. వర్తమానం, భవిష్యత్ హైబ్రిడ్ వర్క్‌దే.. పనిలో పనిగా వారానికి ఐదు రోజుల ఆఫీస్ వర్క్ విధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు హర్ష్ గోయెంకా. ఐదు రోజుల ఆఫీస్ విధానం ముగిసిన అధ్యాయం.. వర్తమానం, భవిష్యత్ హైబ్రిడ్ వర్క్ విధానానిదే అని పేర్కొన్నారు. "వారానికి 5 రోజుల ఆఫీస్ విధానం చచ్చింది. హైబ్రిడ్ వర్క్ విధానానిదే వర్తమానం, భవిష్యత్తు" అని రాసుకొచ్చారు. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) కరోనా మహమ్మారి వివిధ రంగాలలో ఉద్యోగుల పని విధానాన్ని మార్చివేసిందనడంలో సందేహం లేదు. కానీ మహమ్మారి ప్రభావం ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో, కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవడం ప్రారంభించాయి. హైబ్రిడ్ లేదా ఆన్-సైట్ మోడల్ వర్క్‌ను అనుసరిస్తున్నాయి. జెరోధా సీటీవో కైలాష్ నాధ్ ఇటీవల మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తొలగించడం అంత సులువు కాదన్నారు. అయితే తమ ఉద్యోగులు ఇంటి దగ్గర కంటే ఆఫీసు నుంచి పని చేయడం ద్వారా పనులను వేగంగా పూర్తి చేయగలిగారని చెప్పారు. (భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్ టెక్.. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థతో..) 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 -
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
సాక్షి కార్టూన్ 13-11-2022
సాక్షి కార్టూన్ 13-11-2022 -
బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే!
దేశంలో అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల పనిదినాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారానికి 6 రోజులు పని చేసే ఉద్యోగులు ఇకపై 5 రోజులు మాత్రమే పనిచేయనున్నారా? అంటే అవుననే అంటోంది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ). అంతే కాదు బ్యాంకు యూనియన్ సభ్యులు కొన్ని డిమాండ్లను ఆర్బీఐ, కేంద్రం ఎదుట ఉంచారు. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఏఐబీఈఏ సంఘం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో.. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేస్తుండగా.. ఆ పనివేళల్ని 5 రోజులకు కుదించాలని ప్రతిపాదించింది. అదే సమయంలో బ్యాంకు పనిదినాల్ని 5 రోజులకు కుదించడంతో పాటు..రోజుకు మరో అరగంట అదనంగా పనిచేస్తామని పేర్కొంది. బ్యాంకుల పనిదినాలు ఇలా ఉండాలి బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ ప్రకారం..ప్రతిపాదిత పని గంటలు ఉదయం 9:15 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు కాకుండా..ఉదయం 9:45 నుండి సాయంత్రం 4.45 గంటల వరకు మార్చాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సవరించాలి. సవరించిన నగదు రహిత లావాదేవీల వేళలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండాలని యూనియన్ ప్రతిపాదించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ వర్కింగ్ ప్రతిపాదనలు గతేడాది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఆర్బీఐ అంగీకరిస్తుంది రెండు శనివారాల నష్టాన్ని భర్తీ చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తన అభిప్రాయాలను కోరినట్లు ఆయన చెప్పారు. పనిగంటలను ముప్పై నిమిషాలు పెంచవచ్చని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబీఏ), కేంద్రం, ఆర్బీఐ తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రతిపాదనల తిరస్కరణ కరోనా మహమ్మారి సమయంలో, కోవిడ్ -19 వైరస్ నుండి ఉద్యోగులను రక్షించడానికి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వారానికి ఐదు రోజుల పని చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రతిపాదనను ఐబీఏ తిరస్కరించింది. కాని ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును ప్రతిపాదించింది. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం సెలవులు ఉన్న విషయం తెలిసిందే. -
టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్, మార్పులు జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్‌ను రూపొందించింది. -
మహిళా కండక్టర్లకు మంచిరోజులు..
సాక్షి, కరీంనగర్ : ప్రజారవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు మంచి రోజులు వస్తున్నాయి. ఏళ్ల తరబడి డ్యూటీ వేళలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఇటీవల ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వర్తించేలా చూడాలని, ఆ తర్వాత వారు విధుల నుంచి దిగిపోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఆర్ఎంలకు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌లోని ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్ఎం జీవన్‌ప్రసాద్ మహిళా కండక్టర్ల వివరాలు, సంబంధిత విధుల సమయాలు అందించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. అధికారులు ఈ వివరాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాత్రి 10 గంటల వరకు మహిళా కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో వారు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మహిళా కార్మికుల్లో సానుకూల స్పందన వస్తోంది. ఆర్టీసీ అధికారుల కసరత్తు... ఇన్నాళ్లు బస్సుల వేళలపై అంతగా దృష్టిసారించని ఆర్టీసీ అధికారులు సీఎం ఉత్తర్వులతో మహిళా ఉద్యోగులను రాత్రి 8 గంటలకే ఇంటికి పంపేలా వేళల విషయంలో కసరత్తు ప్రారంభించారు. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయం, తిరిగి చేరుకునే సమయాన్ని (రన్నింగ్ టైం) డ్యూటీ చార్టులపై పక్కాగా నమోదు చేస్తున్నారు. బస్టాండ్ లేదా డిపో నుంచి నిర్ణీత గమ్యస్థానం చేరుకునే రూట్ సమయాన్ని కుదించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేయకుండా డిపోకు 20 కిలోమీటర్ల వ్యవధిలో డ్యూటీలు వేస్తే సమయపాలన సరిపోతుంది. రాత్రి 8 గంటల లోపు డ్యూటీ ముగించుకునే అవకాశం దొరుకుతుంది. ఈ మార్పులతో సిబ్బంది సకాలంలో విధులు ముగించుకుని త్వరగా ఇళ్లకు చేరుకునే ఆవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా హామీలకు ఎదురుచూపులు... సీఎం ఇచ్చిన మిగతా హామీలపై కూడా మహిళా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకోనేందుకు గది ఏర్పాటుపై కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పిల్లలకు బోధనా రుసుంలో రాయితీ, గృహ నిర్మాణ పథకం, ప్రసూతి సెలవులు, మూడు మాసాల శిశు సంరక్షణ సెలవులు తదితర వాటిపై మహిళా ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. రుణపడి ఉంటాం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరాలు సంతోషాన్ని కలిగించాయి. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకే ఇళ్లకు చేరుకోవాలని సీఎం హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడున్న డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. స్పెషల్ ఆఫ్ డ్యూటీకి 14 గంటల సమయం పడుతోంది. జిల్లాలో చాలా రూట్లు సరిగా లేవు. అందుకే సమయంతోపాటు కిలో మీటర్లు కూడా తగ్గించాలి. – పి.సుజాత, కండక్టర్, కరీంనగర్–1 డిపో రక్షణగా ఉంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు రక్షణగా ఉంటుంది. రాత్రిళ్లు 10 గంటల వరకు విధులు నిర్వర్తించే ఇంటికి వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది. 8 గంటలకే డ్యూటీలు దిగితే ఆ భయం ఉండదు. డిపోల్లో మరుగుదొడ్లను ఆధునికీకరించారు. బస్టాండ్లలోనూ మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి. మాకు ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. –సబితారాణి, కండక్టర్, కరీంనగర్–2 డిపో ఉత్తర్వుల అమలుకు చర్యలు ఆర్టీసీలో ఎప్పటిలాగే రూట్ వేళలు అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరూటులో ఇప్పటి వరకు రన్నింగ్ టైం కుదించలేదు. ఉత్తర్వుల మేరకు మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలలోపు ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి డిపోల్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రీజియన్ పరిధిలో మహిళ ఉద్యోగులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. –జీవన్‌ప్రసాద్, ఆర్ఎం, కరీంనగర్ డిపోల వారీగా మహిళా కండక్టర్లు డిపో మహిళా కండక్టర్లు కరీంనగర్–1 59 కరీంనగర్–2 60 హుజూరాబాద్ 57 గోదావరిఖని 65 జగిత్యాల 44 కోరుట్ల 15 మంథని 26 మెట్పల్లి 10 సిరిసిల్ల 29 వేములవాడ 22 మొత్తం 387 -
‘అంగన్వాడీ’ వేళల్లో మార్పు
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే ప్రొద్దుటూరు : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పని వేళలను మార్పు చేసింది. ఈ ప్రకారం నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పని చేయాలని ఆదే శాలు జారీ అయ్యాయి. జూన్ 12వ తేది వరకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. జిల్లాలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది చిన్నారులు, గర్భవతులు, బాలింతలు ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు రూరల్, ముద్దనూరు, పులివెందుల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టుల పరిధిలో అన్న అమృత హస్తం పథకం అమలవుతోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా వాతావరణంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. పలు చోట్ల 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పని వేళలను మార్పు చేశారు. ఉదయం 11 గంటల లోపే లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలని సూచించడంపై నిరసన వ్యక్తమవుతోంది. మే 1 నుంచి 15వ తేది వరకు కార్యకర్తలకు, 16 నుంచి 31 వరకు ఆయాలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ రాఘవరావు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు పని వేళల మార్పుపై సమాచారం అందించారు.