వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు వారాంతపు సెలవులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదని, పని చేయకుండా ఖాళీగా ఉండడం తనకు నచ్చేది కాదని ఆయన తెలిపారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు.
పని కంటే జీవితం గొప్పదని, ఎంతో విలువైందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన పిల్లల వయసులో ఉన్నప్పుడు తనకు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందని బిల్‌గేట్స్ చెప్పారు. గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: అప్పు ప్రమాదఘంటికలివే..
ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment