billgates melinda foundation team
-
వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్
వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు వారాంతపు సెలవులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదని, పని చేయకుండా ఖాళీగా ఉండడం తనకు నచ్చేది కాదని ఆయన తెలిపారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. పని కంటే జీవితం గొప్పదని, ఎంతో విలువైందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన పిల్లల వయసులో ఉన్నప్పుడు తనకు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందని బిల్‌గేట్స్ చెప్పారు. గోల్‌కీపర్స్ ఈవెంట్లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదీ చదవండి: అప్పు ప్రమాదఘంటికలివే.. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే. -
ఆధార్ అనుసంధానం భేష్
కొవ్వలి (దెందులూరు) : ఆధార్ అనుసంధానం, ఆన్లైన్, ఈ–పోస్ అమలు స్ఫూర్తిదాయకమని బిల్‌గేట్స్ మెలిండా ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం ఆ సంస్థ బృంద సభ్యులు దెందులూరు మండలం కొవ్వలి, తణుకు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కొవ్వలిలో మొటపర్తి భవన్, ఆంధ్రాబ్యాంక్, పంచాయతీ కార్యాలయం, కో ఆపరేటివ్ సొసైటీ, రేషన్‌షాపులను టీమ్ సభ్యులు పవన్ భక్తి, డేనియర్ మైఖేల్ రాడ్ క్లిఫ్, డేవిడ్ జాసాన్, పార్కర్, శారా, ఇ హ్యాండ్రిక్స్, లిజ్ కిల్సన్, జర్మీ ప్లేస్ పెప్రో, కింబర్లీ లింగ్లీ, నిక్ యాగన్, సునీల్ రామన్ పరిశీలించారు. వారికి అదనపు సంయుక్త కలెక్టర్ షరీఫ్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించే స్థాయికి ఎదగాలన్నారు. దారిద్ర్యరేఖ దిగువున ఉన్న ప్రతి ఒక్కరూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ఆఫ్రికా, టాంజానియా, మలేషియా దేశాల్లో తమ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని, త్వరలో భారత్‌కు పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్టు చెప్పారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకట రమణ, ఐసీడీఎస్ పీడీ చంద్రశేఖరరావు, డీఎస్వో శివశంకర్‌రెడ్డి, అగ్రికల్చర్ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఫిషరీస్ డీడీ భాషా, తహసీల్దార్, ఎస్.సత్యనారాయణ, ఎంపీడీవో ఎంవీ అప్పారావు పాల్గొన్నారు.