Omicron Alert: తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్- 19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు పలుఆంక్షలు విధించినప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు తెల్పింది. దీంతో రెస్టారెంట్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయి. ఐతే టేక్‌అవే, ఫుడ్ డెలివరీ పద్ధతుల్లో మాత్రమే వాటి కార్యకలాపాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది.
రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్లు, మాల్స్‌తోపాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో జనవరి 9 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఐతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకుగానూ తమిళనాడు ప్రభుత్వం 75% ఆక్యుపెన్సీతో ప్రయాణాలకు అనుమతిచ్చింది. అంతేకాకుండా జనవరి 14 - 18 వరకు రద్దీని నివారించేందుకు అన్ని ప్రార్ధనా స్థలాలను ప్రభుత్వం మూసివేసింది. ఐతే ఆదివారం లాక్‌డౌన్ సమయాల్లో.. విమానాలతో సహా ఇతర పబ్లిక్ రవాణా సేవలు తప్ప, మిగతా అంతటా పూర్తి స్థాయిలో లాక్‌డైన్ అమల్లో ఉంటుంది. వివాహాలు, వేడుకలకు 100 మందికి మించి పాల్గొనరాదు. 1 నుంచి 9 తరగతుల పాఠశాలల మూత, పరిమిత సీటింగ్ కెపాసిటీతో కోచింగ్ సెంటర్లు, పబ్లిక్ రవాణా సేవలపై పరిమితులు జనవరి 31 వరకు పొడిగింపబడ్డాయి. కాగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
రోజు వారి కరోనా కేసుల్లో శనివారం ఒక్కరోజే 23,978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 23 వేల మార్కును వరుసగా రెండో రోజు కూడా దాటాయి. గడచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందగా, 11 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,007 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి ఆదివారం లాక్‌డైన్ అమల్లో కొచ్చింది. నేడు రెండో ఆదివారం కావడంతో అక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా గోచరిస్తున్నాయి.
చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
Comments
Please login to add a commentAdd a comment