పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి సహనం కోల్పోయాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడంలో విఫలమైన రొనాల్డో ఈసారి మరింత కోపం తెచ్చుకున్నాడు. తన కోపం ఎవరిపై చూపించాలో తెలియక ఫుట్‌బాల్‌పై చూపించడం.. అది చూసిన రిఫరీ రొనాల్డోకు ఎల్లో కార్డు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి.
విషయంలోకి వెళితే.. సౌదీ అరేబియన్ ప్రో-లీగ్‌లో భాగంగా అల్-నసర్, అభాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 3-1 తేడాతో రొనాల్డో సేన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టేలేకపోయాడు. రొనాల్డో చేతిలో బంతి ఉండగా ఫస్ట్ హాఫ్ ముగిసినట్లు రిఫరీ విజిల్ వేశాడు. అప్పటికే గోల్ కొట్టలేదన్న కోపంలో ఉన్న రొనాల్డో తన వద్ద ఉన్న బంతిని కాలితో బలంగా తన్నాడు.
అంతే ఒక్క ఉదుటన బంతి 60 మీటర్ల దూరంలో పడింది. రొనాల్డో చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన రిఫరీ రొనాల్డోకు ఎల్లోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రొనాల్డో ఇలా చేయడం ఇది తొలిసారి మాత్రం కాదు.
ఇంతకముందు అల్ ఇత్తిహాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓడిపోయామన్న కోపంతో మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వాటర్ బాటిల్‌ను తన్నడం.. అది ఒక అభిమానికి తగలడం.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగాయి. ఇక మార్చి 18(శనివారం) అల్-నసర్.. అభాతో మరో మ్యాచ్ ఆడనుంది.
Ronaldo received a yellow card for kicking the ball away in frustration after the referee whistled the end of the first half. pic.twitter.com/xR92h1FmEm
— ESPN FC (@ESPNFC) March 14, 2023
చదవండి: చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment