ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది. ఇది ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకతను రేకెత్తించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులపై ఉంటుందని అన్నారు.
కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్‌టైమ్‌తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.
ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మకశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
Comments
Please login to add a commentAdd a comment