ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే అంటూ వెల్లడించారు.
గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని, ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు ఎక్కువపని చేశారని వెల్లడించారు.
నారాయణ మూర్తి పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు అతి తక్కువ కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కొందరు ఈయన వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరికొందరు గట్టిగా విమర్శించారు. అటు ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి, కొంతమంది ప్రముఖుల వరకు చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు.
పనిగంటలు ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న వేళ మనుషులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా నిర్వహించిన ‘వాట్ నౌ’ షోలో వెల్లడించారు.
రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో మనుషులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని చెబుతూ.. కొత్త టెక్నాలజీ మనుషుల ఆయుష్షు, ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
పనిగంటలు ఉద్దేశించి ఇద్దరు పారిశ్రామిక వేత్తలు చేసిన వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ చిన్న వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం నవ్వు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment