Cristiano Ronaldo booked after 'headlock' on opposition player in Saudi Pro League - Sakshi
Sakshi News home page

#CristianoRonaldo: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్‌ అయిపోతున్నాడు!

Published Wed, Apr 19 2023 5:43 PM | Last Updated on Wed, Apr 19 2023 6:32 PM

Cristiano Ronaldo Booked After Headlock-Opposition player Saudi League - Sakshi

క్రిస్టియానో రొనాల్డోకు ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యన రొనాల్డో ప్రవర్తన శ్రుతి మించిపోతుంది. మ్యాచ్‌ ఓటములను జీర్ణించుకోలేక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నాడు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించి హీరో అనిపించుకున్న రొనాల్డో విలన్‌గా మారిపోతున్నాడు. తన చర్యతో అభిమానులు షాక్‌ తింటున్నారు.

తాజాగా ఆల్‌-నసర్‌ కెప్టెన్‌ మ్యాచ్‌ ఓడిపోయామన్న కోపంలో ప్రత్యర్థి ఆటగాడి తలను నేలకేసి కొట్టడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. సౌదీ ప్రో లీగ్‌లో భాగంగా మంగళవారం అర్థరాత్రి అల్‌-హిలాల్‌, అల్‌-నసర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో రొనాల్డో సేన 0-2తో అల్‌-హిలాల్‌ చేతిలో ఓటమి పాలయ్యింది. 

ఈ విషయం పక్కనబెడితే.. ఆట 56వ నిమిషంలో అల్‌-హిలాల్‌ ఆటగాడు గుస్టావోపైకి దూసుకొచ్చిన రొనాల్డో అతని తలను తన చేత్తో అదిమి పట్టుకొని ఒక్కసారిగా కిందకు పడేశాడు. ఈ క్రమంలో గుస్టావో తల గ్రౌండ్‌కు కాస్త బలంగానే తాకింది. ఈ చర్యతో స్టాండ్స్‌లోని ప్రేక్షకులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా షాక్‌ తిన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరిచినందుకు గానూ రిఫరీ రొనాల్డోకు ఎల్గోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement