ఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి.. అంటూ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పిన లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు దీనిని ఖండిస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇప్పుడు తాజాగా భారత్‌పే సీఈఓ 'నలిన్ నేగి' (Nalin Negi) చేరారు.
ఫిన్‌టెక్ సంస్థ పని చేసే ప్రదేశాలలో ఎక్కువ గంటలు ఉండదని, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఫలితాలు.. ఉత్పాదకతలో నాణ్యత మాత్రమే ముఖ్యమని నలిన్ నేగి అన్నారు. వారానికి 90 గంటలు పనిచేయడం అనేది చాలా కష్టం. ఇది ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల సరైన ఉత్పాదక ఉండదు. కాబట్టి ఎన్ని గంటలు పనిచేశామనేది కాకుండా.. నాణ్యమైన ఉత్పాదకత ఎంత ఉంది అని చూడటం ముఖ్యమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
భారత్‌పే చీఫ్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ ఉద్యోగాలను ఇవ్వడం మాత్రమే కాదు, ఉద్యోగులకు మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలి అని అన్నారు. ప్రస్తుతం ఇదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు. ఒక ఉద్యోగి సంతోషంగా పనిచేస్తేనే.. సంస్థకు లాభం ఉంటుంది. కాబట్టి వారానికి 90 గంటల పనిపై నాకు నమ్మకం లేదు అని అన్నారు.
వారానికి 90 గంటల పని చేయాలనే వ్యాఖ్యలపై.. 'ఆనంద్ మహీంద్రా', సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' మొదలైనవారు కూడా స్పందించారు.
ఆనంద్ మహీంద్రా
ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
అదార్ పూనావల్లా
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment