
వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' మాటలు, వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మాటలు మరువకముందే.. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ.. జాబ్ ఆఫర్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫుల్ టైమ్ జాబ్, నెలకు రూ. 40000 అని పేర్కొంది. అయితే ఉద్యోగి తప్పకుండా ఆఫీసు నుంచే పనిచేయాలి. వారానికి ఆరు రోజులు (ఆదివారం మినహా).. ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రావాలి, పని పూర్తయ్యే వరకు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.

భారతదేశంలో ఇలాంటి కంపెనీలు.. ఎందుకు ఇలాంటి నియమాలను బహిరంగంగా వెల్లడిస్తున్నాయో అర్థం కావడం లేదని కొందరు చెబుతున్నారు. కొన్ని కంపెనీలలో పని భారం ఎక్కువవుతుంది ఇంకొందరు చెబుతున్నారు. కార్మిక చట్టంలోని అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని, ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా? అని మరికొందరు చెప్పారు.
ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?
రూ. 40,000 జీతం తీసుకునేటప్పుడు.. 12 గంటలు పనిచేయొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ కంపెనీ అయిన నిజాయితీగా వెల్లడించింది, కొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరిన తరువాత ఎక్కువ పని చేయించుకుంటున్నాయని మరికొందరు చెప్పారు. భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి కంపెనీలు కూడా ఇలాంటి నిబంధలను పెడుతూ.. ఒత్తిడి పెంచుతున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment