Night Curfew
-
రాత్రి కర్ఫ్యూ తొలగింపు
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను తొలగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగిస్తూ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫీవర్ సర్వే కొనసాగించాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షల ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగించాలన్నారు. కోవిడ్, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిపోయిన నియామకాలను చేపట్టి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆస్పత్రుల్లో పరిపాలన, చికిత్స బాధ్యతలను వేరు చేసి నిపుణులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషలిస్టు వైద్యులకు మూలవేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్), ఎం.రవిచంద్ర, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో గణనీయంగా తగ్గుముఖం ► రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి తగ్గుముఖం. ► గత వారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్ కేసులుండగా ఇప్పుడు 18,929కి తగ్గిన కేసులు. ► ఆస్పత్రిలో చేరిన కేసులు 794 కాగా ఐసీయూలో చేరి దాదాపుగా కోలుకుంటున్న 130 మంది. ► 746 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్స. ► గత సమావేశం నాటికి పాజిటివిటీ రేటు 17.07 శాతం కాగా ప్రస్తుతం 3.29 శాతానికి క్షీణత ► 9,581 సచివాలయాల పరిధిలో కోవిడ్ కేసులు లేవు. టీనేజర్లకు వంద శాతం తొలి డోసు ► రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్. ► తొలిడోసు పూర్తై రెండోది తీసుకోవాల్సిన వారు 39,04,927 ► మొత్తంగా వినియోగించిన డోసులు 8,32,55,831. n 45 ఏళ్లు పైబడ్డ వారిలో 96.7 శాతం మందికి రెండు డోసుల టీకాలు పూర్తి ► 18–44 వయసు వారిలో 90.07 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు. ► ప్రికాషన్ డోస్‌ల లక్ష్యం 15,02,841 కాగా 11,84,608 మంది టీకాలు. ► 15 – 18 వయసు వారిలో వంద శాతం మేర 24.41 లక్షల మందికి మొదటి డోసు పూర్తి. 12.48 లక్షల మందికి రెండో డోసు పూర్తి. -
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. కరోనా మూడో దశ వ్యాప్తి కట్టడికి గత నెల 18 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగించారు. 14వ తేదీ వరకు రాత్రి 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకోవాలని సింఘాల్ ఆదేశించారు. (చదవండి: చిక్కీ, గుడ్ల సరఫరాపై టీడీపీ అవాకులు చెవాకులు) -
రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం
సాక్షి, చెన్నై: కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గురువారం ప్రకటించారు. అయితే, ఎల్కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు. రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ వంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈనేపథ్యంలో కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిబంధనలను సడలించారు. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’) -
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆంక్షలు షురూ..! అమలులోకి వచ్చే నిబంధనలు ఇవే..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో మంగళవారం (18వ తేదీ) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. వీరికి మినహాయింపు.. కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది. అమలులోకి వచ్చే ఇతర నిబంధనలు.. ► ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు. ► వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయానికొస్తే బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి. ► సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్ ధరించాలి. ► ఇక ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ధరించాలి. ► వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. ► మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు ఉంటాయి. ► మార్కెట్ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. ► దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. భక్తులు భౌతిక దూరం. మాస్క్‌లు ధరించటం తదితర జాగ్రత్తలు పాటించాలి. ► జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు ఉంటాయి. -
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
-
Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం
సాక్షి, శివాజీనగర (బెంగళూరు): కరోనా వారాంతపు కర్ఫ్యూ రెండో రోజు కూడా రాష్ట్రంతో పాటు బెంగళూరులో నిశ్శబ్దం నెలకొంది. మహమ్మారి నియంత్రణ కోసం గత వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేయడం తెలిసిందే. శని, ఆదివారాలు సంక్రాంతి, కనుమ సంబరాల సందడి తక్కువగానే కనిపించింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు మూతపడడంతో నగరాలు బోసిపోయాయి. కూరగాయలు, ఔషధాలు, పాలతో పాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు మాత్రం తక్కువగా కేఎస్ఆర్టీసీ బస్సులు సంచరించాయి. బెంగళూరు బస్టాండులో పెద్దసంఖ్యలో బస్సులను నిలిపివేశారు. బెంగళూరులో జనసందడి ప్రాంతాలైన కే.ఆర్.మార్కెట్, శివాజీనగర, చిక్కపేట, ఎన్పీ రోడ్డు, జయనగరతో పాటు పలు మార్కెట్లు బంద్ అయ్యాయి. చదవండి: (Hyderabad-Lockdown: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి) -
హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ..!
-
Omicron Alert: ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్!
Omicron Alert: తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్- 19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు పలుఆంక్షలు విధించినప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు తెల్పింది. దీంతో రెస్టారెంట్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయి. ఐతే టేక్అవే, ఫుడ్ డెలివరీ పద్ధతుల్లో మాత్రమే వాటి కార్యకలాపాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్లు, మాల్స్‌తోపాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో జనవరి 9 నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఐతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత ఊర్లకు వెళ్లేందుకుగానూ తమిళనాడు ప్రభుత్వం 75% ఆక్యుపెన్సీతో ప్రయాణాలకు అనుమతిచ్చింది. అంతేకాకుండా జనవరి 14 - 18 వరకు రద్దీని నివారించేందుకు అన్ని ప్రార్ధనా స్థలాలను ప్రభుత్వం మూసివేసింది. ఐతే ఆదివారం లాక్డౌన్ సమయాల్లో.. విమానాలతో సహా ఇతర పబ్లిక్ రవాణా సేవలు తప్ప, మిగతా అంతటా పూర్తి స్థాయిలో లాక్‌డైన్ అమల్లో ఉంటుంది. వివాహాలు, వేడుకలకు 100 మందికి మించి పాల్గొనరాదు. 1 నుంచి 9 తరగతుల పాఠశాలల మూత, పరిమిత సీటింగ్ కెపాసిటీతో కోచింగ్ సెంటర్లు, పబ్లిక్ రవాణా సేవలపై పరిమితులు జనవరి 31 వరకు పొడిగింపబడ్డాయి. కాగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రోజు వారి కరోనా కేసుల్లో శనివారం ఒక్కరోజే 23,978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 23 వేల మార్కును వరుసగా రెండో రోజు కూడా దాటాయి. గడచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందగా, 11 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,31,007 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి ఆదివారం లాక్‌డైన్ అమల్లో కొచ్చింది. నేడు రెండో ఆదివారం కావడంతో అక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా గోచరిస్తున్నాయి. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు! -
18 నుంచి రాత్రి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 18 నుంచి 31 వరకూ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, మీడియా, పెట్రోల్ బంకుల కార్యకలాపాలకు.. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ఇతర అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ, ఇతర నిబంధనలను అమలుచేయడంతోపాటు, పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఆ నిబంధనలు.. ► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. లేనిపక్షంలో రూ.100 జరిమానా. ► మాస్క్‌లేని వారిని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లోకి అనుమతిస్తే యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమాన. ► నిబంధనలు అతిక్రమించినట్లయితే స్థానిక పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రతను బట్టి ఒకట్రెండు రోజులు మూసివేత. ► పెళ్లిళ్లు, శుభకార్యాలు, సామాజిక కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌లో అయితే 100 మందికి మించకూడదు. వారందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం నిబంధన పాటించాలి. ► సినిమా హాళ్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సీటు విడిచి సీటులో ప్రేక్షకులు కూర్చోవాలి. ► ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలి. 8 దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులు మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి. ► ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2004, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆళ్ల నాని ఇక రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలును ఈనెల 18కు వాయిదా వేసిందన్నారు. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్దఎత్తున పల్లెలకు ప్రజలు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మార్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
ఏపీలో సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు
-
ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు...
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చదవండి: ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. -
వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ ఉద్ధృతి పెరడగంతో రాష్ట్రాలన్నీ అలెర్ట్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ దిశగా ఆంక్షలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింత దారుణంగా ఉంది. అయితే పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. Keeping #COVID19 in mind, Weekend Curfew shall be imposed in Delhi tomorrow onwards. If you have any questions related to it, #DelhiPolice will answer them. Please drop your queries in comments or tweet it us using #CurfewFAQ@CPDelhi#DelhiPoliceCares pic.twitter.com/CySSo1tipu — #DelhiPolice (@DelhiPolice) January 6, 2022 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయితే వీకెండ్ కర్ఫ్యూపై ప్రజల మెదల్లో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి. ఈ క్రమంలో కర్ఫ్యూపై ఏమైనా సందేహాలుంటే సోషల్ మీడిమా వేదికగా తమను ప్రశ్నించవచ్చని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వింత సందేహం వ్యక్తం చేశాడు. ‘వీకెండ్లో మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ క్రికెట్ ఆడొచ్చా’ అని పునీత్ శర్మ అనే ట్విట ర్యూజర్ పోలీసులను ప్రశ్నించాడు. చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు That’s a ‘Silly Point’, Sir. It is time to take ‘Extra Cover’. Also, #DelhiPolice is good at ‘Catching’. https://t.co/tTPyrt4F5H — #DelhiPolice (@DelhiPolice) January 7, 2022 నెటిజన్ విచిత్ర ప్రశ్నకు పోలీసులు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా క్రికెట్ భాషలోనే పంచ్‌లతో రిప్లై ఇచ్చారు. ‘అది 'సిల్లీ పాయింట్' సార్. ఇప్పుడు 'ఎక్స్ట్రా కవర్' అవసరం. అంతే కాదు. ఢిల్లీ పోలీసులు బాగా 'క్యాచింగ్' (పట్టుకోగలరు) చెయ్యగలరు’ అని బదులిచ్చారు. పునీత్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో పోలీసుల ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్.. రిపోర్టర్ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం -
ఏపీలో నైట్ కర్ఫ్యూ
-
కేసుల పెరుగుదలతో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలుచేయాలని సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలన్నారు. థియేటర్లలో సీటు మార్చి సీటు విధానాన్ని ప్రవేశపెట్టాలని.. ప్రేక్షకులకు మాస్క్ తప్పనిసరి చేయాలని ఆయన స్పష్టంచేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అందరూ భౌతిక దూరం పాటించేలా.. మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న విషయాన్ని, కోవిడ్ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు ఆదేశాలు జారీచేశారు. అవి.. సమర్థవంతంగా కరోనా నివారణ ► అధికార యంత్రాంగం కోవిడ్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలుచేయాలి. ► భౌతిక దూరం పాటించని.. మాస్క్‌లు ధరించని పక్షంలో కచి్చతంగా జరిమానాలు కొనసాగించాలి. ► దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలి. ► బస్సు ప్రయాణికులు కూడా విధిగా మాస్క్ ధరించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకూడదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీచేయనుంది. నియోజవర్గానికి ఓ కోవిడ్ కేర్ సెంటర్ ఇక 104 కాల్ సెంటర్‌ను బలంగా ఉంచాలని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎవరు కాల్ చేసినా వెంటనే స్పందించేలా ఉండాలని.. అలాగే, కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధంచేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలని ముఖ్యమం‘త్రి సూచించారు. హోం కిట్‌లో మార్పులు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో హోం కిట్‌లో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య నిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలన్నారు. అంతేకాక.. చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపైనా సమీక్షించారు. అవసరమైన మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. -
సంపూర్ణ లాక్డౌన్ అమలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసుయంత్రాంగం ప్రకటించింది. దీంతో శనివారం చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేలకు అటుఇటుగా.. కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఆదివారం లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు. దీంతో శనివారం మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లలో రద్దీ నెలకొంది. లక్ష మందికి రెండో డోస్... 18వ విడతగా రాష్ట్రంలో శనివారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 వేల శిబిరాల్లో లక్షలాది మందికి రెండో డోస్ టీకా వేశారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్లలోపు బాల, బాలికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక, చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఫీవర్ టెస్టులు విస్తృతం చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త ఏర్పాట్లు జరిగాయి. చెన్నైలో మాస్క్ ధరించని 7,616 మందికి జరిమానా విధించి రూ. 15 లక్షలు జరిమానా వసూలు చేశారు. తమిళనాడులో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్డౌన్ అవసరం రాదని.. కరోనా ప్రజల జీవితంలో కలిసి పయనిస్తుందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక, చెన్నైలో కరోనా కట్టడి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేయడం కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే చెన్నైలో ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళల్లో రెండు డోస్‌ల టీకా వేయించుకున్న వారినే సోమవారం నుంచి అనుమతించనున్నారు. చదవండి: కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు -
తమిళనాడు పాక్షిక లాక్‌డౌన్‌తో ఆర్టీసీ అప్రమత్తం
సాక్షి, అమరావతి: తమిళనాడులో రాత్రివేళ లాక్డౌన్ విధించడంతో ఏపీఎస్ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చినందున బస్ సర్వీసుల విషయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం పలు సూచనలు చేశారు. తమిళనాడు వైపు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ చేయాలని, సిబ్బంది రెండు సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. తమిళనాడులో లాక్డౌన్ అమలులోకి వచ్చే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఏపీ బోర్డర్‌కు చేరుకోవాలని సూచించారు. -
సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. వారంలో ఆ రోజు పూర్తిస్థాయి లాక్డౌన్
చెన్నై: థర్డ్‌వేవ్ విస్తృతం అవుతోన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో జనవరి 6 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఆదివారం రోజున మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్ ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని బస్సులు, రైళ్లు, మెట్రోలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే పొంగల్ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలు మూసివేయనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు 121కి చేరుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే 2,731 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం) -
నాలుగో వేవ్ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత
జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మొదటిసారిగా బయటపడిన దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగించింది. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు గురువారం అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది. కరోనా నాలుగో వేవ్ తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 35 లక్షల మంది కరోనా బారిన పడగా 90వేల మంది చనిపోయారు. చదవండి: (న్యూ ఇయర్ ఉత్సాహంపై ఒమిక్రాన్ నీడ) -
Omicron: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత! ఎందుకో తెలుసా..
కేప్ టౌన్: గడచిన ఏడు రోజులతో పోలిస్తే గత వారంలో దాదాపు 30 శాతం ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు తగ్గాయని దక్షిణాఫ్రికా తాజాగా వెల్లడించింది. ఒమిక్రాన్‌కు బయపడి యూరఫ్, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిస్తున్న నేపధ్యంలో నాలుగో వేవ్ తగ్గుముఖం పట్టడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యు ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. మరణాలు కూడా పెద్దగా నమోదు కాలేదని, వ్యాక్సినేషన్ పెద్ద సంఖ్యలో చేపట్టడం మూలంగా నాలుగో వేవ్ నుంచి బయటపడ్డామని తాజా ఆరోగ్య డేటా నేపథ్యంలో ఆంక్షలు సడలించాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణాఫ్రికా ఈ మేరకు మీడియాకు తెల్పింది. సార్స్- కోవ్ 2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ నవంబర్‌లో మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. చదవండి: కొత్తొక వింత.. పాతొక రోత! డిసెంబరు 25 నాటికి నమోదైన కేసులతో పోల్చితే, అంతకు ముందు వారాల్లో దాదాపు 1,27,753 కేసులు వచ్చాయని, ఆ సంఖ్య 29.7% తగ్గిందని ప్రభుత్వం తెల్పింది. సడలించిన ఆంక్షల మేరకు వెయ్యి మందితో ఇండోర్ మీటింగ్‌లు, రెండు వేల మంది సామర్ధ్యంతో ఔట్‌డోర్ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. అలాగే లైసెన్సులున్న మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత కూడా తెరచుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని సూచించింది. కాగా గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ 100కి పైగా దేశాలకు వ్యాపించిందని, వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులతో పాటు కరోనా సోకిన వారిలో కూడా కొత్త వేరియంట్ వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చదవండి: డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో.. -
Roundup-2021: కరోనా కాటేసినా కోలుకున్న టాలీవుడ్.. హిట్ మూవీస్ ఇవే
గత ఏడాది 65 చిత్రాలతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది స్ట్రయిట్, డబ్బింగ్‌తో కలిపి దాదాపు 225 చిత్రాలతో ముగుస్తోంది. ఓటీటీ, కరోనా భయం కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా అనే సందేహాల మధ్య 2021 ఆరంభమైంది. అయితే వెండితెర అనుభూతిని పొందాలని కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. 50 శాతం సీటింగ్... నైట్ కర్ఫ్యూల ప్రభావం వసూళ్లపై పడినా ఆ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని బ్లాక్బస్టర్లు ఇండస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టాయి. నూతనోత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేలా చేశాయి. 2021 రౌండప్ చూద్దాం. 2021 జనవరి 1న నాని ‘వి’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా..’, ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన ‘డర్టీహరి’, (2020లో ఇవి ఓటీటీలో విడుదలయ్యాయి) థియేటర్స్‌లోకి వచ్చాయి. లాక్డౌన్ నుంచి తేరుకుని అప్పుడప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో అసలు సిసలైన సందడి మొదలైంది మాత్రం సంక్రాంతి పండక్కే. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతికి విడుదలయ్యాయి. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే ఈ సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్’ బాక్సాఫీసు దుమ్ము దులిపింది. ఆ తర్వాతి నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిల తొలి చిత్రం ‘ఉప్పెన’ ఘనవిజయం అందుకుంది. అలాగే ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ కూడా బాక్సాఫీస్ దగ్గర భేష్ అనిపించుకుంది. మార్చిలో వచ్చిన 20 చిత్రాల్లో శర్వానంద్ ‘శ్రీకారం’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, ఆది సాయికుమార్ ‘శశి’, నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’, శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ వంటివి ఉన్నాయి. కాగా చిన్న చిత్రాల్లో ఘనవిజయం సాధించిన చిత్రంగా ‘జాతి రత్నాలు’ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. సమ్మర్ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్. కానీ ఈ సీజన్ కరోనా భయంతో స్టార్ట్ కావడంతో థియేటర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో గుర్తుంచుకోదగినవి నాగార్జున ‘వైల్డ్ డాగ్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. ‘వైల్డ్ డాగ్’ ఫర్వాలేదనిపించుకుంది. ‘వకీల్ సాబ్’ మంచి వసూళ్లు రాబట్టాడు. కాగా, కరోనా విజృంభణతో మే, జూన్ నెలల్లో థియేటర్లకు తాళం పడింది. బ్రేక్ తర్వాత: లాక్ డౌన్ తర్వాత జూలై చివర్లో తెర సందడి ఆరంభమైంది. సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజా సజ్జా ‘ఇష్క్’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాతి నెలలో వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, విశ్వక్ సేన్ ‘పాగల్’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ వంటివి ఆదరణ పొందాయి. సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫర్వాలేదనిపించుకుంది. బాక్సాఫీస్ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో గోపీచంద్ ‘సీటీమార్’ మోత బలంగా వినిపించింది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే ఉత్సాహాన్ని అక్టోబరులో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, రోషన్ ‘పెళ్లి సందడి’ కొనసాగించాయి. నవంబరులో దాదాపు 23 చిత్రాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక డిసెంబరు ఆరంభమే ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీసును ఓ మోత మోగించారు బాలకృష్ణ. ఆ సక్సెస్ ఊపును అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘శ్యామ్ సింగరాయ్’ కొనసాగించాయి. ఈ నెలాఖర్లో అరడజనకు పైగా చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో రానా ‘1945’, శ్రీ విష్ణు ‘అర్జుణ ఫల్గుణ’, కీర్తీ సురేష్ ‘గుడ్‌లుక్ సఖి’ ప్రధానమైనవి. కానీ కొన్ని వాయిదా పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ బొమ్మ.. ఈ ఏడాది రిలీజైన 225 చిత్రాల్లో అనువాద చిత్రాలు 50 వరకూ ఉన్నాయి. ఈ డబ్బింగ్ బొమ్మల్లో హీరో విజయ్ ‘మాస్టర్’ ఫర్వాలేదనిపించుకుంది. అలాగే దర్శన్ ‘రాబర్ట్’, కార్తీ ‘సుల్తాన్’ , ఏఆర్ రెహమాన్ నిర్మించిన ‘99 సాంగ్స్’, సిద్ధార్థ్ ‘ఒరేయ్...బామ్మర్ది’, విజయ్ సేతుపతి ‘లాభం’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ విడుదలయ్యాయి. అయితే కంగనా రనౌత్ ‘తలైవి’, శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’లు ఆకట్టుకోగలిగాయి. పెద్ద చిత్రాల్లో రజనీకాంత్ ‘పెద్దన్న’, శివరాజ్‌కుమార్ ‘జె భజరంగీ’, మోహన్‌లాల్ ‘మరక్కర్’ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. హాలీవుడ్ తెలుగు అనువాదాల్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్’, ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ సూపర్ కలెక్షన్స్‌ను సాధించాయి. ఇంకా ‘డోంట్ బ్రీత్’, ‘జేమ్స్ బాండ్’ (నో టైమ్ టు డై), ‘ది కంజ్యూరింగ్’, ‘వెనోమ్, ‘రెసిడెంట్ ఈవిల్’ వంటి సిరీస్‌ల్లోని తాజా చిత్రాలను ఇంగ్లిష్ మూవీ లవర్స్ చూశారు. నెట్టింట్లోకి.. కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీలకు వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ప్రధానంగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే. వెంకటేశ్ ‘నారప్ప’, ‘దృశ్యం 2’, తెలుగులోకి అనువాదమైన సూర్య ‘జై భీమ్’ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫర్వాలేదనిపించుకుంది. చిన్నవాటిలో ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ‘సినిమా బండి’లకు ఆదరణ లభించింది. నాని ‘టక్ జగదీష్’, రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’, శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’, సత్య ‘వివాహభోజనంబు’, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిల ‘అన్‌హార్డ్’, నవీన్‌చంద్ర ‘సూపర్ ఓవర్’, ‘చిల్ బ్రో’, సముద్రఖని ‘ఆకాశవాణి’, కార్తీక్‌రత్నం ‘అర్ధ శతాబ్దం’, రామ్స్ ‘పచ్చీస్’, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య చేసిన ‘క్యాబ్ స్టోరీస్’ వంటివి నెట్టింట్లోకి వచ్చాయి. -
2022 ప్రారంభ వేడుక... ఇంట్లోనే న్యూ ఇయర్ ఇలా..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఎందుకు అన్నారో గాని ఈ కాలంలో ఆ మాట పదేపదే వల్లె వేసుకోవాల్సి వస్తోంది. గుడి కన్నా ఇల్లు పదిలం అని కూడా అనుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు మనం ఉంటున్న ఇంటివైపే కన్నెత్తి కొత్తగా చూడాలి. కొత్తగా అలంకరించుకోవాలి. కొత్తగా కొత్త సంవత్సరానికి ఇంట్లో ఉంటూ ఆహ్వానం పలకాలి. ఎలా చేస్తే బాగుంటుంది? మళ్లీ కొత్త వేరియంట్ అంటున్నారు. బయటకు వెళ్లొద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. పార్టీలను అవాయిడ్ చేయమంటున్నారు. కొన్నిచోట్ల డిసెంబర్ 31న నైట్ కర్ఫ్యూలు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్నేల? న్యూ ఇయర్ పార్టీని ఇంట్లోనే ఉండి చేసుకోవడం మేలని నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు, హితవరులు హితవు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్‌కి ఏ గోవాకో, కేరళకో వెళ్లడం ఆనవాయితీ. ఈసారి మానేస్తే ఏం పోతుంది? లేదంటే కారులో బయలుదేరి సొంత ఊరుకు వెళ్లడం పరిపాటి. వద్దు అనుకోవడం మంచిదే కదా. సిటీలోని ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకొని ఇండియన్ ఐడల్ కొత్త సింగర్స్ పాడే పాటలకు నాలుగు డాన్స్‌లు చేయాలని కోరిక ఉంటుంది. ఈసారి నో అనుకుంటే సరిపోదా? ‘జాన్ హైతో జహా హై’ అని సామెత. అంటే ‘ప్రాణాలు ఉంటే ప్రపంచం’ ఉంటుంది అని అర్థం. ప్రాణాలు ఉండాలేగాని భవిష్యత్తులో బోలెడన్ని న్యూ ఇయర్ పార్టీలు బయట చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వెల్కమింగ్ పార్టీకి బెస్ట్ ప్లేస్ ఇల్లే అనుకుందాం ఈసారి. సరిగ్గా ట్రై చేస్తే ఇంట్లోనే మంచి పార్టీ చేసుకోవచ్చు. కొత్త హుషారు తెచ్చుకోవచ్చు. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పొచ్చు. ఏం చేద్దాం. ఒకటి రెండు కుటుంబాల్ని ఎంచుకోండి బయట పార్టీ వద్దన్నారు కానీ ఇంట్లో స్నేహితులతో వద్దు అనుకోలేదు. ఏ ఇంటి పార్టీ అయినా మనకు మనం చేసుకుంటే అంత బాగుండదు. మీకు బాగా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను పిల్చుకోండి. చాలా రోజులుగా రాని కొడుకు వచ్చినా కూతురు వచ్చినా మరీ మంచిది. బంధువుల కన్నా స్నేహితుల వల్లే సరదా అనుకున్నా సరే. ఆ గెస్ట్‌లను పిలవడం పూర్తి కాగానే పార్టీ పనుల్లో దిగండి. లైట్లు వెలిగించండి లైట్లు కొత్త వెలుతురును కాంతిని తెస్తాయి. బయట రెడిమేడ్ సీరియల్ సెట్లు దొరుకుతాయి. అవి తెచ్చి ఇంటి గేటు కు, కాంపౌండ్ వాల్‌కు, ముంగిలిలో ఉన్న చెట్లకు, మొక్కలకు, మిద్దెకు వేలాడ దీసి వెలిగించండి. కొనలేకపోతే ఏ ఎలక్ట్రీషియన్‌కు చెప్పినా ఒక రాత్రికి ఇంతని అద్దె తీసుకొని వేసి పోతాడు. అవి ఒక్కసారి మిలమిలమని వెలగడం ప్రారంభిస్తే ఇంటికి కొత్త కళ పార్టీ కళ వచ్చేస్తుంది. పెరడు ఉంటే అక్కడ రెండు ఫ్లాష్లైట్లు వెలిగించండి. వంట పనులకు కూడా పనికి వస్తుంది. దీనికి ముందు ఇల్లు నీట్‌గా సర్దుకోండి. కొత్త కర్టెన్లు వేలాడగట్టినా మంచాల మీద కొత్త దుప్పట్లు పరిచినా కొత్త కళ వచ్చేస్తుంది. షామియానా వేయండి షామియానా వేస్తే వచ్చే కళ వేరు. ఇంటి ముందు బుజ్జి షామియానా వేయించండి. పెరడు ఉంటే అక్కడ కూడా చిన్న షామియానా వేస్తే ఆ షామియానా కింద కుర్చీలు వేసుకుని కూచోబుద్ధవుతుంది. ఆ షామియానా కిందే వంట పనులు చేసుకుంటే ఆ హుషారే వేరు. అతిథులు డిసెంబర్ 31 మధ్యాహ్నానికే చేరుకుంటే సాయంత్రం నుంచి వంటలు మొదలెట్టుకోవచ్చు. అందరూ కలిసి సరదాగా వండొచ్చు. పార్టీలో పానీయాలు ఉంటే స్టార్టర్లు, పిల్లలకు స్నాక్స్, మెయిన్ కోర్సు, డిన్నర్ తర్వాత డిజర్ట్లు, సరిగ్గా 12 గంటలకు కోయడానికి కేక్ ఇవన్నీ సిద్ధం చేసుకోవడమే ఒక పార్టీ. అదంతా ఎంజాయ్ చేయండి. అదే సమయంలో డైనింగ్ టేబుల్ని కూడా అందంగా అలకరించండి. అందమైన ప్లేట్లు బయటకు తీయండి. ఆ పార్టీ... ఆ భోజనం రెండూ గుర్తుండిపోవాలి. ఫొటో కార్నర్ ఇంట్లో ఏ ప్రాంతంలో మంచి ఫోటోలు వస్తాయో అక్కడ ఒక ఫోటో కార్నర్ ఏర్పాటు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 అని రాసిన ఫ్రేమ్ తయారు చేసి దాని వెనుక నిలబడి ఫొటోలు దిగవచ్చు. లేదా అలాంటి అక్షరాలు హ్యాంగ్ చేసిన గోడ దగ్గర అయినా సరే. ఫొటోలు బాగా వచ్చే సెల్‌ఫోన్‌నే వాడండి. అందరూ నవ్వుతూ సంతోషంగా ఫొటోలు దిగండి. రోజులు గడిచిపోతాయి. కాని ఫోటోలు నిలిచిపోతాయి. మన ఇంటి పెద్దలతో తప్పక గ్రూప్ ఫోటో దిగండి. ఫోన్లు చేయండి పార్టీ ఒక వైపు నడుస్తుంటుంది. మీరు మీ అయిన వారికి ఆత్మీయులకు వీడియో కాల్స్ చేస్తూ మీ దగ్గరే వారు కూడా ఉన్నట్టు వారి దగ్గర మీరూ ఉన్నట్టు ఫీల్ రానివ్వండి. కెమెరాను ఇల్లంతా జూమ్ చేస్తూ పార్టీ హడావిడి చూపించండి. వారి హడావిడి చూస్తూ జోక్స్ కట్ చేయండి. చాలా రోజులుగా పలకరించని మిత్రులను పలకరించండి. కొత్త సంవత్సరం మన బంధాలు మరింత గట్టి పడాలని కోరుకోండి. ప్రార్థన చేయండి కొత్త సంవత్సర ఘడియలు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా కూచుని ప్రార్థన చేయండి. ప్రార్థన వంటి పదాలు నచ్చని వారు ఈ విశ్వంలోకి పాజిటివ్ ఆలోచనలు పంపండి. అందరూ బాగుండాలని అంతా మంచే జరగాలని కోరుకోండి. మీరు ఎంత గట్టిగా కోరుకుంటే ఈ విశ్వం అంత బాగుంటుంది. న్యూ ఇయర్ పార్టీకి ఈ పద్ధతిలో రెడీ అయిపోండి. హ్యాపీగా జరుపుకోండి. సురక్షితంగా జరుపుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యూజిక్ అండ్ డాన్స్ పార్టీలో మ్యూజిక్ లేకపోయినా డాన్స్ లేకపోయినా అస్సలు బాగోదు. అద్దెకు బాక్సులు దొరుకుతాయి. తెచ్చుకోండి. లేదా సొంతవి ఉంటే రెడీ చేసుకోండి. రకరకాల మ్యూజిక్ యాప్‌లు ఉన్నాయి. వాటి నుంచి మంచి డాన్స్ నంబర్లు ప్లే చేయండి. షామియానా కిందో, ఇంటి డాబా పైనో చిన్న స్టేజ్ కట్టుకుంటే అందరి నృత్యకౌశలం చూసి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఫస్ట్ సెకండ్ అని పోటీ పెట్టకండి. వారు ఏ చిన్న కళ ప్రదర్శించినా ఒక బహుమతి ఇవ్వండి. మన ఇంటి పాట వీధికి కళ తెస్తుంది. వీధికి కళ వస్తే ఊరికి వస్తుంది. అలాగని మరీ పెద్దగా సౌండ్ పెట్టకండి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి. డిస్ట్రబ్ చేస్తున్నట్టుగా కాదు. -
Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత!
న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరుగుతున్న కారణంగా దేశ రాజధానిలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ మంగళవారం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గడచిన ఆరునెలల్లో (జూన్ 9 నుంచి) నమోదైన కేసుల కంటే కేవలం ఒక్క రోజులోనే 331 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువ నమోదైతే లేదా ఏడు రోజుల వ్యవధిలో వరుసగా పాజిటివ్ కేసులు 1,500 దాటితే ‘ఎల్లో అలర్ట్' విధించే అవకాశం ఉందని తెల్పింది. ‘ఎల్లో అలర్ట్' దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. తాజా ఆంక్షలివే.. తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరి - బేసి ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బర్ షాప్‌లు మామూలుగానే తెరచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో (ప్రయాణికులు నిలబడకూడదు) పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలయ్యేంతవరకు అన్ని పొలిటికల్, సామాజిక, మత పరమైన సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. చదవండి: Pigcasso Artwork: కుంచె పట్టి రంగుల చిత్రాలు గీస్తున్న పంది! -
న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.. కేరళలో నైట్ కర్ఫ్యూ
కొత్త ఏడాది వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకల కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూకి సిద్ధమైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్టేట్స్ అప్రమత్తం అయ్యి నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కేరళ చేరింది. అయితే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2, 2022 దాకా.. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ఈ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. కొవిడ్-19 పరిస్థితిపై సోమవారం నిర్వహించిన సమీక్ష అనంతరం పినరయి విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జనసందోహం గుమిగూడే అవకాశం ఉన్నందున, వైరస్ విజృంభించొచ్చని కేబినెట్ అభిప్రాయపడింది. అనవసరంగా గుమిగూడడం, ప్రయాణాలు నైట్ కర్ఫ్యూ టైంలో నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇక 31వ తేదీ రాత్రి పబ్‌లు, బార్లు, హోటళ్లు సైతం 10గం.కే మూతపడాల్సిందే. బీచ్‌లు, రోడ్లు అన్నీ పోలీసుల నజర్లో ఉంటాయి. అంటే.. 31తేదీ నాడు రాత్రి పది తర్వాత వేడుకలు ఉండయన్నమాట! -
కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
-
అప్రమత్తమైన ఢిల్లీ.. రాత్రి 11 నుంచి 5 వరకు కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ విజృంభణతో ఢిల్లీ అప్రమత్తమైంది. దేశ రాజధానిలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలుచేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటిదాకా ఆంక్షలు అమల్లో ఉంటాయి. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ప్రకటించారు. డిసెంబరు 28 నుంచి 10 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదింటిదాకా కర్ఫ్యూను అమలు చేస్తారు. నూతన సంవత్సర వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటాన్ని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో 23నుంచే నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. యూపీలో 25 నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. (చదవండి: ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ)