ఆధార్ అనుసంధానం భేష్
ఆధార్ అనుసంధానం భేష్
Published Thu, Sep 29 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
కొవ్వలి (దెందులూరు) : ఆధార్ అనుసంధానం, ఆన్‌లైన్, ఈ–పోస్ అమలు స్ఫూర్తిదాయకమని బిల్‌గేట్స్ మెలిండా ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం ఆ సంస్థ బృంద సభ్యులు దెందులూరు మండలం కొవ్వలి, తణుకు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కొవ్వలిలో మొటపర్తి భవన్, ఆంధ్రాబ్యాంక్, పంచాయతీ కార్యాలయం, కో ఆపరేటివ్ సొసైటీ, రేషన్‌షాపులను టీమ్ సభ్యులు పవన్ భక్తి, డేనియర్ మైఖేల్ రాడ్ క్లిఫ్, డేవిడ్ జాసాన్, పార్కర్, శారా, ఇ హ్యాండ్రిక్స్, లిజ్ కిల్సన్, జర్మీ ప్లేస్ పెప్రో, కింబర్లీ లింగ్‌లీ, నిక్ యాగన్, సునీల్ రామన్ పరిశీలించారు. వారికి అదనపు సంయుక్త కలెక్టర్ షరీఫ్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించే స్థాయికి ఎదగాలన్నారు. దారిద్ర్యరేఖ దిగువున ఉన్న ప్రతి ఒక్కరూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ఆఫ్రికా, టాంజానియా, మలేషియా దేశాల్లో తమ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని, త్వరలో భారత్‌కు పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్టు చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకట రమణ, ఐసీడీఎస్ పీడీ చంద్రశేఖరరావు, డీఎస్‌వో శివశంకర్‌రెడ్డి, అగ్రికల్చర్ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఫిషరీస్ డీడీ భాషా, తహసీల్దార్, ఎస్.సత్యనారాయణ, ఎంపీడీవో ఎంవీ అప్పారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement