
సాక్షి, అమరావతి: తమిళనాడులో రాత్రివేళ లాక్‌డౌన్ విధించడంతో ఏపీఎస్‌ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక లాక్‌డౌన్ అమలులోకి వచ్చినందున బస్ సర్వీసుల విషయంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం పలు సూచనలు చేశారు.
తమిళనాడు వైపు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లు భర్తీ చేయాలని, సిబ్బంది రెండు సార్లు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని, ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. తమిళనాడులో లాక్‌డౌన్ అమలులోకి వచ్చే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఏపీ బోర్డర్‌కు చేరుకోవాలని సూచించారు.