సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి వేళల్లో అమలుచేస్తున్న కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రోజూ రాత్రి 11 నుంచి మరుసటిరోజు ఉ.6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, ఐపీసీ సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొంది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
30 వరకు నైట్ కర్ఫ్యూ
Published Sun, Sep 19 2021 5:36 AM | Last Updated on Sun, Sep 19 2021 1:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment