Saudi World's Most Futuristic Hotel Sheybarah Resort Viral Video - Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!

Published Wed, Aug 16 2023 12:22 PM | Last Updated on Wed, Aug 16 2023 1:09 PM

Saudi worlds most futuristic hotel Sheybarah Resort viral video - Sakshi

Sheybarah Resort దుబాయ్ మరో అద్భుత ఆవిష్కారానికి  నాంది పలుకుతోంది. సౌదీ అరేబియాలోని  మునుపెన్నడూ చూడని విధంగా  ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌ క్లాస్‌ ఫెసిలిటీస్‌తో  ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో  ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన  వీడియో క్లిప్‌ను సౌదీకి  చెందిన  రెడ్ సీ గ్లోబల్ (RSG) సంస్థ  విడుదల చేసింది. సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి   ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. 

హైపర్-లగ్జరీ రిసార్ట్‌ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది. ఆధునిక టచ్‌తో పాటు, రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్‌తో  విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. 

ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా  LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది. "ఏరియల్ అకామడేషన్ పాడ్స్" అని పిలిచే  ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట.పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్‌ను ఉపయోగిస్తోంది. ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతాయి. అంతేకాదు, షేబరా హోటల్ 73  విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్‌లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలుచూస్తే మతిపోవాల్సిందే. 

ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల  స్టెయిన్‌లెస్-స్టీల్ ఆర్బ్‌లతో చాలాయూనీక్‌గా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్‌ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్‌ ప్యారడైజ్‌ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, ఫోటోలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అడ్రస్ బీచ్ రిసార్ట్, ఆఫీస్ ఆఫ్ ది ఫ్యూచర్, సిటీ వాక్, మరిన్నింటితో సహా దుబాయ్‌లోని కొన్ని ఐకానిక్ ప్రాజెక్ట్‌లను అందించిన ఘనత కిల్లా డిజైన్  సొంతం.

/>  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement